Blog

బస్సులు…కస్సు బుస్సులు

“ఇక మా ఊరు వెళ్తామండి, ఇక్కడికి వచ్చి  వారం అయ్యింది. పండగలు అన్ని అయ్యాయి కదా,మళ్ళి పండక్కి అందరం వచ్చేస్తాం” అంటూ పెట్టె లో దండం మీద ఆరేసుకున్న బట్టల్ని సర్దుకుంటున్నారు వచ్చిన చుట్టాలు. “ఇంకో రెండురోజులు ఆగి ,వెళ్ళచ్చు కదా” అని , ఫార్మాలిటీ కోసం ప్రశ్న వేసింది వచ్చిన గెస్ట్ లకి ఆతిధ్యం ఇచ్చిన ఒక ఇల్లాలు. “లేదు లేదు మళ్ళి వచ్చేస్తాం వచ్చే పండక్కి”, అంటూ బాగ్ లు పుచ్చుకుని, పిల్లా, జెల్లా లతో బస్సు ఎక్కడానికి గేట్ లో కి నడుచుకుంటూ వెళ్లారు ఆ వచ్చిన చుట్టాలు .

అసలే పండుగ సీజన్, ఇక్కడనుంచి మొత్తానికి అమలాపురం వెళ్ళిపోతే అక్కడనుండి ఎక్సప్రెస్ బస్సు పట్టుకుని మన ఊరు వెళ్లిపోవచ్చు అని చుట్టం లో ఒకడు చుట్ట కాలుస్తూ అంటున్నాడు. బస్టాండ్ లో జనాలు కిట కిట లాడుతున్నారు. ఎప్పుడు బస్సు వస్తుందా…అని ఎదురు చూపులు. దూరంగా బస్సు హార్న్ విన్పించింది.

బస్సు డ్రైవర్ దూరం గా బస్టాండ్ లో నున్న జన సంద్రాన్ని చూసి, బెంబేలెత్తి పోయి, బస్సు స్టాండ్ కి కొంచం ముందరున్న నిమ్మకాయలోళ్ళ మేడ దగ్గెర బస్సు ఆపేసాడు, దిగే వాళ్ళని దించడానికి.బస్టాండ్ లో వెయిట్చేస్తున్న జనాలందరూ అక్కడికి పరిగెత్తుతున్నారు ఆపిన బస్సు ఎక్కేడానికి. బస్సు లో కండక్టర్ కిటికీ లోంచి తల పెట్టి నిక్కచ్చి గా చెప్పేసాడు చిల్లరుంటే నే ఎక్కండి, వెనకాల ఖాళీ గా బస్సు వస్తోంది అని.

బస్సు స్టాండ్ నుంచి పరిగెత్తి సాధించిన కొంతమంది చిల్లర లేని వాళ్లు,దిగే జనాల్ని తోసుకుంటూ ధైర్యం గా ఎక్కేసారు.చిల్లర ఉన్నవాళ్లు బస్సు ఎక్కే ధైర్యం లేకా , కిందే ఉండిపోయారు.మొత్తానికి ఈ బస్సు బయలుదేరింది పండగ జనాల్ని మోస్తూ.

నిమ్మకాయలోళ్ళ మేడ దగ్గెర భంగపాటు జరిగిన చిల్లరున్న జనాలు శపధం చేసేసారు. “ఈసారి వచ్చే బస్సు ఇక్కడే ఆగుతుంది. ఆగిన వెంటనే బాగ్ లేసుకుని ఎక్కేద్దామని”. మళ్ళి బస్సు హార్న్ వినిపించింది. ఈసారి బస్సు డ్రైవర్ నిమ్మకాయలోళ్ళ మేడ దగ్గెర ఆపకుండా బస్టాండ్ లోనే ఆపాడు. ఈసారి మేడ దగ్గెర వెయిట్ చేస్తున్న జనాలు బస్టాండ్ వైపుకి పరిగెత్తారు. అప్పటికే బస్టాండ్ లో వెయిట్ చేస్తున్న చాల మంది లో కొంతమంది చిల్లర చూపిస్తూ బస్సు ఎక్కేసారు. కొంతమంది ఆయాసం తో పరుగులు పెడుతూ బస్సు వెళ్లిపోయిందని బాధతో తిట్లు మొదలెట్టేసారు.

ఇలాగ మొత్తానికి చాల మంది ఏవరి ఊళ్ళ కి వాళ్ళు వెళ్లలేక, చూద్దామనుకున్న మాట్నీ సినిమా చూడలేక, ఎక్కడనుంచి బయలుదేరారో, మళ్ళి అక్కడికే వెళ్లారు….
***********
అమలాపురం బస్టాండ్ లో ,ఆగి ఉన్న బస్సు బయలు దేరుటకు సిద్ధం గా ఉంది. ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంది. దాంతో ఈ బస్సు ముందరే బయలు దేరిపోతుందని జనాలు ఎక్కేసి కూర్చున్నారు. లోపల ఇంజిన్ గోల పెడుతోంది. చిన్న పిల్లలు గాలి తగలక ఏడుస్తున్నారు. తల్లులు విసుక్కుంటూ ఊరుకో పెడుతున్నారు.

ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ… చేస్తూ కూర్చున్న జనాలు, దూరం గా జేబు రుమాలు తో మూతి తుడుచుకుంటూ వస్తున్న డ్రైవర్, కండెక్టర్ ల ని చూసి, చాలా వెయిట్ చేసిన తరువాత చూసే తిరుపతి వెంకన్న దర్శనం లాగ ఫీల్ అయ్యిపోయి, సంతోషం తో ఉబ్బి తబ్బిబు అవుతున్నారు. బస్సు మెల్లగా బయల్దేరింది. కిటికీ లో నుంచి గాలి తగలడం తో,చంటి పిల్లలు ఏడుపు ఆపారు.

కొంత దూరం వెళ్లిన తరువాత ఎర్రవంతెన స్టాప్ వచ్చింది. అప్పటిదాకా ఏదో రాసుకుంటున్న కండెక్టర్, టికెట్ కొట్టడం మొదలెట్టాడు. జనాలని  తోసుకుంటూ వెనక్కి వస్తున్నాడు టికెట్ టికెట్ అంటూ. డ్రైవర్ బస్సు ని రోడ్డు ఎడమ వైపుకి ఆపి, కిందకి దిగాడు. మళ్ళి చంటి పిల్లలు ఏడవటం మొదలెట్టేసారు. చిల్లర ఇవ్వని వాళ్ళకి కండెక్టర్ టికెట్ వెనకాలవైపు రాస్తున్నాడు, దిగేటప్పుడు చిల్లర ఇస్తానని, మొత్తానికి అరగంట టికెట్ కొట్టిన తరువాత , చంటి పిల్లల ఏడుపు పెడబొబ్బలతో బస్సు బయల్దేరింది.

కొద్ది సేపటికి భట్నవిల్లి స్టాప్ వచ్చింది .బస్సు స్లో గా కాఫీ హోటల్ దగ్గెర ఆపాడు. డ్రైవర్ బస్సు దిగాడు. అతనితో పాటు కండెక్టర్ కూడా మెల్లగా దిగి హోటల్ లో కి ఇద్దరూ చేరారు. ఈలోపులో కొంత మంది ప్రయాణికులు కూడా బస్సు దిగి, హోటల్ లో టీ తాగుదామని వెళ్లారు . డ్రైవర్, కండెక్టర్ లు మైసూర్ బజ్జి తినేసి, టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. బస్సు లో చిన్న పిల్లలు కిటికీ లో నుంచి చూస్తున్నారు మళ్ళి బస్సు ఎప్పడు బయలు దేరుతుందా అని. చంటి పిల్లలు ఏడ్చి ఏడ్చి అలసి పడుకుండి పోయారు.

బస్సు బయల్దేరింది. పెద్ద మిల్లు వచ్చింది.బస్సు చివరి సీట్ లో కూర్చున్న ప్రయాణికుడు లేచి నించున్న జనాలని తొక్కుకుంటూ అనాతరం స్టాప్ లో దిగడానికి కండక్టర్ సీట్ దగ్గెరికి వచ్చి టికెట్ ముక్క చూపించాడు. కండెక్టర్ టికెట్ వెనకాల చూసి, ఎవయ్యా నీ స్టాప్ రాకూండానే ముందరే వచ్చి, డోర్ కి అడ్డం గా ఉన్నావు, ఉండు ఇక్కడ ఇంకోలు దిగుతారు. నీకిస్తాను, మీఇద్దరు చిల్లర మార్చుకోండి అని నోట్ ఇచ్చి . స్టాప్ స్టాప్ అని అన్నాడు.

అప్పుడే బస్సు ఆగింది అని గ్రహించి, ఇక్కడే దిగాలి అనుకుంటూ వెనకాల సీట్ లో కూర్చున్న ఇంకో ప్రయాణికుడు కంగారు గా, జనాలని తోసుకుంటూ, వాళ్ళ చేత తిట్లు తింటూ,కండెక్టర్ సీట్ దగ్గెర కి వచ్చాడు. ఏమయ్యా, తెలియదా నీ స్టాప్ ఎక్కడ దిగాలో, ముందరే రావాలి అంటూ ఆ ప్రయాణికున్ని దుమ్మెత్తి పోస్తూ, అదిగో ఆయన చిల్లర మార్చి ఇస్తాడు దిగు దిగు అంటూ, రైట్ రైట్ అని అన్నాడు కండక్టర్.

బస్సు బయలు దేరింది దుమ్ము లేపుకుంటూ…….దిగిన ఇద్దరూ చిల్లర మార్చుకోవాడనికి అక్కడున్న కొట్లు తిరుగుతూనే ఉన్నారు…
*************************************
ప్రసాద్ ఓరుగంటి

The Proposal (A ‘Cloud’ based love story)

Manoj and Esha are in love and decided to marry. 

Hey Manoj  , “You know right! my parents should know about our love chapter and  they are the decision makers for our marriage” said Esha. “Yes Esha , I am aware of that, however my parents knew about our love story. I spoke to them on phone last week. So I am so confident that  I have a capacity to convince your parents on our marriage. I will handle it completely. Don’t worry” replied Manoj.

 Anyhow I am going to India right now, so I will go to your parents’ house ,talk to them and explain our long love story. Definitely they will accept our marriage proposal when I start presenting our love story to them,” confidently laughed by Manoj. 

“Hey Esha, one more thing. Don’t call to your parents and tell them I am coming to India and meet them. So that it will be a big surprise for them and also its thrilling for me” said  Manoj and laughed confidently.

Finally Manoj landed in  India, The day has come to meet Esha parents. With his overconfidence on presentation and convincing skills,  he never prepared what to talk to her parents. He  polished the shoes nicely and picked tea short and Jeans to wear initially, but finally decided to wear formal dress. 

He opened the Uber app on his phone and set Esha’s parents address. Uber car reached his house after 20 mins. Finally he started to go his fiancée’s parents’ house.

After struggling with heavy traffic on the road, Manoj reached his destination. Manoj knocked the Door with confidence, but no reply from inside. He saw calling bell trigger right side of the door. He pressed the calling bell twice. Tring..Tring…Finally someone opened the Door

*****************

Esha’s dad opened the Door. Manoj got shocked and sweated unknowingly  when he saw Esha’s father.

Esha’s father: You are Manoj right, Come Inside.

Manoj: Yeah…Uncle.. I ammmmmm Manoj. (with low voice)

Esha’s Father: Come and Sit down here, do you have coffee/Tea/soda anything?

Manoj: No Thanks.. Unnnncle. (with low voice and legs shivering.)

Esha’s Father: Whats up man, How z the work and what’s the purpose of visit here.

Manoj: Work is good sir, I just wanted to say Hi  to you and go…

Esha’s Father: Oh!, Is it? you came here to say Hi to me and go. That’s it?, Fine. Have a tea and snacks and go home.

Manoj: Uncleeeee….(with low voice) , ( later make it little bigger).. Uncle…

Esha’s father: What, tell me man!  is there anything to talk to me other than Hai/Hello?

Manoj: (Tense inside): No… uncle…Yes… Uncle….want to talk to you. (with Low voice)

Esha’s father: Oh, Oaky. Tell me Manoj.

Manoj:  …ZZZZUORA…and me

(Blank Face…Unable to speak, but some stammering words) 

Esha’s father: Who is she , ZUoRa is Eesha’s friend? What happened to Zuora?, is she alright?

Manoj: Sorry uncle..…Not ZZZZOURA, DDDDDocusign….(with stammering words.)

Esha’s father: who is He, DocuSign is a boy? What are you trying to say me about Zuora Girl and DocuSign Boy?  Both are your friends? Or Esha’s friends?…Come on….Manoj!.. What do you want to  tell me with that boy and girl?

Manoj: No sir.. No Zuora.. No Docusign……me and  (No words……sweating …unable to speak….)

Esha’s father: Then ! Do you want to tell some other thing?  and laughed immediately at Manoj

I know Manoj. Esha spoke to me last week about your trip and your love story, I hope you came here to talk about your marriage right.. he asked loudly?

