బుల్లెట్…. (Bullet)

అతడి పేరు ఈశ్వర్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇతని తూటా లకి ప్రత్యర్థుల చావు బాటే, ఇతడి తో వైరం పొరబాటే. అసాంఘిక చర్యలు చేసేవాళ్ళకి ఇతడు యమకింకరుడు. దేశ ద్రోహుల కి సింహ స్వప్నం ఇతగాడు.
**********
హే ఈశ్వర్, “ఈ రాత్రి మనం ఫారెస్ట్ లో మానిటర్ చేయాలి. చందనం చెట్లు కొట్టి పట్టుకెళ్ళే దొంగలు వస్తున్నారని సమాచారం అందింది. సో నీ టీం తో అక్కడికెళ్లి మానిటర్ చేసి అవసరమయితే యాక్షన్ తీసుకోండి” అని తన పై అధికారి ఆదేశమిచ్చాడు ఈశ్వర్ కి. “ఎస్ సార్” అనేసి ఈశ్వర్, తన టీం తో రూట్ డిజైనింగు చేద్దామని అటెండర్ తో కాఫీ తెమ్మన్నాడు. అటెండర్ కాఫీ తీసుకొచ్చాడు. టీం అంతా రాత్రి ప్లాన్ గురుంచి చర్చించుకుంటున్నారు.

సమయం రాత్రి 9 గంటలు. ట్రింగ్..ట్రింగ్ మని ఫోను. “సార్ మీకు ఇంటిదగ్గరనుంచి ఫోను” అంటూ ఇచ్చాడు ఆ కాఫీ తెచ్చిన అటెండర్. ఈశ్వర్ రిసీవర్ ఎత్తాడు. అటుపక్కనుంచి ఈశ్వర్ భార్య సునీత “భోజనానికి ఇంటికి వచ్చేస్తున్నారా” అని అడిగింది. “లేదు, నాకు పని ఉంది నేను రెండు రోజుల దాకా రాను. పిల్లలు ఏమి చేస్తున్నారు” అని ఈశ్వర్ అడిగాడు. “ఇదిగో పెద్దాడు హోంవర్క్ చేసి, ఫోన్ లో గేమ్స్ చూస్తున్నాడు. చిన్నవాడు టాయ్ గన్స్ తో ఆడుకుంటున్నాడు, వాడు కూడా మీలాగే స్పెషలిస్ట్ అవుతాడేమో” అని మెల్లగా అంది. “ఏమో చూద్దాం” అంటూ ఫోన్ పెట్టేసాడు.

సమయం 11 గంటలు. ఈశ్వర్ అండ్ టీం అంతా రెడీ అయ్యారు ఫారెస్ట్ లో కి వెళ్ళడానికి. కావలసిన ఎక్విప్మెంట్స్ అంతా వాన్ లో ఎక్కించారు. అధునాతన గన్ లని కూడా సిద్ధం చేసుకున్నారు. ఈశ్వర్ కూడా తన ఫేవరెట్ గన్ తీసుకుని బుల్లెట్ లని లోడు చేసుకున్నాడు. అందరూ బయలు దేరారు.

చిమ్మ చీకటిలో వాన్ దూసికెళ్తోంది. దారి మద్యలో కొన్ని జింక లు రోడ్డు కి అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఈశ్వర్ డ్రైవర్ కి చెప్పి వాన్ ఇంజిన్ ఆపమన్నాడు, అలాగే హెడ్ లైట్స్ కూడా ఆపే మన్నాడు. తెచ్చుకున్న టార్చ్ లైట్ లతో అందరూ తలో దిక్కున దాక్కున్నారు. అందరూ గన్ లని రెడీ చేసుకుని సిద్ధం గా ఉన్నారు.

