Silicon Valley ( Battle between Intellectual people & Invisible bugs )

బయట చిమ్మటి చీకటి లో కీచు రాళ్ళూ కీచు పెడుతున్నాయి. అక్కడక్కడా కుక్కలు అరుపులు వినిపిస్తున్నాయి. లోపల గది లో లైట్ వెలుగుతోంది.  ఒక చిన్న బగ్ మెల్ల మెల్లగా గది లో కి వచ్చి పడుకున్న మనిషి మీద పాకుతోంది. ఆ ఒక్క బగ్ వెనకాల మరో వంద బగ్స్ మెల్లగా అతని మీద కి చేరుకుంటున్నాయి. “జీరా జీరా” అంటూ బగ్ లు పొగరు గా  గా అరుస్తున్నాయి. దూరం గా పెద్ద పెద్ద మాటలువినిపిస్తున్నాయి.. “జీరా (jeera ) లో బగ్ స్టేటస్ అప్డేట్ చేసారా “అంటూ ఒకతను గీర గా అడుగుతున్నాడు.
**********************
నిద్ర పోతున్న సంతోష్ సడన్ గా లేచి కూర్చున్నాడు . టేబుల్ మీద లాప్టాప్ ఓపెన్ చేసి ఉంది. దాంట్లో స్లాక్ (slack  ) మెసేజ్ లు వస్తున్నాయి. ఓహ్ మై గాడ్ ఇదంతా నా కల అనుకుని, లేచి ఫ్రిట్జ్ లో నున్న వాటర్ బాటిల్ తాగేసి లాప్టాప్ దగ్గెర కి వెళ్ళాడు.
**********************
ఉదయం 10  గంటలు. స్టాండప్ మీటింగ్ కి అందరూ రెడీ అవుతున్నారు. కంగారు కంగారు గా సంతోష్ బైక్ పార్క్ చేసుకుని, ఎక్కడా స్టాండప్ మీటింగ్ ఈ రోజు అని తన ఫ్రెండ్ కమలేష్ అని అడుగుతున్నాడు. నువ్వు outlook క్యాలెండర్ చూసుకోవా అని ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. మీటింగ్ రూమ్ లో అందరూ నిలబడే ఉన్నారు. ఒకొక్కలు నిన్న ఫినిష్ అయిన వర్క్  స్టేటస్ అప్డేట్ చేస్తున్నారు. మళ్ళి ఈ రోజు  చేయాలిసిన టాస్క్ డీటెయిల్స్ మేనేజర్ కి అప్డేట్ చేస్తున్నారు . “ఇంతకీ జీరా లో బగ్ స్టేటస్ అప్డేట్ చేసారా” అని మేనేజర్ అరుస్తున్నాడు.

సంతోష్ కి రాత్రి పీడ కల గుర్తు వచ్చింది. అందరూ ,జీరా లో బగ్ స్టేటస్  చేశామని బుర్ర ఊపుతూ చెప్పారు .15  నిముషాల అనుకున్న స్టాండ్ అప్ మీటింగ్ సాగుతోంది టీవీ లో సీరియల్ లాగ. మొత్తానికి ఒక గంట తరువాత “మిగతా స్టేటస్ అప్ డేట్స్ 12  గంటలకి జరిగే  మీటింగ్ లో ఇవ్వండి” అని చల్లని మాట అనేసి,  వేడి వేడి గా కాఫీ తాగటానికి కెఫెటేరియా కి వెళ్ళాడు మేనేజర్.

టిక్ టిక్ టిక్ టిక్ అంటూ కీ బోర్డు లు కీచు పెడుతున్నాయి, సంతోష్  హెడ్ ఫోన్స్ పెట్టేసుకుని జావా కోడ్ రాస్తున్నాడు .”కోడ్ రివ్యూ మీటింగ్ ఉంది ,ఇంకో అరగంట లో సిద్ధం గా ఉండండి” అని లీడ్ సిద్దు స్లాక్ మెసేజ్ ఇచ్చాడు గ్రూప్ లో ఉన్న డెవలపర్స్ అందరికి .

కోడ్ రివ్యూ జరుగుతోంది. కోడ్ కామెంట్స్ లేవని, డెవలపర్స్ ఎవరూ  యూనిట్ టెస్టింగ్ చెయ్యట్లేదు అని  కోడ్ రివ్యూ టీం నొక్కి వక్కాణించి చెప్పింది. “ఇలా అయితే మనం ప్రాజెక్ట్ ని ఈ జన్మ కి  రిలీజ్ చేయలేమని”
కొత్త గా జాయిన్ అయిన వర్మ కొంచం గట్టిగానే  చెప్పేసాడు. ఇంకా సిస్టం టెస్టింగ్ ఉంది. UAT ఉంది అంటూ మిగతా  టీం లీడర్స్ కూడా  కొంచం అసహనం వ్యకం చేసారు. ఇవన్నీ అయ్యేటప్పటికి మధ్యాన్నం 12 అయ్యింది.

వెంటనే 12  గంటల మీటింగ్ స్టార్ట్ అయ్యింది. కోడ్ రివ్యూ గురుంచి, ప్రాజెక్ట్ ఇష్యూష్ గురుంచి చర్చ రెండు గంటల దాకా సాగింది. ఓహ్ అప్పుడే టైం 2  అయ్యింది , we  all  meet  after  quick  lunch  and  discuss again  అనేసి రెండు గంటల మీటింగ్ కి పుల్ స్టాప్ పెట్టాడు మేనేజర్. అందరూ కెఫెటేరియా లో కి వెళ్లి గబా గబా తినేసి మళ్ళి కలిశారు మీటింగ్ రూమ్ లో.