Manoj: smiles and Yes sir…no…Uncle, we both are in love and decided to marry. Now I came here to talk about this only. But I didn’t get words when I see you, don’t know the reason….

Esha’s Mother: smiles, hey Manoj…Have a coffee and relax.

Eesha’s Parents: We accepted and Approved , will talk to your parents and lets see the idle date for your marrage..

Manoj: completely relaxed and called to Esha. Hey Eesha’s I spoke to your parents and convinced. You know how did I convince your dad to get approved.

Esha: Oh Really….I know everything…..you talked about Zuora and Docusign only  with my dad, not about our love. 

Manoj: %%^%^*&**(*(*(*(*(*&&(*))

The proposal has been reviewed, approved and signed by all parties…The deal has been CLOSED WON.

************************************************

Written by Prasad Oruganti.

హై స్కూల్ రోజుల్లో… ఒక రోజు !!!!

సమయం ఉదయం 9 గంటల 40 నిముషాలు. రేడియో లో చిత్ర తరంగిణిలో చివరగా ఈ పాట అంటూ టాటా..గుడ్ bye అంటూ అక్కినేని పాట వేస్తున్నాడు. గబగబా భోజనం చేసేసి గదిలో ఉన్న పుస్తకాలని సర్దేసుకుని, బయట ఉన్న చెప్పుల్ని వేసేసుకుని అమ్మా స్కూల్ కి వెళ్తున్నాం అని గట్టిగా చెప్పేసి బయట పడ్డా.

అప్పటికీ వీధిలో భుజాన బుక్కులేసుకున్న పి.రమేష్, సత్తి, జాను, ఆసు గాడు, రెడీ గా ఉన్నారు స్కూల్ కి వెళ్ళడానికి. ఈలోపులో చిన్న కేక వినిపించింది వెనకనుండి. అది రాజా గాడు .నేను కూడా వస్తున్నా ఆగండి రా అంటూ, మేనల్లుడు బాలు గాడి బుగ్గన గిల్లుతూ, పరిగెత్తుకుని వచ్చేశాడు. వాడి వెనక వాళ్ళ అన్న సురేష్, ఈలోపులో మా వాళ్ళు నరేష్, రమేష్ లు కూడా ఇంట్లో నుంచి వచ్చేసారు.

మూల వీధి నుంచి పరుగు శబ్దం వినిపించింది. ఎవడో వస్తున్నాడు అని అనుకున్నాం. నేను వచ్చేసా అంటూ పి రవి పలకరింపు.అందరం గుమిగూడారు.శేఖర్ గాడు ఏడీ అంటూ ఎవడో సత్తిగాడిని అడిగాడు వాడు సంతపాకల్లో నుంచి రాడంట, అసలే ఇవ్వాళా మంగళారం సంత. అక్కడ కోళ్ల ని కోసే రోజు కదా అని బెల్లంముక్క చప్పరిస్తూ ఉన్న జాను గాడు టక్కున అనేశాడు.పక్కనే ఉన్న ఆసు గాడు ముక్కు మూసుకున్నాడు జాను గాడు కోడి అనేటప్పటికీ.

అప్పటికే రెడీ అయ్యిపోయి మా గురుంచి వెయిట్ చేస్తున్న హనుమాన్ దూరం గా వాళ్ళ ఇంటి దగ్గెర చూస్తున్నాడు. చక్కగా ముస్తాబయ్యి నేను రెడీ అంటూ జి రవి వాళ్ళ ఇంటిదగ్గర కూర్చుని ఉన్నాడు. అందరూ నడుస్తూ ఉంటె, మెల్ల గా మూడో వీధి నుంచి వచ్చి గుప్తా గాడు వచ్చి జాయిన్ అయ్యాడు.

కుమ్మరెంకన్న ఇంటి దగ్గెర వచ్చేటప్పటికి, అక్కడ కోళ్లు ఇటూ అటూ పరిగెడుతున్నాయి మా నడక శబ్దానికి. కుమ్మరెంకన్న మట్టితో కుండల్ని చేస్తున్నాడు.వెళ్తూ వెళ్తూ ఆసు గాడు అక్కడున్న మట్టి ని తీసి పక్కనున్న వాళ్ళ మీద వేద్దామనుకున్నాడు సరదాగా. ఎంక్కన్న చూడటం తో ఆ పనిని విరమించుకున్నాడు.అందరూ సంత పాకల మీద నుంచి నడవటం మొదలెట్టేసాం. అప్పటికే శరభయ్య సైకిల్ మీద నుంచి బెల్లం బుట్ట దింపుతున్నాడు. జాను గాడి బుగ్గలో లో నున్న బెల్లాన్ని చూసి, నాకు శరభయ్య ని బెల్లం ముక్క అడగాలనిపించింది. మళ్ళి తమాయించుకుని సాయంత్రం సంత కొచ్చినప్పుడు అడుగుదాములే అని సర్దేసుకున్నా. అక్కడున్న ముత్యాలమ్మ గుడిలో ఎవరో అక్కడ కుంకుం బొట్టేట్టుకుని ,అరటి పళ్ళు ఇస్తూ కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్నారు. సంత లో మాంసం కొట్టు వాళ్ళు కూడా బుట్ట లని దింపుతున్నారు. కుక్కలు కూడా సంతలో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాయి.

అప్పటికే కోటా వాళ్ళు చేసిన పోకుండ లని, వేరుశెనగ అచ్చులని తీసి బల్ల మీద సర్దుతున్నారు. అక్కడున్న జీళ్ళు చూసి ఇక్కడ బావుండవ్, ఇవన్నీ ముక్కుపోయిన జీళ్లు. అమలాపురం లో జీళ్లు బావుంటాయి అని సురేష్ అన్నాడు. అవును రా అంటూ మిగతావాళ్ళు అన్నారు. కొంచం ముందరకి వెళ్ళేటప్పటికి సైకిల్ వెనకాల కట్టిన కోళ్లు అరుస్తున్నాయి. ఈలోపులో ఎవడో అన్నాడు, మనం మధ్యాన్నం వచ్చేటప్పటికి ఈ కోళ్లు అన్ని ఇక్కడ వేలాడుతూ ఉంటాయి అని. అక్కడ నుంచి కొంచం స్పీడ్ నడక మొదలెట్టాం. అప్పటికే దూరం గా స్కూల్ లో పిల్లలు అంతా చేరుకుంటున్నారు మార్నింగ్ అసెంబ్లీ కి. కుడివైపున స్మశానం కేసి చూడకుండా కొంచం పరుగులాంటి నడకతో ఈ గ్యాంగ్ అంతా హై స్కూల్ కి చేరుకున్నాం.

ఎవరి క్లాస్ లో వాళ్ళు దూరారు. అసలే బత్తుల రామమూర్తి గారి క్లాస్. నిన్న ఇచ్చిన హోమ్ వర్క్ లో నోట్ బుక్ మీద మార్జిన్ సరిగా గీయలేదు. ఈలోపులో అందర్నీ హోమ్ వర్క్ బుక్ లని టేబుల్ మీద పెట్టాలని ఆదేశం. అలాగే జామ చెట్టు కర్ర ని కూడా తీసుకురావాలని భట్నవిల్లి బులుసుగాడికి ఉపదేశం. వాడు తుర్రున వెళ్లి చెరువు గట్టుకి ఆనుకుని ఉన్న జామ చెట్టు ఎక్కి చిన్న కొమ్మని విరగగొట్టి, కొమ్మకున్న ఆకులని తెంపి, విజయ గర్వం తో ఆ కర్ర ని టేబుల్ మీద పెట్టాడు. వాడి తోనే మొదలయిన ఆ దెబ్బలకి క్లాస్ అంతా హహ కారాలు. ఈలోపులో టంగు టంగు మని గంగయ్య బెల్. ఆ బెల్లు శబ్దం వినగానే పిల్లల్లో ఒక విధమైన ఆనందం. ఆ ఆనందాన్ని లోపలే దాచేసుకుని ఇంకొక క్లాస్ కి రెడీ.

చిన్న తెలుగు మాస్టర్ గారి క్లాస్ నడుస్తోంది. పద్యాలూ పాడుతుండగా…గంగయ్య మెల్లగా క్లాస్ లో చిన్న నోటీసు తో రాక. ఆ రాక కి పిల్లల మది లో ఎన్నో ప్రశ్నలు. రేపు సెలవిస్తారని , లేదు ఈరోజు మధ్యాహ్నం నుంచి స్కూల్ సెలవని. ఈలోపులో చిన్న తెలుగు మాస్టర్ తన చక్కని స్వరం తో రేపు సెలవు, మళ్ళి ఎల్లుండే స్కూల్ అని నోటీసు చదువుతూ ఉండగానే మొదలయిన పిల్లల సందడి. ఈ సందడి కి ఆయన గట్టిగా ఒక కేక…ఆ కేక కి మళ్ళి పిల్లలు పిన్ డ్రాప్ సైలెన్స్.

ఈలోపులో ఇంటర్వెల్ బెల్ కొట్టాడు పొడుగు కాళ్ళ భూషణం, గంగయ్య పని మీదకి బయటికి వెళ్లడంతో. అంతే ఒక్క ఉదుటున పిల్లలంతా పరుగు పెట్టుకుంటూ గ్రౌండ్ లో కి కొంత మంది, మంచి నీళ్లు తాగుదామని నేను, భట్నవిల్లి నాగరాజు గాడు, రమేషు, జాను గాడు, ఆసు గాడు బయలుదేరాం కాలువ అవతలపక్కనున్న ధాన్యం మిల్లు నుయ్య దగ్గెర కి. అప్పటికే చాల మంది నీళ్లు దోసిళ్ళలో తాగేస్తున్నారు. నాగరాజు గాడు అన్నాడు నేను నీళ్లు తోడుతా, మీరందరూ దోసిళ్ళు పట్టండి అని.వాడు నీళ్లు పోస్తూ..పోస్తూ..ఆసు గాడి బట్టల మీద పోసేసాడు. వాడు ఒకటే ఏడుపు. వాణ్ని సముదాయించడానికి నాగరాజు గాడు సత్యనారాయణ బడ్డీ కొట్లో గరగర డ్రింక్ (ఐస్ ని అరగదీసి, దాంట్లో ఏదో కలర్ కలిపి, పైన సేమ్యా వేసి) తాగించాడు.వాడి తో పాటు మాకందరికీ ఇప్పించి, మిగతా చిల్లర ని లెక్కెట్టుకుని పై జేబులో వేసుకున్నాడు.కొంతమంది పిల్లలు అప్పుడే వచ్చి సైకిల్ మీద పెట్టిన పీచుమిఠాయి లు కొనుక్కుని తింటూ స్కూల్ గోడ మీద వేసిన సినిమా పోస్టర్ లని చూస్తున్నారు.

అప్పుడే హిందీ టీచర్ మెల్లగా క్లాస్ లో కి వెళ్తోంది. హమ్మయ్య ఇప్పుడు మనకి హిందీ క్లాస్ అనుకుంటూ నాగరాజు ఇప్పించిన గరగర డ్రింక్ ని ఇంకా గుర్తు తెచ్చుకుంటూ క్లాస్ లో కి జారుకున్నాం.

సమయం ఒంటిగంట పది నిముషాలు. ఈసారి గంగయ్య లాంగ్ బెల్ కొట్టాడు. ఈ లాంగ్ బెల్ కి కొంత మంది పిల్లలు ఇంటి నుండి తెచ్చుకున్న లంచ్ బాక్స్ లను ఓపెన్ చేసేసి తినడం మొదలెట్టారు. శేఖర్ గాడు తో పాటు అందరం ఈ సారి సంత పాకల మీద నుండి కాకుండా. తిరిగి రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం. ఆనందరావు బడ్డీ దగ్గెర వచ్చేటప్పటికి దాహం వేసింది. ఆసు గాడు గోలి సోడా తాగుదామా అని అన్నాడు. శేఖర్ గాడు ఇప్పుడు తాగకూడదు అంటూ పక్కన ఉమ్మాడు. అప్పుడే పెద్దగాఢవిల్లి బస్సు టర్నింగ్ తిరుగుతోంది భీమన పల్లి రోడ్డుకి. పదండి పదండి అంటూ నరేష్, సురేష్ లు వెనకాల వస్తూ తొందర పెట్టారు.

గుడి పక్క కాన్వెంట్ దగ్గెర వచ్చేటప్పటికి అక్కడ కాన్వెంట్ పిల్లలు కనిపించారు. ఆసుగాడు ఊరుకోకుండా..”కాన్వెంట్ పిల్లలు కాకరకాయ ముక్కలు” అన్నాడు….నేను తగులుకుని “చిన్న స్కూల్ పిల్లలు చింత కాయ ముక్కలు అని అన్నా .అప్పుడే అటువస్తున్న పొట్టి సురేష్ గాడు “హైస్కూల్ పిల్లలు ఆవకాయ డొక్కలు అనేసి పారిపోయాడు”.వాడిని తరుముతూ మొత్తానికి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు.