ఈశ్వర్ తన వాచ్ లో టైం చూసుకున్నాడు. సమయం రెండు గంటల పది నిముషాలు. కొన్ని పక్షులు అరుస్తున్నాయి. దూరం గా కదులుతున్న పొదలని చూసాడు ఈశ్వర్. అందర్నీ అప్రమత్తం చేసాడు. అవి దగ్గెర వచ్చేటప్పటికి అడివి పందులని తెల్సుకుని ఊపిరి పీల్చుకున్నారు అందరూ. కొంత సేపటికి దూరం గా లారీ ఇంజిన్ శబ్దం వినిపించింది. ఈశ్వర్ అటువైపు వెళ్తున్నాడు తన టీం తో.
*******
ఇంట్లో ఈశ్వర్ భార్య, పిల్లలు పడుకున్నారో లేదో చూద్దామని , పిల్ల ల బెడ్ రూమ్ లో కెళ్ళింది. పెద్దవాడు పడుకున్నాడు. చిన్న వాడు నిద్రట్లో “దిష్యుమ్ దిష్యుమ్” అంటూ చేతులు పైకెత్తుతూ కలవరిస్తున్నాడు.ఈశ్వర్ భార్య వెళ్లి వాడిని పడుకో పెట్టి, దుప్పటి కప్పి తన బెడ్ రూమ్ కి వెళ్లి పడుకుంది.
*****
అడవిలో ఈశ్వర్ టీం ని చూసి, లారీ లో ఉన్న దొంగలు కాల్పులు మొదలెట్టారు. ఆ హఠాత్ పరిణామానికి ఈశ్వర్ కొంచం కంగారుపడి , తన టీం ని రెడీ గా ఉండండి అని చెప్పి ఇంకో పక్క నుంచి ఈశ్వర్ టీం కాల్పులు మొదలెట్టారు. ఆ దొంగల కాల్పుల చేతిలో ఇద్దరు ఈశ్వర్ టీం సభ్యులు గాయ పడ్డారు. వెంటనే ఈశ్వర్ రంగంలోకి దిగి ప్రత్యర్థుల్ని మట్టి కరిపించాడు. ఈశ్వర్ బుల్లెట్ లకి ఒకొక్కలే పడుతున్నారు. పడి ఉన్న దొంగల్ని పట్టుకుని వాళ్ళని వాన్ లో కి ఎక్కించారు.
*******
ఈశ్వర్ అండ్ టీం ని అందరూ అభినందిస్తున్నారు. ఈశ్వర్ కూడా చాలా ఆనందం గా ఉన్నాడు. తాను పట్టుకున్న గన్ నుంచి వచ్చే ప్రతీ బుల్లెట్ తన ని జీవితం లో యెంతో ఎత్తుకు తీసికెళ్తోంది అని అనుకున్నాడు. ఈ విజయానికి గుర్తు గా తన టీం కి తన పై అధికారులకి మంచి పార్టీ ఇద్దామని డిసైడ్ అయ్యాడు. అందర్నీ పిలిచాడు.

ఈశ్వర్ టీం సభ్యులు, పై అధికారులు ఫామిలీ ల తో వచ్చారు. సెలెబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయి. ఒక పక్క పిల్ల లందరూ లోపల హాల్లో  వీడియో గేమ్ లు ఆడుకుంటున్నారు. మరొక పక్క ఆడవాళ్ళూ అంతా హాల్లో నే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకొక పక్క ఈశ్వర్ స్నేహితులు బయట డ్రింక్స్ తాగుతూ, ఈశ్వర్ ఎన్కౌంటర్స్ గురుంచి చర్చించుకుంటున్నారు. ఈశ్వర్ భార్య అందర్నీ పలకరిస్తూ హడావిడి చేస్తోంది. ఒక పక్క పలకరిస్తూనే పిల్లలు ఏమి చేస్తున్నారో అంటూ హాల్లో చూస్తోంది .

పెద్దవాడు తన తోటి పిల్లలకి వీడియో గేమ్స్ లో మెళకువలు నేర్పిస్తున్నాడు. వాళ్ళ కి తెలిసిన కొత్త ఆప్ లు వీడికి చెప్తున్నారు. చిన్న వాడు ఎక్కడున్నాడని వెతుకుతోంది. వాడు కనపడలేదు. “ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు లే” అని తనలో తాను అనుకుని పని లో బిజీ అయ్యింది.