టెస్టింగ్ లీడ్ తమన్  డెవలపర్స్ ని ఉద్దేశించి స్పీచ్ ఇస్తున్నాడు. మీరు డిఫెక్ట్స్ స్టేటస్ fixed అని అప్డేట్ చేస్తున్నారు. మేము టెస్ట్ చేసేటప్పటికీ అవే ఇష్యూస్ వస్తున్నాయి. ఇలా అయితే లాభం లేదు అనేసి కొంచం
గట్టి గా అరుస్తున్నాడు. ఇది విన్న డెవలప్మెంట్ టీం లీడ్ సిద్దు అందుకున్నాడు. లేదు లేదు మీ టెస్ట్ కేసు లు సరిగా లేవు, అని గట్టి గానే సమాధానం ఇచ్చాడు.

ఇలాగ టైం ని నాలుగు చేసి ఎవరి డెస్క్ దగ్గెర కి వాళ్ళు వెళ్లారు. సంతోష్ మళ్ళి హెడ్ ఫోన్ పెట్టుకుని కీ బోర్డు ని కదిలిస్తున్నాడు. ఔట్లుక్ Inbox లో ఈమెయిల్స్ వరద సాగుతోంది. స్లాక్ లో messanger మోత మోగుతోంది.
*******************
అక్కడ తెల్లారింది. వికాస్ నిద్ర కళ్ళ తో ఐఫోన్ లో వాట్సాప్ ని చూద్దామనుకుంటే, స్లాక్ లో మెసేజ్ లు నవ్వుతూ కనిపిస్తున్నాయి. ఈ offshore వాళ్ళు ఇంతే అనుకుంటూ ఒకొక్క మెసేజ్ ని  నిద్ర కళ్ళతో నే చూస్తున్నాడు. ఓహ్ నైన్ కి స్టాండప్ మీటింగ్ ఉంది కదా, అనేసుకుని టక టకా తయారైపోయి, కిచెన్ లో ఉన్న costco వారి ఓట్స్ మరియు సీరియల్స్ ని లాగించేసి కార్ ఎక్కేసి ఆఫీస్ కి బయలుదేరాడు.

స్టాండప్ మీటింగ్ లో ఇష్యూ ల గురుంచి మొదలెట్టేసారు ఆఫ్ షోర్ మరియు ఆన్-సైట్ జనాలు.
ప్రాజెక్ట్ రిలీజ్ ఇంకో మూడు వారాలు ఉంది, ఇప్పటికీ సిస్టం టెస్టింగ్ స్టార్ట్ చెయ్యలేదు అనేసి ప్రాజెక్ట్ మేనేజర్ మొత్తుకుంటున్నాడు. మేము టెస్టింగ్ చేస్తున్నాం, కానీ డెవలపర్స్ బగ్స్ ఫిక్స్ చెయ్యట్లేదు అని టెస్టింగ్ టీం వాళ్ళు అరుస్తున్నారు. మొత్తానికి స్టాండప్ మీటింగ్ లో  నించుని, నించుని కాళ్ళు నెప్పెట్టడం తో ,”ఇక  సిట్టింగ్ మీటింగ్ పెట్టుకుందాం” అని  ప్రాజెక్ట్ మేనేజర్ బయట ఖాళీ గా ఉన్న కుర్చీ లని మీటింగ్ రూమ్ లో కి తెచ్చుకోవడం మొదలెట్టేసాడు.
*****
మొత్తానికి రెండు వారాల తరువాత ,డెవలపర్స్ ఇష్యూస్ ని ఫిక్స్ చేసేసారు. జీరా లో స్టేటస్ ఆకు పచ్చ రంగు లో మెరుస్తోంది.  యూజర్ టెస్టింగ్ చేసేసి , వాళ్ళు గో….గో….అనేసారు . టాప్ మానేజ్మెంట్  హ్యాపీ గా ఉన్నారు. డెవలపర్స్, టెస్టర్స్ అప్పటికే అలసిపోయి ఉన్నారు. ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ గో-లైవ్ కి వెళ్తుందా అని.

మొత్తానికి deployment  చేసే రాత్రి  రానే వచ్చింది. చేసిన కోడ్ ని ప్రొడక్షన్ లో కి మూవ్  చేస్తున్నారు.  రాత్రంతా గో-లైవ్ లో జాగారం చేస్తూ, బలం గా ఉండడానికి పిజ్జా లు, పెసరెట్లు  లు  తెప్పించారు. అన్ని దేశాల ల్లో ఉన్న వాళ్ళు టెన్షన్ గానే ఉన్నారు.మొత్తానికి కోడ్ ఇష్యూస్ లేకుండా మూవ్ చేసారు ప్రొడక్షన్ లో కి . అందరూ సంబరాల్లో మునిగి పోయారు, ఇస్రో వాళ్ళు రాకెట్ లాంచ్ చేసిన తరువాత జరిగే సంబరాల్లాగా…
**********
డెవలపర్స్ మాత్రం కొంచం బెంగ గానే ఉన్నారు..మళ్ళి ప్రొడక్షన్ లో ఏమిఇష్యూ వస్తుందో , మళ్ళి ఎన్ని వీక్ ఎండ్స్ పని చెయ్యాలా అని…
********************************************************************************
ప్రసాద్ ఓరుగంటి (సిలికాన్ వాలీ లో ఒక సిలికాన్ ముక్క )

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s