రేడియో లో ప్రాంతీయ వార్తలు వస్తున్నాయి. గబా గబా అన్నం తినేసి, మళ్ళి అదే గ్యాంగ్ మధ్యాన్నం స్కూల్ కి బయలు దేరుతుంటే, విస్సప్ప గారి ఇసక కొట్లో మామిడి కాయలు కనిపించాయి జాను గాడికి. ఒక రాయి పైకి చెట్టు మీద కి విసిరాడు. అప్పుడే గేదెలని తీసుకుని కుమ్మరి మాలక్ష్మి వస్తోంది. జాను గాడు వేసిన రాయి గేదె తోక మీద పడింది. వెంటనే కుమ్మరి మాలక్ష్మి గట్టి గా అరుస్తూ ఉండగానే మళ్ళి స్కూల్ కి బయలుదేరాం.

గానుగ నూనె గానుగ నూనె అంటూ సైకిల్ మీద ఎవరో వీధిలో అమ్ముతూ వెళ్తున్నాడు దూరం గా. సంచి లని దులుపుకుంటూ పెద్ద లు సంత కి వెళ్తున్నారు కూర లు కొనుక్కోవడానికి.

సంత లో వేరుశెనగ పప్పు అచ్చు కొనుక్కోవాలి రా సాయంత్రం సంత కి వెళ్లినప్పుడు, అలాగే వెళ్తూ వెళ్తూ శరభయ్య బెల్లం కొట్లో బెల్లం ముక్క తినాలి అని స్కూల్ కి వెళ్తూ అన్నాను . అవును అక్కడ నానాజీ గాడు ఉంటాడు వాన్నడిగితే చిన్న ముక్క కూడా పెట్టలేదు లాస్ట్ వారం అని ఎవడో అన్నాడు. ఏరా సాయంత్రం బస్సు ఆట ఆడదామా లేదా దొంగా పోలీస్ ఆడదామా అని అడిగాడు పి. రమేష్. దొంగా పోలీస్ వద్దు రా బాబు, మొన్న మూడో వీధిలో ఆ ఇంట్లో దాక్కుంటే తెగ తిట్టేసారు అని ఆసు గాడు కొంచం దీనం గా అన్నాడు. ఈ మాటల్లో నే స్కూల్ వచ్చేసింది.

మధ్యాన్నం చెన్నా సాహెబ్ గారి సోషల్ క్లాస్ నడుస్తోంది. మళ్ళి గంగయ్య క్లాస్ లో కి మెల్లగా ఆయన చెవిలో వచ్చి ఏదో ఊదాడు. పొద్దున్నే వచ్చి నోటీసు తెచ్చి మా కందరికీ తీపు కబురు “రేపు సెలవు” అని చెప్పేసాడు కదా మళ్ళా ఏంటి ఈ చెవి లో ఉపదేశాలు అని అనుకుంటుండగానే, ఇదిగో కుర్రాళ్ళు! నంది కేశుని నోము అంట ఊళ్ళో, కాబట్టి మీరు అక్కడకి వెళ్లి తినేసి వచ్చేయండి అనేసి కుర్రాళ్ళకి ఆదేశం. పక్కనే ఉన్న దూనబోయిన నాగరాజు గాడు,దొంగ త్రినాథ్ బాబు లు ఒరేయి అవన్నీ మీకే అంట తినేసి వచ్చేయండి అనేసి అన్నారు నవ్వుతూ. అవును రా … స్పెషల్ పర్మిషన్ వచ్చిందట హెడ్ మాస్టర్ దగ్గెర నుంచి అనేసి, విజయ గర్వం తో భట్నవిల్లి కుర్రాళ్ళు లతో పాటు,అందరమూ సాయం కాల స్నాక్స్ కి నంది కేశుని నోము ని పండించడానికి బయలుదేరాం. అందర్నీ కూర్చో బెట్టారు, విస్తళ్ళు వేశారు. తినే ముందరే చిన్న సైజు వార్నింగ్ ఇచ్చారు కూర్చున్న పిల్లలకి. “ఆకులో పెట్టింది వదిలారో, తస్మాత్ జాగ్రత్త” అంటూ. వడ్డించడం మొదలెట్టారు. పెడుతూనే ఉన్నారు.తింటూ ఉండగానే మళ్ళి వడ్డిస్తున్నారు.పాయసం వేస్తూనే ఉన్నారు.తిన తిన లేక తింటూ, తినకపోతే హెడ్ మాస్టర్ గారు ఏమి అనేస్తారో అని భయపడుతూ, తింటూ తింటూ, ఆయాసపడుతూ మొత్తానికి తినేసి బయట పడ్డాం. నంది కేశుని నోము కి మా లాంటి అమాయక కస్టమర్స్ ని గుర్తించి, హెడ్ మాస్టర్ తో మాట్లాడి,మరీ స్పెషల్ పర్మిషన్ తీసుకుని, మమ్మల్ని అందర్నీ స్కూల్ నుంచి తీసుకు వచ్చి ఆ విందుకు మీరే ముందు అని చెప్పిన బుచ్చి మాస్టర్ గారి మణి గారిని ఆ నోము విషయం లో ఎప్పటికీ మర్చిపోలేరు.

ఏరా సంత లో కి వెళ్తున్నా, వస్తావా వేరుశెనగపప్పు అచ్చు కొనుక్కుందాం. అలాగే వెళ్తూ వెళ్తూ శరభయ్య బెల్లం కొట్లో బెల్లం ముక్క తిందాం, వస్తూ వస్తూ జీళ్లు కొనేసుకుని వచ్చేద్దాం అని ఎవడో బయట నుండి అడుగుతున్నట్టు అనిపించింది. నాకు డౌట్ వచ్చింది. వీడు ఆ నోముకి వచ్చి ఉండడు అందుకే అడుగుతున్నాడేమో అని అనుకుని , నో.. నో ..అంటూ ఆ నోము ని తలచుకుని ఇంట్లో కి పరిగెత్తేసా..

ఇంకా చీకటి పడలేదు. ఆటలు ఆడుకోవడానికి ఎవరు రాలేదు. ఎవరింట్లో పిల్లలు అక్కడే ఉన్నారు. బయటికి వస్తే మళ్ళి ఆ విందు కు మీరే ముందు అంటారేమో అని అన్ని బంద్ చేసుకుని ఇంట్లోనే ఉన్నాం.
************************************************************************
రేపు బుధవారం. లెక్కలు నోట్ బుక్ లో రైట్ సైడ్ మార్జిన్ వంకర గా వచ్చింది. అది సరి జేసుకోవాలి. లేకపోతె….జామ కర్ర…

******************
ప్రసాద్ ఓరుగంటి.

బుల్లెట్…. (Bullet)

అతడి పేరు ఈశ్వర్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇతని తూటా లకి ప్రత్యర్థుల చావు బాటే, ఇతడి తో వైరం పొరబాటే. అసాంఘిక చర్యలు చేసేవాళ్ళకి ఇతడు యమకింకరుడు. దేశ ద్రోహుల కి సింహ స్వప్నం ఇతగాడు.
****
హే ఈశ్వర్, ఈ రాత్రి మనం ఫారెస్ట్ లో మానిటర్ చేయాలి. చందనం చెట్లు కొట్టి పట్టుకెళ్ళే దొంగలు వస్తున్నారని సమాచారం అందింది. సో నీ టీం తో అక్కడికెళ్లి మానిటర్ చేసి అవసరమయితే యాక్షన్ తీసుకోండి అని తన పై అధికారి ఆదేశమిచ్చాడు ఈశ్వర్ కి. ఎస్ సార్ అనేసి ఈశ్వర్, తన టీం తో రూట్ డిజైనింగు చేద్దామని అటెండర్ తో కాఫీ తెమ్మన్నాడు. అటెండర్ కాఫీ తీసుకొచ్చాడు. టీం అంతా రాత్రి ప్లాన్ గురుంచి చర్చించుకుంటున్నారు.

సమయం రాత్రి 9 గంటలు. ట్రింగ్..ట్రింగ్ మని ఫోను. సార్ మీకు ఇంటిదగ్గరనుంచి ఫోను అంటూ ఇచ్చాడు ఆ కాఫీ తెచ్చిన అటెండర్. ఈశ్వర్ రిసీవర్ ఎత్తాడు. అటుపక్కనుంచి ఈశ్వర్ భార్య సునీత భోజనానికి ఇంటికి వచ్చేస్తున్నారా అని అడిగింది. లేదు, నాకు పని ఉంది నేను రెండు రోజుల దాకా రాను. పిల్లలు ఏమి చేస్తున్నారు అని ఈశ్వర్ అడిగాడు. ఇదిగో పెద్దాడు హోంవర్క్ చేసి ఫోన్ లో గేమ్స్ చూస్తున్నాడు. చిన్నవాడు టాయ్ గన్స్ తో ఆడుకుంటున్నాడు అని నవ్వింది, వాడు కూడా మీలాగే స్పెషలిస్ట్ అవుతాడేమో అని మెల్లగా అంది. ఏమో చూద్దాం అంటూ ఫోన్ పెట్టేసాడు.

సమయం 11 గంటలు. ఈశ్వర్ అండ్ టీం అంతా రెడీ అయ్యారు ఫారెస్ట్ లో కి వెళ్ళడానికి. కావలసిన ఎక్విప్మెంట్స్ అంతా వాన్ లో ఎక్కించారు. అధునాతన గన్ లని కూడా సిద్ధం చేసుకున్నారు. ఈశ్వర్ కూడా తన ఫేవరెట్ గన్ తీసుకుని బుల్లెట్ లని లోడు చేసుకున్నాడు. అందరూ బయలు దేరారు.

చిమ్మ చీకటిలో వాన్ దూసికెళ్తోంది. దారి మద్యలో కొన్ని జింక లు రోడ్డు కి అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఈశ్వర్ డ్రైవర్ కి చెప్పి వాన్ ఇంజిన్ ఆపమన్నాడు, అలాగే హెడ్ లైట్స్ కూడా ఆపే మన్నాడు. తెచ్చుకున్న టార్చ్ లైట్ లతో అందరూ తలో దిక్కున దాక్కున్నారు. అందరూ గన్ లని రెడీ చేసుకుని సిద్ధం గా ఉన్నారు.

ఈశ్వర్ తన వాచ్ లో టైం చూసుకున్నాడు. సమయం రెండు గంటల పది నిముషాలు. కొన్ని పక్షులు అరుస్తున్నాయి. దూరం గా కదులుతున్న పొదలని చూసాడు ఈశ్వర్. అందర్నీ అప్రమత్తం చేసాడు. అవి దగ్గెర వచ్చేటప్పటికి అడివి పందులని తెల్సుకుని ఊపిరి పీల్చుకున్నారు అందరూ. కొంత సేపటికి దూరం గా లారీ ఇంజిన్ శబ్దం వినిపించింది. ఈశ్వర్ అటువైపు వెళ్తున్నాడు తన టీం తో.
****
ఇంట్లో ఈశ్వర్ భార్య, పిల్లలు పడుకున్నారో లేదో చూడమని పిల్ల ల బెదురూమ్ లో కెళ్ళింది. పెద్దవాడు పడుకున్నాడు. చిన్న వాడు నిద్రట్లో దిష్యుమ్ దిష్యుమ్ అంటూ చేతులు పైకెత్తుతూ కలవరిస్తున్నాడు.ఈశ్వర్ భార్య వెళ్లి వాడిని పడుకో పెట్టి దుప్పటి కప్పి తన బెడ్ రూమ్ కి వెళ్లి పడుకుంది.

అడవిలో ఈశ్వర్ టీం ని చూసి, లారీ లో ఉన్నవాళ్లు కాల్పులు మొదలెట్టారు. ఆ హఠాత్ పరిణామానికి ఈశ్వర్ కొంచం కంగారుపడి , మళ్ళి తన టీం ని రెడీ గా ఉండండి అని చెప్పి ఇక్కడ నుంచి ఈశ్వర్ టీం కాల్పులు మొదలెట్టారు. ఆ దొంగల కాల్పుల చేతిలో ఇద్దరు ఈశ్వర్ టీం సభ్యులు గాయ పడ్డారు. వెంటనే ఈశ్వర్ రంగంలోకి దిగి ప్రత్యర్థుల్ని మట్టికరిపించాడు. ఈశ్వర్ బుల్లెట్ లకి ఒకొక్కలే పడుతున్నారు. పడి ఉన్న దొంగల్ని పట్టుకుని వాళ్ళని వాన్ లో కి ఎక్కించారు.
****
ఈశ్వర్ అండ్ టీం ని అందరూ అభినందిస్తున్నారు. ఈశ్వర్ కూడా చాలా ఆనందం గా ఉన్నాడు. తాను పట్టుకున్న గన్ నుంచి వచ్చే ప్రతీ బుల్లెట్ తన ని యెంతో ఎత్తుకు తీసికెళ్తోంది అని అనుకున్నాడు. ఈ విజయానికి గుర్తు గా తన టీం కి తన పై అధికారులకి మంచి పార్టీ ఇద్దామని డిసైడ్ అయ్యాడు. అందర్నీ పిలిచాడు.
ఈశ్వర్ టీం సభ్యులు ఫామిలీ ల తో వచ్చారు. సెలెబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయి. ఒక పక్క పిల్ల లందరూ లోపల హాల్లో  వీడియో గేమ్ లు ఆడుకుంటున్నారు. మరొక పక్క ఆడవాళ్ళూ అంతా హాల్లో నే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకొక పక్క మగ వాళ్ళందరూ బయట డ్రింక్స్ తాగుతూ ఈశ్వర్ ఎన్కౌంటర్స్ గురుంచి చర్చించుకుంటున్నారు. ఈశ్వర్ భార్య అందర్నీ పలకరిస్తూ హడావిడి చేస్తోంది. ఒక పక్క పలకరిస్తూనే పిల్లలు ఏమి చేస్తున్నారో అంటూ హాల్లో చూస్తోంది . పెద్దవాడు తన తోటి పిల్లలకి వీడియో గేమ్స్ లో మెళకువలు నేర్పిస్తున్నాడు. వాళ్ళ కి తెలిసిన కొత్త అప్ లు వీడికి చెప్తున్నారు. చిన్న వాడు ఎక్కడున్నాడని వెతుకుతోంది. వాడు కనపడలేదు. ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు లే అని అనుకుని తన పని లో తాను బిజీ అయ్యింది.
ఈశ్వర్ కూడా తన టీం తో హాల్ బయట తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నాడు.బుల్లెట్ ల ని ఎలా ఉపగోయించాలి, అలాగే ప్రత్యర్ధులు అకస్మాత్తు గా దాడి చేస్తే, ఎలా ఎదుర్కోవాలి అని మెళకువలు నేర్పుతు లెక్చర్ లిస్తున్నాడు.
***
ఈలోపులోహాల్లో సడన్ గా కల కలం రేగింది. పిల్లందరూ గోల చేస్తున్నారు. అక్కడున్న ఆడవాళ్ళూ కూడా బెంబేలెత్తుతున్నారు, కానీ అక్కడ నుంచి ఎవరూ కదలట్లేదు. అలాగా భయం భయం గా ఆ మేడ వైపు కి చూస్తూ..
బయట ఉన్న మగాళ్లంతా ఆ అరుపులు విని,హాల్లో కి పరిగెత్తుకుంటూ వచ్చారు. కొంతమంది గన్ ల ని బయటికి తీసి హాళ్ళో కి పరిగెత్తారు, కానీ అక్కడున్న పరిస్థితి చూసి వాళ్ళ గన్ లని కిందన పెట్టి భయం భయం గా చూస్తున్నారు ఆ మేడ వైపుకి. ఈశ్వర్ కూడా తాగుతున్న గ్లాస్ ని బయట పడేసి తన ఎప్పుడూ పక్కనే ఉండే గన్ గురుంచి చూసాడు. అది కన పడలేదు. కొంచం కంగారు పడి హాల్లో కి వచ్చేసి మేడ వైపు కి చూసి ఆశ్చర్య పోయాడు. ఆ సమయం లో ఏమి చేయాలో అర్ధం కాలేదు. ఈశ్వర్ భార్య కూడా అలాగే చూస్తూ ఉంది పోయింది.

పైన మేడ మీద నుండి, ఈశ్వర్ రెండో కొడుకు ఆరేళ్ళ ఆర్నవ్ గన్ పట్టుకుని, ఒక వేలిని ట్రిగ్గర్ మీద ఉంచి అరుస్తున్నాడు. సెకను సెకను కి పొజిషన్ మారుస్తున్నాడు. ఒక సారి అక్కడున్న చిన్న పిల్ల ల మీదకి, ఇంకో సారి తల్లి బుజాల మీద నిద్రిస్తున్న పసి పిల్లల మీదకి, ఇంకో సారి అటువైపు వస్తున్నా మగాళ్ల మీద కి. కింద మగాళ్లందరి దగ్గెర గన్ లు ఉన్న, వాళ్ళు ఎవరు పోసిషన్ తీసుకోలేదు. అలాగా ఆశ్చర్యం గా, భయం గా చూస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పుడూ ఈశ్వర్ ఆదేశాల గురుంచి వెయిట్ చేస్తూ పొజిషన్ తీసుకుంటూ ఉంటారు, ఎప్పుడైనా ప్రత్యర్ధులు దాడి చేస్తే. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఈశ్వర్ దిక్కు తోచని స్థితి లో దిగులుగా చూస్తున్నాడు.
ఈ లోపులో ఈశ్వర్ భార్య సునీత తేరుకుంది, ఆర్నవ్ ఆర్నవ్ అంటూ గట్టిగా అరిచింది. మేడ మీద నుండి గన్ పోసిషన్ అమ్మ వైపు కి మార్చాడు. సునీత కొడుకు తో మెల్ల గా చెప్తోంది. ఆర్నవ్ నీకు తెలుసా , డాడీ నీకు రియల్ గన్స్ తీసుకొచ్చారు. అవి కింద గ్లాస్ రూమ్ లో ఉంచారు, సో ఆ టాయ్ గన్ కింద పెట్టి, కిందకు దిగు అని కొంచం భయం గా మెల్ల గా చెప్తోంది. కింద పిల్లలందరూ బిక్కమొఖాలేసుకుని ఆర్నవ్ కేసి, వాళ్ళ అమ్మకేసి చూస్తున్నారు. అమ్మ మాట విని, అయితే ఆ గన్ ని నువ్వే పైకి పట్టుకుని రా, అప్పుడు వదిలేస్తా అమ్మా అని రిప్లై ఇచ్చాడు ఈ సారి గన్ పొజిషన్ ఏడుస్తున్న ఒక కుర్రాడి వైపుకి తిప్పుతూ…ఆ దెబ్బకి ఆ కుర్రాడు ఏడుపు ఆపేసాడు. తల్లి కి ఏమి చేయాలో తెలియలేదు. హే ఆర్నవ్ నీకు నీ ఫ్రెండ్స్ చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చారు, ఆ గన్ పడేసి కిందకు రా చూపిస్తా అని మెల్లగా బుజ్జగించింది. వాడు విన లేదు. అక్కడున్న అందరూ భయ బ్రాంతులతో ఉన్నారు. ఈలోపులో సడన్ గా గన్ శబ్దం ధడేల్ ధడేల్ అని రెండు సార్లు మ్రోగింది.
***

ఇరవై ఏళ్ళ తరువాత….

హే ఆర్నవ్, ఈ రోజు మనం సిటీ కెళ్తున్నాం. టెర్రరిస్ట్స్ ఎటాక్ ఉందని సమాచారం అందింది. సో నైట్ కి మనం ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకుందాం అని టీం మెంబెర్ చెప్తున్నాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆర్నవ్ కి. ఎస్ ఐ యామ్ రెడీ, ఐ విల్ కిల్ థెం  అంటూ కాఫీ తాగుతున్నాడు. హే ఆర్నవ్ ఇంతకీ ఆ రోజు ఏమైంది, అదే నీ చిన్నప్పుడు మీ డాడీ ఈశ్వర్ గారు ఇచ్చిన పార్టీ లో నువ్వు గన్ పట్టుకుని హడావిడి చేసావు కదా,  చెప్పు, బి క్విక్ అంటూ ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకుంటున్నాడు ఆర్నవ్ టీం మెంబెర్.

ఓహ్ అదా..మా అమ్మా అప్పుడు నన్ను బాగానే బుజ్జగించింది.నేను వినలేదు. మా డాడీ కూడా కింద నుండే చూస్తున్నారు, అలాగే అంకుల్స్ కూడా…అప్పటికి అందరూ సైలెంట్ గా ఉన్నారు. మా అన్న గాడు వీడియో గేమ్స్ లో ఒక అప్ ఓపెన్ చేసి టీవీ వాల్యూం ఫుల్ పెట్టి రెండు గన్ షాట్స్ చేసాడు. ఆ వాల్యూం కి నేను భయపడి గన్ పడేసాను. ఇదంతా మా డాడీ ఐడియా. బ్యాక్ నుండి నడిపించారు. తరువాత నాకు టైంఔట్ లు, మొట్టికాయలు ,నో గిఫ్ట్స్ అలాగా.

తరువాత, నా ఇంటరెస్ట్ మీద మళ్ళి నేను మా డాడీ లాగానే స్పెషలిస్ట్ అయ్యా…లెట్స్ ఫినిష్ టెర్రరిస్ట్స్ టుడే.. లెట్స్ గో సిటీ అంటూ ఆర్నవ్ అండ్ టీం బయల్దేరారు ముష్కరులని అంతమొందించడానికి.

*************************
ప్రసాద్ ఓరుగంటి

ఎర్ర కాలువ (ఎర్ర ని థ్రిల్లర్ కథ)

అక్కడ ప్రదేశం చిమ్మ చీకటి గా ఉంది. ఒక ఆతను సైకిల్ మీద వెళ్తూ అక్కడ ఆగాడు. అక్కడున్న చిన్న కాలువ దాటి అటుపక్క గట్టు మీద కి వెళ్ళడానికి, సైకిల్ పైకెత్తుకుని, చిన్ని కాలువలో కి దిగాడు.
నీటిలోకి దిగినెంటనే అతనికి నీళ్లు కాళ్ళకి చల్లగా తగులుతున్నాయి. సైకిల్ పైన ఎత్తుకుని, నడుస్తుండడం తో
అతనికి చెమటలు బాగా పడుతున్నాయి. అటుపక్క, గట్టుకి చేరేలోపులో నీళ్లు వేడెక్కి, సల సల మని బుడగలు వస్తున్నాయి.

అప్పటిదాకా చల్ల గా ఉన్న అతని కాళ్ళు, వేడికి బొబ్బలెక్కుతున్నాయి. ఆ చిమ్మ చీకటిలోనీళ్లు ఎర్రగా మారి
అతనికి కనిపిస్తున్నాయి. ఆ కాలువ గట్టు పక్కనున్న చెట్టు మీద నున్న ఒక పక్షి కిందకి చూస్తూ అరుస్తోంది. కాలువ లో నీళ్లు అన్ని ఎర్రగా మారి ఉన్నాయ్.సైకిల్ నీటిలో తేలుతూ ఎర్రగా కనిపిస్తోంది.
*******
తెల్లారింది. జనాలు ఆ కాలువ గట్టుదగ్గెర గుమిగూడి ఉన్నారు, నీటిలో నుంచి సైకిల్ ని తీశారు. చని పడి ఉన్న అతనిని కూడా వాళ్ళ బంధువులకి అప్పచెప్పారు. అవును రా బాబు, ఇది నాలుగో ది. ఇంతకముందర కూడా ఇలానే జరిగింది. రాత్రి పూట కాలువ దాటుతుండగానే అనుకుంటా..మిగతా ముగ్గురు కూడా ఇలానే పోయారు అంటూ చుట్ట తాగుతూ ఒకడు పక్కోడి కి చెప్తున్నాడు. అవును. వీళ్ళకి దీని సంగతి తెలియదు అనుకుంటా అని అవతల వ్యక్తి బుర్ర ఊపుతూ చెప్తున్నాడు. ఈలోపులో ఒక పోలీస్ వచ్చి ఇక్కడనుంచి అందరూ వెళ్ళండి అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి అందరూ భయపడి మెల్లగా వెళ్తున్నారు. పోలీస్ చని పోయిన వ్యక్తి ని పరిశీలించి, చాల్లే, ఇక ఇంటికి తీసికెళ్ళండి. దీని మీద ఇంకా విచారణ అక్కర్లేదు అనేసి పక్కనున్న బడ్డీ లో చుట్ట తాగటానికి వెళ్ళాడు. బంధువులు మారు మాట్లాడకుండా ఆ మృతదేహాన్ని ఎడ్ల బండి లో తీసికెళ్లారు.

పది రోజుల తరువాత...******

తెల్లవారు జాము మూడు గంటల 15 నిముషాలు. చిమ్మ చీకటి గా ఉంది. ముగ్గురు స్నేహితులు సైకిల్ మీద వెళ్తూ, కాలవ ని చూసారు. చుట్టూ ఏమి తిరిగి వెళ్తాములే, చూడ్డానికి చిన్న గా ఉంది సైకిల్ నెత్తి మీద పెట్టేసుకుని వెళ్లిపోదాం అని ఒకడున్నాడు. సరేలే అని మిగతా ఇద్దరూ అన్నారు. ఒకడు కాలువలో దిగి సైకిల్ ని భుజానేసుకుని కాలువలో కి దిగాడు. రెండో వాడు కూడా మెల్లగా దిగాడు. మూడో వాడు దిగేలోపులో పైనుంచి ఒక పక్షి నెత్తి మీద నుంచి వెళ్ళింది …మూడో వాడు ఉలిక్కి పడి, అది ఎటు వైపు వెళ్లిందా అని చీకట్లో నుంచి చూస్తూ, అలాగా కాలువ వైపు చూసాడు…ఎర్రగా మారిన నీళ్లను చూసి భయపడి కెవ్వున కేక వేసాడు. గట్టి గా అరుస్తున్నాడు ఇవతల వైపు గట్టునుంచి. మిగతా వాళ్ళ ఇద్దరి జాడ తెలియలేదు. అరుస్తూనే ఉన్నాడు భయం తో….చెట్టు మీద పక్షి ఆరుస్తోనే ఉంది. సైకిల్ పక్కన పడేసి ఇంకో పక్క రోడ్డు వైపు పరిగెత్తాడు అరుస్తూ..

మళ్ళి తెల్లారింది. అదే జనాలు అక్కడ గుమి గూడారు. వీళ్ళతో కలిపి ఇరవై అని లెక్క పెడుతున్నాడు ఆ కాలువ పక్కనున్న బడ్డీ కొట్టు లో బీడీలు అమ్ముతూ భద్రయ్య. అదే పోలీస్ వచ్చి లెక్కలు రాసుకుని, ఇక తీసికెళ్ళండి ఆ మృతదేహాలని అని గట్టి గా అరిచాడు. అందరూ మెల్లగా సర్దుకుంటున్నారు. ఒక పదిహేనేళ్ళ కుర్రాడు పరమేశం వచ్చి భద్రయ్య తో ఇక్కడ ఒక చిన్న బోర్డ్ పెట్టి రాత్రి పూట కాలువ దాటొద్దు అని పెట్టచ్చు కదండీ. చదువు వచ్చిన వాళ్ళు అది చదువుకుని ఈ కాలువలో దిగరు కదండీ అని చిన్న సలహా పడేసాడు. పోరా నువ్వు చెప్పేదేమిటి రా…జనాలు కి ఎలా రాసి పెడితే ఆలా జరుగుతుంది పో ఇక్కడ నుంచి అని గట్టి గా అరిచాడు. పోలీస్ అరుపులకి అక్కడనుంచి వెళ్లిపోతూ పరమేశం సలహా విన్న అదే వయసు కుర్రాళ్లు కూడా పరమేశం తో చేరారు. అవును పరమేశం మనం ఒక చిన్న బోర్డు పెడదాం రాత్రి వచ్చి అనేసి అందరూ వెళ్లి పోయారు.

రాత్రి అయ్యింది. పరమేశం మరియు మరో ఇద్దరూ స్నేహితులు వచ్చి, చిన్న అట్ట మీద “రాత్రి పూట ఈ కాలువ ని దాటకండి, ప్రమాదం అని రాద్దాం” అని సలహా ఇచ్చాడు ఒకడు. పరమేశం వచ్చి ప్రమాదం కాదు చస్తారు అని రాద్దాం అనేసి ఆ కాలువ పక్కకి దిగి ఈ బోర్డ్ పెడుతూ ఉంటే ఒకడు కాలు జారీ కాలువ లో కి పడి పోయాడు.. వాడిని పట్టుకుందామని ఇంకోడు కూడా కాలువలో కి జారిపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్న పరమేశం కూడా వాళ్ళ ఇద్దర్ని కాపాడాలని కాలువలో కి దూకేసాడు. ముగ్గరూ కాలువలో ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ భయం గా ఉన్నారు. చీకటిలో నీటి తరంగాలు కనిపిస్తున్నాయి. రండి ఇక వెళ్దాం అని పరమేశం అంటూ ఉండగానే మిగతా ఇద్దరికీ నీళ్లలో కింద ఏదో కాళ్ళను పట్టేసినట్టు అరుస్తున్నారు. గట్టిగా అరుస్తూనే ఉన్నారు. నీళ్లు ఎర్రగా మారుతూ ఉన్నాయ్. పరమేశం కూడా దూకేసి వద్దామనుకునే లోపులోనే అంతా జరిగిపోయింది…నీళ్లు ఎర్రగా ఉన్నాయి. చెట్టు మీద ఎప్పటిలాగానే పక్షి అరుస్తూనే ఉంది..కాలువ పక్కనున్న బోర్డు మాత్రం గంభీరం గా తెలియచేస్తోంది, “రాత్రి పూట ఈ కాలువ ని దాటకండి, ఛస్తారు “ అని..

యధావిధి గా సూర్యుడు తన పని తానూ చేసుకుపోతున్నాడు. బడ్డీ కొట్టు భద్రయ్య మాత్రం ఈసారి కొంచం దిగులుగా నే ఉన్నాడు. ఎందుకంటె పోయిన ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఆ ఊరి వాళ్లే కాబట్టి. పోలీస్ వచ్చి అక్కడున్న బోర్డు ని చూసి కుర్రాళ్ళు పాపం బాగానే పెట్టారు కానీ, అది మాత్రం వాళ్ళని వదల్లేదు అంటూ ఇక తీసికెళ్ళండి ఎలాంటి విచారణ ఉండదు ఈ శవాలకు. ఇదిగో భద్రం, నీ బడ్డీ కొట్టు కూడా తీసేయ్ ఇంకా ఎవర్ని ఇక్కడ రాకుండా చేద్దాం అని, పోలీస్ గట్టిగా అరిచాడు. చుట్టు పక్కలనున్న చిన్న చిన్న కొట్టులని తీసేసారు. అందరూ వెళ్లి పోయారు. బోర్డు మాత్రం నించుంది. కాలువ లో నీరు యధావిధిగా పారుతోంది.
****
పది ఏళ్ళు తరువాత******

ముగ్గురు పాతికేళ్ల కుర్రాళ్ళు ఆ ఊరి మీద, అక్కడున్న కాలువ మీద పరిశోధిద్దామని పట్నం నుంచి ఆ ఊరి కి వచ్చారు. అప్పటికే ఆ ప్రాంతమంతా దట్టమైన చెట్లు తో మూసికొని ఉంది. జన సమాచారం లేదు. పక్షులు చెట్ల మీద అరుస్తున్నాయి. ముగ్గురు కుర్రాళ్ళు తెచ్చుకున్న సామాగ్రి ని వెనక వేసుకుని అక్కడ తెంచుకున్న కర్రలతో దారికి అడ్డం గా ఉన్న మొక్కలను తీస్తూ కాలువ దగ్గెర కి వెళ్తున్నారు.దూరం గా మట్టికొట్టుకుని పోయిన బోర్డు కనిపించింది, అక్షరాలు స్పష్టం గా లేవు..ముగ్గురు దగ్గెర కెళ్ళి చూసారు..”రాత్రి పూట ఈ కాలువ ని దాటకండి, చస్తారు” అని ఉంది. ముగ్గురు నవ్వుకున్నారు. పాపం ఎవడో ఇలా బోర్డు పెట్టి అందర్నీ భయపెట్టేసి ఉంటాడు అని ఒకడున్నాడు. అరె కానీ, చాలా మంది చచ్చి పోయారు కదా! అది మనం విన్నాం కదా…ఇక్కడేదో ఉంది అని రెండో వాడు అన్నాడు. అవును మనం వచ్చింది అందుకే పరిశోధించడానికే చూద్దాం ఏమి ఉందొ ఇక్కడా, అయితే రాత్రి దాకా వెయిట్ చేయాలా అని కొంచం కర్ర ని అటు ఇటు తిప్పుతూ అన్నాడు.

కర్ర జారీ కాలువ లో కి పడింది. కర్ర తీద్దామని వెళ్లే లోపులో కాలువ లో నీళ్లు ఎర్రగా మారుతున్నాయి. ముగ్గురు యువకులు పైనుంచే చూస్తున్నారు కాలువ వైపుకి. కాలువ లో పడిన కర్ర గిరా గిరా తిరుగుతోంది. చెట్టు మీద నున్న పక్షులు అరుస్తున్నాయి. వీళ్ళలో ఒకడు కెమెరా తీసి ఆ నీళ్లలో కర్రని ఫోటో తీస్తున్నాడు. కర్ర తిరుగుతూ తిరుగుతూ ఎర్రగా మారింది. వీళ్ళు అందరూ గట్టు మీదే కూర్చుని మొత్తం జరిగింది రాసుకున్నారు. ఫోటో లు తీశారు. గాలి మొదలయ్యింది అకస్మాత్తు గా. రాస్తున్న పేపర్లు ఎగిరిపోయాయి. వెంటనే వీళ్ళు కొంచం పైకెళ్ళి అక్కడున్న చెట్టు కొమ్మల్ని గట్టిగానే పట్టుకున్నారు. కింద నీళ్లు ప్రశాంతం గానే ఉన్నాయ్. బోర్డు మాత్రం దీనం గానే చూస్తోంది.

చీకటి పడుతోంది. ఈ ముగ్గురు తెచ్చుకున్న ఆహారాన్ని ఒక చెట్టుకింద కూర్చుని తింటున్నారు. తింటూ కాలువ వైపు టార్చ్ లైట్ వేస్తూ చూస్తున్నారు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని…ఏమి చేద్దాం ఇప్పుడు అని ఒకడున్నాడు. ఏముంది. కాలువలో దిగి చూద్దాం అని ఇంకోడు సమాధానం ఇచ్చాడు. వద్దు ఇప్పుడు దిగద్దు, రాత్రి అంతా, ఇక్కడే కూర్చుని చూద్దాం అని మూడో వాడు అన్నాడు. అలాగే అని ముగ్గురు టార్చి లతో కాలువ వైపు చూస్తూ అక్కడున్న కర్రలని, రాళ్ళని కాలువలో వేస్తూ చూస్తున్నారు. నీళ్లు ఎర్రగా మారడం, వేసిన వస్తువులు నీళ్లలో గిరగిరా తిరగడం చూస్తున్నారు. ఇదంతా మళ్ళి పేపర్ లో రాసుకున్నారు.

కొన్ని పక్షులు చెట్లు మీద నుంచి అరవడం మొదలెట్టాయి. ఒకడు చెట్టు మీద టార్చ్ వేసి చూసాడు. ఏమి కనపడలేదు. కాలువలో కేసి చూసాడు. కాలువ లో రెండు పెద్ద వింత ఆకారం తో ఏదో జంతువూ తిరుగున్నట్టు కనిపించింది. టార్చ్ వేస్తూ, ఇంకోడు ఫోటో తీసాడు. ఈసారి పెద్ద బండ రాయిని కాలువ లో కి పడేసారు. ఆ చెప్పుడి కి పైన పక్షులు టప టప రెక్కలు ఆడించు కుంటూ యెగిరి పోయాయి. కాలువ లో వేసిన బండ రాయి వలన తరంగాలు వస్తున్నాయి. ఈసారి ఒకడు కాలువ దగ్గెర కెళ్ళి కర్ర ని వేసాడు.

వెంటనే వింతైన ఆకారం లో ఉన్న ఆ జంతువూ కర్ర ని తిప్పుతూ నోటిలో నుంచి ఊదుతోంది. ఆ గాలి కి అక్కడున్న నీళ్లు ఎర్రగా మారుతున్నాయి. మిగతా ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి అదే పని చేస్తున్నారు. మొత్తానికి మన పరిశోధన లో విజయం సాధించాం. ఈవిషయాన్ని మన వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు అని అంటుండగానే…కాలువ లో నుంచి వచ్చి ఆ వింత జంతువూ అకస్మాత్తు గా నీళ్లు చిమ్మింది. దాంతో ముగ్గురు ఒడ్డునున్న కుర్రాళ్ళు కాలువలో కి పడిపోయారు. నీళ్లు ఎర్రగా మారాయి. ముగ్గురులో ఒకడు మాత్రం ఒడ్డు వైపు కి వచ్చి పైకి పరిగెత్తాడు. మిగతా ఇద్దరూ రాలేకపోయారు…కాలువ లో ఉన్న ఇద్దరూ విగత జీవులయ్యారు.

పైన ఉన్న పేపర్ లని, ఫోటో లని తీసుకుని భయం తో పరిగెత్తాడు. కొంత దూరం తరువాత అలసి, కళ్ళు తిరిగి పడిపోయాడు.
************
ఎవరో లేపుతున్నారు. సార్! యెర్ర వంతెన స్టాప్ వచ్చింది. మనం ఇక్కడే దిగాలి అంటూ . అవును మళ్ళి పాతికేళ్ల తరువాత యెర్ర కాలువ ని చూస్తున్నా అనుకుంటూ బస్సు దిగాడు సుధాకర్ తన స్టాఫ్ మెంబెర్ తో. ఆ ప్రాంతమంతా బాగా అభివృద్ధి చెందింది. మెల్ల గా వెళ్లి అక్కడున్న ఐస్ క్రీం పార్లర్ లో ఈ కాలువ పక్కన ఒక బోర్డు ఉండేది మీకు తెలుసునా అని ఒక పెద్దాయనని అడిగాడు. అది మొన్నటివరకు ఉండేదండి. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ లో తీసేసి బయట పడేసినట్టున్నారు. ఇంతకీ మీరు ఎవరు అని ఆ పెద్దాయన అడిగాడు. నేనా! అని ఒకసారి నవ్వుకుని..పాతికేళ్ల కిందట ఇక్కడా కాలువ మీద పరిశోధన చేయడానికి ముగ్గురు వచ్చాము. వాడి లో ఒకణ్ణి నేను అని సుధాకర్ చెప్పాడు. ఆ పక్కనే ఐస్ క్రీం తింటున్న కుర్రాళ్ళు ఇంటరెస్ట్ గా ఉంది సార్. ఈ విషయం మేము కూడా విన్నాం…అసలు ఏమి జరిగింది సార్ ఈ కాలువ లో అని ఆత్రుత గా అడిగారు.

సుధాకర్ మొదలెట్టాడు. అప్పుడు నేను ఒకణ్ణి తప్పించుకుని బయట పడ్డాను. ఆ తరువాత ఆ పేపర్ లు, ఫోటో లు పోలీస్ ల కిచ్చి మొత్తం జరిగిందంతా చెప్పాను. పోలీస్ లు, గ్రామస్తులు కలిసి ఒక ప్లాన్ ప్రకారం అందరం అక్కడకు చేరుకొని ఆ వింత జంతువుల ని చంపేసాం. అవి మొసలి లా నీటిలో ఉండేవి.కానీ అవి విషాన్ని ఊదేటప్పటికీ చల్లగా ఉండే నీరు, వెంటనే సల సల మని బొబ్బలెక్కే వేడి నీరు గా మారడం, ఆ తరువాత నీరు ఎర్రగా మారడం . ఆ విష ప్రభావం తోను, నీటి వేడికి మనుషులు వెంటనే భయపడి చనిపోయేవారు .ఇప్పటికీ అవి ఈ కాలువలో కి ఎలా వచ్చాయో నా పరిశోధనలో తేల లేదు అని చెప్పాడు. అలాగే తరువాత వంతెన వేశారు అని అన్నాడు. అక్కడున్న అందరూ చప్పట్లు కొట్టి థాంక్ యూ సార్ మీకు. మీ వలన ఇప్పుడు అవి లేవు, తరువాత ఆ కాలువ మీద నుంచి వంతెన వేశారు అని అన్నారు.

చీకటి పడుతోంది. ఎర్రవంతెన మీద నుంచి బస్సులు, కార్లు బిజీ బిజీ గా వెళ్తూనే ఉన్నాయి. సుధాకర్ కి దూరం గా కాలువ పక్కనే పడిపోయిన బోర్డు కనిపించింది. బోర్డు మీద అక్షరాలు ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. “రాత్రి పూట ఈ కాలువ ని దాటకండి, ఛస్తారు “ అని. అది చూసుకుని ఒకసారి నవ్వుకున్నాడు. దూరం గా కాలువ లో నీళ్లు ఎర్రగా మారడం గమనించాడు. మళ్ళి ఒకసారి గాల్లో కి చూసి నవ్వుకుని అవును ఈ నీళ్లు దుమ్ము, దూళి వలన వచ్చే ఎర్రటి నీరు అని అనుకుంటూ..పైకెళ్తున్నాడు.వెళ్తూ వెళ్తూ చిన్న కర్ర ని పడేసాడు కాలువలోకి .
నీళ్లలో పడిన కర్ర గిరా గిరా తిరుగొంది……నీళ్లు ఎర్రగానే ఉన్నాయ్.
*******************
Story Written By
ప్రసాద్ ఓరుగంటి

పొలం పిలిచే.

అది హైదరాబాద్ మహా నగరం.

పరంధామయ్య, ఇంటి పెరట్లో ఉన్న చిన్న చిన్న మొక్కలకి నీరు పోస్తున్నాడు.పోసిన నీరు వెంటనే ఇంకి పోతోంది. ఆ మొక్కలకు కావలసినంత నీరు పోసి, కుళాయి దగ్గర కాళ్లు, చేతులు కడుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఈ లోపులో తాతయ్యా అంటూ స్కూల్ నుంచి వచ్చిన మనవడు ఏమి చేస్తున్నావు అని పలకరింపు, ఈ గార్దెన్ లో అంటూ. అదేరా…చూడు ఈ మొక్కలకి నీళ్లు పోస్తున్నా..ఇప్పుడు చిన్నవి గా ఉన్నాయి కదా…నువ్వు పెద్ద అయేటప్పటికీ అవి కూడా నీలాగే పెద్దయి, పండ్లు , పూలు ఇస్తాయి అంటుండగానే, తుర్రున లోపలకెళ్లిపోయాడు ఆ మనవడు. ఈ లోపులో కిచెన్ లో నుంచి మావయ్య గారు టీ రెడీ గా ఉంది. వచ్చి తాగండి అని ఆ పరంధామయ్య కోడలు చెప్పింది . హా వస్తున్నా అని పరంధామయ్య మెల్లగా వెళ్లి కుర్చీ లో కూచుని టీ తాగుతున్నాడు.

అప్పుడే పరంధామయ్య కొడుకు గిరీష్ కూడా కార్ ని పార్క్ చేసుకుని, ఇంటిలో కి అడుగుపెట్టాడు. టీ తాగుతున్న పరంధామయ్య ని చూసి, నాన్నా మన ఊళ్ళో ఉన్న పొలం మంచి గిరాకీ వచ్చేలా ఉంది. మన ఊళ్ళో కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి చూసారుట. నిన్న రియల్ ఎస్టేట్ రాజన్న కాల్ చేసాడు. ఆ పొలాన్ని మూసేసి వాళ్ళకి ఇచ్చేద్దాం, ప్లాట్ ప్లాట్ లు గా చేసేసి అమ్మేస్తే మంచి రేట్ వస్తుంది అని అంటున్నాడు.. ఏమంటావు నాన్నా అంటూ, టీ తెమ్మని సైగ చేస్తున్నాడు కిచెన్ లో ఉన్న భార్యకి.

********************

అది లండన్ సిటీ.

రాజేశ్వరరావు, లండన్ లో నున్న కూతురు కుశల ఇంట్లో TV లో అన్నదాత ప్రోగ్రాం చూస్తున్నాడు.ఆ వచ్చే కార్యక్రమాల్ని చాల ఆసక్తి గా వింటూ చూస్తున్నాడు. పది ఏళ్ళ మనవడు నిఖిల్ పాలు తాగుతూ వచ్చి, ఏంటి తాతా ఆవుల్ని, గడ్డి ని, దూడల్ని చూస్తున్నావ్, ఫన్నీ గా. చాలా ఏనిమేటెడ్ చానెల్స్ ఉన్నాయి, అవి ఇంకా చాలా బాగుంటాయి అని నవ్వుతూ అడిగాడు. లేదు రా నిఖిల్, యేవో కొత్త కొత్త టెక్నిక్స్ చూపిస్తున్నాడు. అవి కూడా చూసి, నేర్చుకుని అధునాతన పద్దతిలో ఎలాగ పశువుల్ని పెంచవచ్చు అని చూస్తున్నా అని అంటుండగానే, మనవడు నిఖిల్ తుర్రున పారిపోయాడు ఆడుకోడానికి .

ఏంటి నాన్న ఇంకా ఈ ప్రోగ్రాం లు మీరు ను…ఎంచక్కా ఏదైనా ప్రోగ్రాం లు చూసుకోవచ్చు గా, ఈ ఆవులు, గేదెలు కాకుండా, అని కూతురు కుశల కొంచం విసుగ్గానే అంటూ పకోడీ తీసుకొచ్చింది తండ్రి రాజేశ్వరరావు కి. అవును నాన్న, ఎప్పటినుంచో అడుగుదామని అనుకుంటున్నా నిన్ను. ఆ పశువుల్ని, పొలాన్ని అన్ని అమ్మేసి, మీరుకూడా మన ఊరునుంచి నుంచి ఇక్కడికో, అన్నయ్య ఇంటికో వచ్చేచు కదా….ఇప్పటిదాకా చేసింది చాలు ఆ పశువులకు సేవ అని అనేసి, ప్లేటులో రెండు పకోడీ లు నోటిలో వేసుకుని కిచెన్ లో కి వెళ్ళింది ఎగ్జిట్ ఫ్యాన్ వేయడానికి.

***********************

అది అమెరికా

గోవిందం, అతని భార్య, కొడుకు ఇంటికి అమెరికా వచ్చారు. తాతా ! నానమ్మ! , మనం ఇప్పుడు చెర్రీ, స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ కి వెళ్తున్నాం అంది తొమ్మిదేళ్ల చిన్నారి తన తాత గోవిందం తో హ్యాపీ గా గెంతుకుంటూ. అవును నాన్న, మనకి దగ్గెర లో చెర్రీ , స్ట్రాబెర్రీ పండ్ల తోటలు ఉన్నాయ్, అక్కడికి వెళ్లి చెట్టుకి వేలాడే పండ్లను కోసుకుని, కావలిసినవి అక్కడే తినేసి, ఇంకా కావాలంటే, కొన్ని కొనుక్కుని వచ్చేద్దాం అన్నాడు వెంకటేష్ వాళ్ళ అమ్మా నాన్నలతో.సరేరా చూసొద్దాం ఆ తోటలని, ఆ పండ్లని అంటూ అంతా బయలుదేరారు కార్ లో ఆ తోటలకి.

గోవిందం చూస్తున్నాడు ఆ చెర్రీ, స్ట్రాబెర్రీ తోటలని. చాల మంది పిల్లా, పాపలతో వచ్చి ఆ చెట్టు మీద నున్న పండ్లను కోసుకుంటూ, కొన్ని సంచి లలో సర్దుకుంటున్నారు. పిల్లలు ఆ తోటల మధ్య నుంచి పరిగెడుతూ ఆడుకుంటున్నారు. గోవిందం కొడుకు వెంకటేష్ రెండు స్ట్రాబెర్రీ పండ్లను నోట్లో పెట్టుకుని తండ్రి తో అంటున్నాడు. నాన్నా మన మామిడి తోటలు ఊళ్ళో ఎలా ఉన్నాయ్, అవును కదా ఈ ఏడు బాగానే వచ్చాయి అన్నావు. లాస్ట్ సంవత్సరం తుఫాను దెబ్బకి అన్ని కాయలు రాలిపోయాయి, ఏమి మిగలలేదు అన్నావ్. ఎందుకు నాన్నా ఇంక అవి, మంచి గా చెట్లు కొట్టించేసి, పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టేద్దాం, ఎలాగ మనకి అది హైవే దగ్గెర లో ఉంది కదా అని తింటూ అంటున్నాడు. ఆ తింటూ మాట్లాడడం లో కొన్ని పదాలు అర్ధమయ్యాయి, కొన్ని సరిగా వినపడలేదు గోవిందానికి . కానీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టేద్దాం అనేది మాత్రం వినిపించింది గోవిందానికి. గోవిందం కూడా రెండు స్ట్రాబెర్రీ పండ్లు నోట్లో పెట్టుకుని చూస్తున్నాడు ఆ చెట్ల వైపు.

******************

హైదరాబాద్ లో నున్న పరంధామయ్య, కొడుకు గిరీష్ అన్న మాటకి  పెరటి వైపు చూసాడు. అప్పుడే నీళ్లు పోసిన మొక్కలు చిన్న చిరుగాలితో వయ్యారం గా ఊగుతూ పరంధామయ్యని పలకరిస్తున్నట్టు గా ఉన్నాయి. ఆ పలకరింపు తనని ఊళ్ళో ఉన్న పొలం వైపుకి తీసికెళ్ళింది.

పరంధామయ్య కి ఊళ్ళో ఐదు ఎకరాలు పంట చేలు, రెండు ఎకరాల కొబ్బరి ఉంది.. కష్ట పడి వ్యవసాయం చేసుకుంటూ గిరీష్ ని బాగా చదివించాడు.తను పొద్దునే సైకిల్ మీద వెళ్లి వరి చేలు , తోటలని పలకరిస్తూ వస్తూ వస్తూ , పొలం లో ఉన్న ఆవు పాలు పితికి తేచ్చేయడం. ఇంటికి వచ్చిన తరువాత ఆవు పాలతో వేడి వేడి కాఫీ తాగేసి మళ్ళీ పొలం వెళ్లి, మధ్యాన్న బోజనానికి రావడం. ఇలాగ తన వ్యవసాయాన్ని చక్కగా చేసుకుంటూ ఆనందం గా జీవనం సాగిస్తున్నాడు భార్య, పిల్లాడి తో.

ఏరా…కోదండం , ఈసారి పెద్ద తుఫానంట. మనవి నిలుత్తాయా అని అడుగుతున్నాడు పరంధామయ్య, కోదండాన్ని. కోదండం, పరంధామయ్య ఇద్దరూ బాల్య స్నేహితులు. పూర్తి వ్యవసాయ దారులు. అసలే కోతలు సమయం ఇప్పుడు ఈ తుఫాన్ ఏంటి రా అని అనుకుంటూ లోపల ఇద్దరూ బాధ పడుతున్నారు.

రానే వచ్చింది పెద్ద తుఫాను. బోరున వాన. గాలి కూడా ఎక్కువైంది. కోదండం ఇంట్లో అటు ఇటు నడుస్తున్నాడు. ఇంకా భోజనం చెయ్యలేదు. పొలాన్ని పలకరించి ఐదు రోజులయ్యింది. అవి ఎలా ఉన్నాయో , ఏంటో అని లోపల చాలా బాధ పడుతున్నాడు. ఇదిగో! అలాగా, ఒకసారి పరంధామమయ్య ఇంటికెళ్లి వత్తా అని సావిడి లో నున్న గొడుగు తీసుకుని తన భార్య కి చెప్పాడు కోదండం . ఇంత గాలి వానలో ఎక్కడికండి, అయినా మీరు ఇంకా భోజనం కూడా చేయలేదు అంటూండగానే వెళ్ళాడు బయటికి కోదండం గొడుగేసుకుని.
****
తెల్లారింది..ఊళ్ళో జనాలు అందరూ గుమిగూడి ఉన్నారు. పరంధామయ్య ఏడుస్తూ అంటున్నాడు, అంత రాత్రి వేళా, గాలివానలొ పొలానికి ఎందుకెళ్ళావు రా చనిపోయిన కోదండాన్ని పట్టుకుని ఏడుస్తున్నాడు. కోదండం భార్య కూడా ఏడుస్తోంది. అవును వీడికి ఒకటే తెలుసు. ఆ మొక్కలని, చేలు ని పలకరించకూడ ఉండలేడు. వాడికి వ్యవసాయం అంటే ప్రాణం. అది లేకపోతె తోచదు. ఈ సారి తుఫానుకి, చేతికి వస్తుందనుకున్న పంట నీటి పాలవడం, మొక్కలన్నీ పడిపోవడం వీడు చూడ లేకపోయాడు ..అందుకే వీడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ అక్కడున్న పెద్దలు అనుకుంటున్నారు.

పరంధామమయ్య ఇంకా జీర్ణించ లేకపోతున్నాడు, తన స్నేహితుడు పక్కన లేకపోవడం. పరంధామమయ్య కూడా కొబ్బరి తోటలన్నా, వరి చేలు అన్నా ఎంతో ఇష్టం.
ఎప్పుడైనా జ్వరం వచ్చి పొలానికి వెళ్లపోతే, అయ్యో అవి ఎలా ఉన్నాయో అని తల్లడిల్ల పోయే వ్యక్తి. తను పొద్దున్నే పొలం వెళ్లిన వెంటనే, వచ్చావా పరంధామయ్యా అంటూ పైర గాలికి చేలు ఊగుతూ, శుభోదయం చెప్తున్నట్టు గా ఉండేది . పరంధామయ్య ఇవన్నీ చూసి తను నిశ్చయించుకున్నాడు. తన కొడుకు తన లాగ వ్యవసాయదారుని గా కాకుండా మంచి చదువు చదివించి ఉద్యోగం చేయించాలనుకున్నాడు. తను వ్యవసాయం చేస్తూ , పంట ల వాళ్ళ వచ్చే ఆదాయం తో మొత్తానికి కొడుకుని బాగా చదివించాడు. కొడుకు కూడా బాగా గా చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్ లో.
********
కొడుకు గిరీష్ అడిగిన మాటకి, పరంధామయ్య సమాధానం చెప్తున్నాడు. గిరీశు, ఏమి అనుకోకురా…ఆ పొలం మా నాన్న , అదే మీ తాత చిన్నపట్నుంచి ఉంది. దాని మీద మన ఇంట్లో ఎన్నో శుభకార్యాలు, అలాగే మంచి చదువులకు కూడా ఉపాయాగపడింది. అంతకన్నా నాకు అవంటే ప్రాణం రా. నాకు పొలం తప్పా ఇంకోటి తెలియదు. ఎప్పుడూ పొలాన్నే చూస్తూ, పెరిగాను. ఇప్పుడేదో, పొలం మూసేస్తే ఎక్కువ డబ్బులొస్తాయని చెప్పి పండే పొలాన్ని మూసేసి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేలెను రా…నువ్వు తప్పదు అంటే అలాగే చేద్దాం, నేను రాత్రి బస్సు కి మన ఊరెళ్తా అని కొంచం బాధతో చెప్పాడు.
************
లండన్ లో నున్న రాజేశ్వర రావు కూతురి కుశల మాటలకి, కొంచం నొచ్చుకున్నాడు. లేదమ్మా కుశల. నీకు ఎప్పుడూ చెప్పలేదు అనుకుంట. నేను మా అమ్మ, నాన్న ల దగ్గెర కంటే ఎక్కువు గా ఈ పశువులతోనే ఉండేవాడిని. పొద్దునే లేచి, మన పని వాళ్లతో పాటు నేను కూడా వెళ్లి, పశువులకు గడ్డిని వేసి, పాలు పితికి అవి ఇంట్లో కొంత, కొంత పాల కేంద్రం లో ఇవ్వడం, ఇలాగ చేస్తూ చేస్తూ..ఏదో బానే సంపాదించ. కానీ నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం అక్కడే ఉంటుంది. నేను ఎప్పుడైనా ఒకరోజు పశువుల శాల కెళ్లకపోతే, అవి చాలా బెంగ పెట్టేసుకునేవి . అలాగే నాకు కూడా ఉండేది. ఇప్పుడు మన దగ్గెర యెంత మంది పని వాళ్ళు ఉన్నా, నేను మాత్రం వాటిలిని దగ్గెరకెళ్ళి పలకరించలేకపోతే నా మనసు బావుండదు కుశల.. నాకు నా బిడ్డలెంత ఇష్టమో, అవి కూడా నాకు అంతే ఇష్టము అమ్మా అంటూ కొంచం గద్గద స్వరం తో అంటున్నాడు కూతురు కుశల తో.
*********
అమెరికా లో చెర్రీ తోటలో కొడుకు మాట విన్న గోవిందం ఇలా అన్నాడు. ఒరే అబ్బి .. ఎవరి తోటో కానీ ఇది, వాళ్ళు చాలా మంచోళ్ళు రా… చూసావా ఇప్పటీకే పిల్లలు, పెద్దవాళ్ళు ఇలాంటి తోటలకు వచ్చి కావాల్సిన పండ్లు తిని, మిగతావి కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నారు. అంటే ఎప్పటికీ ఇక్కడ తోటలు ఉంటాయి. ఏదో ఇంకా ఎక్కువ డబులొచ్చేస్తాయని తోటలని కొట్టలేము రా. అప్పటికీ ప్రక్రుతి కోపానికి కొన్ని చెట్లు ఎలాగ పడిపోతూ ఉంటాయి. నీలాగా అందరూ ఆలోచిస్తే ఇంకా మన దేశం లో చెట్లు ఏమి ఉంటాయిరా అబ్బి, అన్ని బిల్డింగ్ లు తప్పా అని కళ్ళు తుడుచుకుంటున్నాడు కొడుకు కేసి చూస్తూ……..

*********************
నాన్న నాన్న, చెప్పేది విను. నేను కూడా వస్తున్నా నీతో పాటు ఊరికి అన్నాడు కొడుకు హైదరాబాద్ లో నున్న పరంధామయ్య తో. పరంధామయ్య కి అర్ధమవలేదు. అవును నాన్నా ! నేను అక్కడికి వచ్చేది వ్యవసాయం చేయడానికి. నీకు తెలియకుండా నేను కొంత భూమిని కొన్నా. నేను నా స్నేహితుడు కూడా వచ్చి ఇప్పటి ఆధునిక పద్దతులలో అక్కడ వ్యవసాయం మీద ఫోకస్ చేస్తున్నాం. నారు మడులు వేసినప్పట్నుంచి , పంట చేతికొచ్చేవరకు అయ్యే ఖర్చులు మీద ఎనాలిసిస్ చేసి, ఖర్చు ని తగ్గించి ఎక్కువ ఆదాయం వచ్చేదాని మీద ప్రస్తుతం పని చేస్తున్నాం. అసలు నీ అభిప్రాయమేమిటో తెలుసుకుందామని ఆలా అడిగాను, క్షమించు నాన్నా నా ప్రశ్న కి నువ్వు నొచ్చుకుని ఉంటె, అంటూ నాన్నా ని గట్టి గా పట్టుకుంటూ. నాకు తెలుసు నాన్న…దేశానికీ వ్యవసాయం యెంత ముఖ్యమో అని. నేను నీ బిడ్డ ని నాన్న, రైతు బిడ్డ ని అని కొంచం నెమ్మదిగా అన్నాడు. పరంధామయ్య కూడా కొడుకుని ఆనందం గా కౌగలించుకున్నాడు.

ఈ లోపులో మనవడు మొహం నిండా మట్టి తో పరిగెడుతూఉన్నాడు. ఏరా మనవడా..ఏంటది మట్టి మొహం నిండా అని అడిగాడు పరంధామయ్య.తాతా నేను మట్టి మనిషిని, నేను కూడా వ్యవసాయం చేస్తా…పెద్దయ్యాక. అంటూ పరిగెత్తాడు. పరంధామయ్య మళ్ళి అక్కడ మొక్కలవంక చూస్తూ ఆనందం తో కన్నీరు కారుస్తున్నాడు. మొక్కలు యధావిధి గా ఊగుతూ శుభ రాత్రి చెప్తున్నాయి పరంధామయ్యకి.
***********
లండన్ లో ఉన్న కూతురు, అయ్యో లేదు నాన్న…నేను సరదాగా అడిగా. అసలు నువ్వు ఏమి అంటావు అని. మీ అల్లుడు గారు కూడా పశువులంటే అంటే చాలా ఇష్టం.
తను కూడా ఇక్కడ డైరీ ఫారం పెట్టాలని అనుకుంటున్నారు. నువ్వు ఇండియా వెళ్ళినప్పుడు నీతో వచ్చి పశువుల్ని పెంచడం నుంచి అన్ని నీ దగ్గెర నేర్చుకుని, అప్పుడు ఇక్కడ పెడదామని ఆలోచిస్తున్నారు.ఇక్కడ పెట్టడం కుదరకపోతే ఇండియా వచ్చేసి డైరీ మీద మాత్రం ఫోకస్ చేస్తా నని అంటున్నారు. అవును నాన్న నాకు తెలుసు నువ్వు యెంత కష్ట పడ్డావో , అలాగే నీకు పశువులంటే యెంత ఇష్టమో…..ఈ మాటలు విని రాజేశ్వర రావు కి ఏడుపు ఆగలేదు. కళ్ళు తుడుచుకుంటూ..సరే నమ్మా..మీ ఆయనికి పశువుల పేడ నుంచి శిక్షణ మొదలెడతాను అనగానే, తండ్రి కూతుళ్లు నవ్వుకున్నారు.

మనవడు నిఖిల్ పాలు తాగుతూ, తాతా…నేను ఈసారి ఇండియా వచ్చినప్పుడు నాకు పాలు పితకడం నేర్పవా, అని అడిగాడు..సరే రా మనవడా అని తాతా అన్నాడు.
*********************
అమెరికాలో చెర్రీ తోటల్లో నున్న గోవిందంతో కొడుకు ఇలా అన్నాడు. నాన్నా నేను అసలు నీ అభిప్రాయం తెలుసుకుందామని అని అడిగా..అంతే కానీ నిన్ను బాధ పెట్టడానికి కాదు. నేను ఎప్పుడు అక్కడ తోటలని కలలో కూడా అమ్మాలని అనుకోను.ఈ లోపులో కోడలు కూడా అందుకుంది.అవును మావయ్య గారు. ఎప్పుడూ ఈయన అక్కడి మావిడి తోటలు గురించే చెప్తూ ఉంటారు, మీరెంత కష్ట పడి వాటిల్ని పెంచి, చూస్తున్నారో. తను కూడా ఎప్పటినుంచో అలాంటి తోటల్ని కొనాలని అనుకున్నారు. మీకు తెలియకుండా ఈ మధ్యనే ఈ చెర్రీ, తోటల్ని కొన్నారు. మీకు surprise చేద్దామని. ఆ మాటలకి గోవిందం నోటివెంట మాట రాలేదు. అవును నాన్నా….ఇవి మిమ్మల్ని చూసే కొన్నాను…మీరే నాకు ఆదర్శవంతులు. అని బుగ్గన జారుతున్న కన్నీరును తుడుచుకుంటూ. గోవిందానికి కూడా ఏడుపు వచ్చేస్తోంది. ఏమి మాట్లాడాలో తెలియక.

అక్కడ పండ్లు తింటూ, తాతా నానమ్మ , ఇండియా లో ఉన్న మామిడి తోటల్లో కూడా ఇక్కడ లాగ మాంగో picking పెడదామా….అపుడు అందరూ సమ్మర్ లో ఎంచక్కా మామిడి తోటలకి వచ్చి , fruits ని కోసుకుని తినేసి, మిగతావి కొనుక్కుని ఇంటికి పట్టికెళ్తారు, అంతే గోవిందానికి నవ్వు ఆగ లేదు. అవునే చిన్నారి! అలానే చేద్దాం వచ్చే సమ్మర్ అలాగే చేద్దాం అక్కడ మన మామిడి తోటల్లో “రండి, వచ్చి కోసుకోండి” అని బోర్డు పెడదాం అంటూ నానమ్మ చిన్నారి ని ముద్దాడింది.
*************************************************************************************
మట్టి ని నమ్మి, మట్టి లో పెరిగి, ఆ మట్టి నుంచి బంగారాన్ని తీసే ప్రతీ వ్యయసాయ దారుడి కి నమస్సుమాంజలి చెప్తూ …..

**************

ప్రసాద్ ఓరుగంటి

వెనక వీధి కుర్రాళ్ళు

సమయం: సాయంత్రం , నాలుగు గంటలు. నలుగురు కుర్రాళ్ళు , ఒక వీధి రోడ్డు పక్కనున్న అరుగు పైన కూర్చుని యేవో మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కనుంచి రెండు కుక్కలు ఒకదాని వెంట ఒకటి పరిగెడుతున్నాయి. ఎవరో సైకిల్ మీద పండ్లు పట్టుకుని అరుస్తున్నాడు..బత్తాయి పండ్లు , బత్తాయి పండ్లు అని….ఇంకో పక్క ముగ్గురు దృఢం గా ఉన్న మనుషులు గొడుగులు బాగు చేస్తాం… గొడుగులు బాగు చేస్తాం..అంటూ అరుస్తూ ఇంటింటికెళ్లి చెప్తున్నారు, . ఆ కుర్రాళ్ళు మాత్రం వాళ్ళ కబుర్ల లో వాళ్ళు ఉన్నారు.

సమయం : రాత్రి ఎనిమిది గంటలు. కుర్రాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఆ నలుగురి లో ఒకడు అంటున్నాడు రోజు మా నాన్న తిట్లకి భరించలేకపోతున్నా రా బాబు, ఏదో చదుకోవాలి, బాగు పడాలి అంటూ రోజూ నన్ను తిడుతూనే ఉన్నాడు. నాకా చదువు అబ్బట్లేదు. చిరాగ్గా ఉంది రా బాబు అంటూ. ఇంకో కుర్రాడు కూడా ఇంచుమించు అలాగే చెప్పాడు వాడి తల్లి తండ్రుల గురుంచి. అవును రా బాబు ఇప్పుడు ఇంటికెళ్లాలంటే భయం గా ఉంది, అంటూ మిగతా ఇద్దరు కుర్రాళ్ళు. సరే లే భోజనం చెయ్యాలిగా ఇంటికెళ్దాం , కుదిరితే రాత్రి కలుద్దాం లేదంటే రేపొద్దునే అంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లారు.

సమయం: రాత్రి 8 : 15 నిముషాలు. ఈ నలుగురు కుర్రాళ్ల ఇంట్లో పెద్ద పెద్ద గా గొడవలే జరుగుతున్నాయి. నువ్వు ఎప్పుడు బాగు పడతావురా అని ఒక తండ్రి, నువ్విక్కడవుంటే మమ్మలిని కూడా ఊరినుంచి తరిమేసేలా ఉన్నారు అని ఇంకోడి తండ్రి. ఇలా కాదు వీడికి నాలుగు తగిలిస్తే దారిలోకి వస్తాడు అని కొంచం గట్టిగానే బుద్ది చెప్పిన ఇంకో తండ్రి, ఇంచుమించు ఇలాగే స్పందించిన మరో తండ్రి…ఇలాగ ఈ కుర్రాళ్ళు భోజనం చేస్తున్నంత సేపు గొడవలు..గొడవలు గా సాగుతున్నాయి.

భళ్ళున తెల్లారింది. మండే సూర్యుడు తన పని ని యధావిధి గా చేస్తూన్నాడు. అటువైపు వెళ్తున్న ఒక మనిషి ఈ నలుగురు కుర్రాళ్ళని చూసి, ఒరేయి అందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదిగో అక్కడ తిరుగుతున్న ఆ నాలుగు కుక్కలకి మీకు పెద్ద తేడా లేదు, అవ్వీ తిరుగుతున్నాయి మీరు తిరుగుతున్నారు.. తూ..అంటూ.. సైకిల్ మీద నుంచి గట్టి గా తిట్టి ఇంకో వైపు కెళ్ళాడు. వీళ్ళలో ఒకడికి చిర్రెత్తుకొచ్చింది…పక్కనున్న రాయి ని తీసి గట్టి గా విసిరాడు..ఆ రాయి ,తిట్టిన అతని సైకిల్ కి తగిలి పెద్ద చప్పుడయింది. అతను సైకిల్ స్టాండ్ వేసి ఎవడురా నన్ను కొట్టాడు..హా అంటూ..ఆ నలుగురు కుర్రాళ్ళ దగ్గెర కొచ్చాడు.వచ్చి చెప్తా మీ పని…అంటూ అటు వైపు వెళ్తూ అమ్ముకుంటున్న పండ్ల అతన్ని, ఆ గొడుగుల బాగు చేసేవాళ్ళని చూపిస్తూ, చూడండీ రా వాళ్ళు నయం మీ కన్నా…ఇంటింటికెళ్లి అమ్ముకుంటున్నారు…ఉండు…మీ అమ్మ నాన్న లతో మాట్లాడి మీకు గట్టి గా చెప్తా అంటూ….స్పీడ్ గా మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు.

ఈసారి ఈ కుర్రాళ్ళకి భయం వేసింది. కొంచెం దూరం గా ఆ వీధి చివరిలో నున్న అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. బత్తాయి పండ్లు..బత్తాయి పండ్లు అతను ఇంటి ఇంటి దగ్గెర ఆపుతూ అరుస్తున్నాడు. అలాగే గొడుగులు బావు చేస్తాం అంటూ వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ , అరుస్తూ వెళ్తున్నారు. ఒరేయి మనం కూడా ఏదో పని చేస్తే బావుంటుంది రా , లేకపోతె మనల్ని అందరూ తిడుతూనే ఉంటారు అని అని ఒకడన్నాడు. చదువు నా వల్ల కాదు. నేను కూడా ఏదో పని నేర్చుకుని పనిలో పడితే ఈ బాధ ఉండదు అని ఇంకోడు. లేదురా నేను మంచి బిజినెస్ చేస్తా…అది చేసి డబ్బులు సంపాదించి వీళ్ళ నోరు మూయిస్తా అని ఒకడు, లేదు రా నేను కొంచం చదివి చిన్న ఉద్యోగం చేసి, డబ్బులు సంపాదించి వీళ్ళ పని చెప్తా. సరే రా మనం ఇంక ఇక్కడ కలవద్దు. ఏదో చేసి మనోళ్ల కి మనం ఏంటో చూపిద్దాం అని ఒకల్నోకలు అనేసుకున్నారు….

మధ్యాహ్న్నమైంది.కుక్కలు అరుస్తున్నాయి.జన సంచారం లేదు. ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నలుగురు వ్యక్తులు నడుచుకుంటూ అన్ని వీధులు తిరుగుతున్నారు. ప్రతీ ఇంటిని పరిశీలిస్తూ మరీ వెళ్తున్నారు.కొన్ని పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయ్. కొన్ని విశాలమైన ఇళ్లులు ఉన్నాయ్. ఆ నలుగురిలో ఒకడు కుక్కల్ని కొడుతున్నాడు అరవకుండా…ఈ అరుపులకి ఇంట్లో కిటికీ లోనుంచి ఒక పెద్దావిడ కుక్కలు ఎందుకు అరుస్తున్నాయో అని చూసింది. ఎవరో దూరం గా నలుగురు మనుషులు ఆ రోడ్డు మీద తిరగడం కనిపించింది. వీళ్ళకి ఎప్పుడు బుద్దొస్తుందో, ఎప్పుడు బాగు పడతారో అంటూ ఆ తెరిచిన కిటికీ ని మూసేసింది.

సమయం సాయంత్రం : ఎనిమిది గంటలు. ఆ నలుగురు కుర్రాళ్ళు ఎవరింట్లో, వాళ్ళు భోజనం చేస్తున్నారు. యధావిధి గా వాళ్ళ తండ్రుల చేత తిట్లు తింటూ…అందరూ భోజనాలు చేసేసారు. అమ్మా నేను ఆలా బయటికెళ్ళొస్తా అంటూ ఒక కుర్రాడు వాళ్ళ అమ్మకి చెప్పి వెళ్ళాడు. అలాగే మిగతా కుర్రాళ్ళు కూడా అలాగే ఇంట్లో చెప్పి బయటకి వచ్చి ఒక చోట నలుగురు మళ్ళి కలిశారు.

సమయం అర్ధరాత్రి 2 గంటలు. చిమ్మ చీకటి. కుక్కలు తెగ అరుస్తున్నాయి.మళ్ళి పారిపోతూ కొంచం దూరం గా వెళ్లి అరుస్తున్నాయి. పరుగుల శబ్దాలు. గేట్ శబ్దాలు. పెద్ద భవనం దగ్గిర పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి.తాళాలు పగలగొడుతున్న శబ్దం.పరిగెడుతున్న కాళ్ళ శబ్దాలు…కుక్కల అరుపులు.

దొంగలు..దొంగలు..అంటూ పెద్ద పెద్ద కేకలు. ఈ కేకలని విని కొంతమంది పెద్దలు పెద్ద పెద్ద కర్రలతో, దీపాలతో బయటికి వచ్చేసారు. వీళ్ళ అరుపులు విని, వాళ్ళకెక్కడికెళ్ళలో తెలియకుండా ఇటు అటు పరిగెడుతూఉన్నారు. మొత్తానికి ఆ దొంగలని పట్టేసుకున్నారు .
**********
శబాష్ రా కుర్రాల్లారా ! మీరు చేసిన ఈ ఒక మంచి పని వలన, ఈ ఊరు ని దొంగల బారినుంచి కాపాడుకున్నారు, అని ఒక పోలీస్ ఈ నలుగురి కుర్రాళ్ళని అభినందించాడు. ఆ మాటకి ఈ నలుగురు కుర్రాళ్ళ తల్లి తండ్రులతో పాటు అక్కడున్న గ్రామస్తులు కి నోటి మాట లేదు. ఆ పోలీస్ ఆ గ్రామస్తులతో చెప్తున్నాడు. అవునండి ఈ నలుగురు కుర్రాళ్లే ఈ రోజూ గజ దొంగలని పట్టుకున్నారు. ఈ దొంగల ముఠా, పెద్ద పేరు మోసిన ముఠా. ప్రతీ రోజూ ఈ దొంగలు గ్రామాల్లో తిరుగుతూ ఏదో అమ్ముకున్నట్టు నటిస్తూ ఊరంతా పరిశీలిస్తుంటారు. దాన్ని బట్టి వాళ్ళు ఒకరోజు ప్లాన్ చేసుకుని దొంగతనం చేస్తూ ఉంటారు . ఈ నలుగురు కుర్రాళ్ళు ప్రతీ రోజూ వీళ్ళని పరిశీలించి నాకు ఒకసారి చెప్పారు, సార్ మా ఊర్లో కొంతమంది అనుమానాస్పదం గా తిరుగుతున్నారు అని. అప్పటినుంచి ప్రతీ రాత్రి, పగలు ఈ దొంగలని ఆబ్సెర్వేషన్ లో పెట్టి ఈ నలుగురు కుర్రాళ్ళ సహాయం తో ఈ గజదొంగలని పట్టుకోగలిగాం అని చెప్పేసి పోలీస్ వెళ్ళిపోయాడు.

ఆ నలుగురు కుర్రాళ్ళు, మళ్ళి ఒక చోట కలిశారు…..ఏరా కుర్రాళ్ళు ఈ సారి ఇలాంటి దొంగల్ని కాదురా….ఇంకా పెద్ద పెద్ద దొంగల్ని పట్టుకోవాలి అని అప్పుడు వీళ్ళని తిట్టిన ఆ పెద్దాయన సైకిల్ మీద వెళ్తూ అంటున్నాడు . సరే బాబాయ్.. అప్పుడు మమల్ని తెగ తిట్టేశావ్, ఇపుడేమో ఇలాగ.. అంటూ కొంచం కోపం గానే కుర్రాళ్ళు అన్నారు. ఏరా మనోళ్లు మనకి ఇదే పని ఇచ్చే లా ఉన్నారు. ఇంకో పని చూసుకుందాం అంటే..లేదురా మన ఊరు ని, మనోళ్ల ని కాపాడుకోవడం మన బాద్యత….ఇంక ఇలాంటి పనులే చేద్దాం అని ఒకడున్నాడు. చూద్దాం రా బాబు..అని ఇంకొకడు. అలాగా…ఎవరింటికి వాళ్ళు వెళ్లి పోయారు ఆ వెనక వీధి నలుగురు కుర్రాళ్ళు…

సమయం మధ్యాహ్నం మూడు గంటలు.. అదే మండే సూర్యుడు ఎండల్ని మండిస్తూన్నాడు. మామిడి పండ్లు, మామిడి పండ్లు అని కేక వినిపించింది వెనక వీధిలో. కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఒకప్పుడు కిటికీ లోనుంచి చూసి, కుర్రాళ్లను తిట్టుకుని కిటికీ వేసేసిన పెద్దావిడ, ఇప్పుడు కిటికీలోనుంచి చూస్తోంది ఎవరా మామిడిపళ్ళు అరచేవాడు అని ..ఇంకా అరుపు దగ్గెరవుతోంది. ఇంటికి దగ్గెర గా వస్తున్న వాళ్ళను చూసి భయం తో ధడేల్ మంటూ కిటికీ మూసేసింది.
***********
ప్రసాద్ ఓరుగంటి.