ఈశ్వర్ కూడా తన టీం తో హాల్ బయట తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నాడు.బుల్లెట్ ల ని ఎలా యూస్ చెయ్యాలి , అలాగే ప్రత్యర్ధులు అకస్మాత్తు గా దాడి చేస్తే, ఎలా ఎదుర్కోవాలి అని మెళకువలు నేర్పుతు లెక్చర్ లిస్తున్నాడు.
********
ఈలోపులో ఇంట్లో హాల్లో సడన్ గా కల కలం రేగింది. పిల్లందరూ గోల చేస్తున్నారు. అక్కడున్న ఆడవాళ్ళూ కూడా బెంబేలెత్తుతున్నారు, కానీ అక్కడ నుంచి ఎవరూ కదలట్లేదు. అలాగా భయం భయం గా ఆ మేడ వైపు కి చూస్తూ ఉన్నారు. బయట ఉన్న ఈశ్వర్ స్నేహితులు అరుపులు విని,హాల్లో కి పరిగెత్తుకుంటూ వచ్చారు. కొంతమంది గన్ ల ని పోసిషన్ లో పెట్టి హాళ్ళో కి పరిగెత్తారు. కానీ అక్కడున్న పరిస్థితి చూసి వాళ్ళు గన్ లని కిందన పెట్టి భయం భయం గా చూస్తున్నారు ఆ మేడ వైపుకి.

ఈశ్వర్ కూడా తాగుతున్న గ్లాస్ ని బయట పడేసి తన ఎప్పుడూ పక్కనే ఉండే గన్ గురుంచి చూసాడు. అది కన పడలేదు. కొంచం కంగారు పడి హాల్లో కి వచ్చేసి మేడ వైపు కి చూసి ఆశ్చర్య పోయాడు. ఆ సమయం లో ఏమి చేయాలో అర్ధం కాలేదు. ఈశ్వర్ భార్య కూడా అలాగే చూస్తూ ఉంది పోయింది.

పైన మేడ మీద నుండి, ఈశ్వర్ రెండో కొడుకు ఆరేళ్ళ ఆర్నవ్ గన్ పట్టుకుని, ఒక వేలిని ట్రిగ్గర్ మీద ఉంచి అరుస్తున్నాడు. సెకను సెకను కి పొజిషన్ మారుస్తున్నాడు. ఒక సారి అక్కడున్న చిన్న పిల్ల ల మీదకి, ఇంకో సారి తల్లి బుజాల మీద నిద్రిస్తున్న పసి పిల్లల మీదకి, ఇంకో సారి అటువైపు వస్తున్న ఈశ్వర్ స్నేహితుల మీదకి. ఈ పరిస్థితి చూసి, ఎవరు పోసిషన్ తీసుకోలేదు. అలాగా ఆశ్చర్యం గా, భయం గా చూస్తున్నారు మేడ మీద కి . వీళ్ళందరూ ఎప్పుడూ, ఈశ్వర్ ఆదేశాల గురుంచి వెయిట్ చేస్తూ పొజిషన్ తీసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా ప్రత్యర్ధులు దాడి చేస్తే. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఈశ్వర్ దిక్కు తోచని స్థితి లో దిగులుగా చూస్తున్నాడు.

ఈ లోపులో ఈశ్వర్ భార్య సునీత తేరుకుంది, “ఆర్నవ్ ఆర్నవ్” అంటూ గట్టిగా అరిచింది. మేడ మీద నుండి గన్ పోసిషన్ అమ్మ వైపు కి మార్చాడు. సునీత కొడుకు తో మెల్ల గా చెప్తోంది. “ఆర్నవ్ , డాడీ నీకు రియల్ గన్స్ తీసుకొచ్చారు. అవి కింద గ్లాస్ రూమ్ లో ఉంచారు, సో ఆ టాయ్ గన్ కింద పెట్టి, కిందకు దిగు” అని కొంచం భయం గా మెల్ల గా చెప్తోంది. కింద పిల్లలందరూ బిక్కమొఖాలేసుకుని ఆర్నవ్ కేసి, వాళ్ళ అమ్మకేసి చూస్తున్నారు. ఆర్నవ్అ మ్మ మాట విని, “అమ్మా అయితే ఆ గన్ ని నువ్వే పైకి పట్టుకుని రా”, అప్పుడు ఈ గన్ ఇచ్చేస్తా అని రిప్లై ఇచ్చాడు. ఈ సారి గన్ పొజిషన్ ఏడుస్తున్న ఒక కుర్రాడి వైపుకి తిప్పాడు. ఆ దెబ్బకి ఆ కుర్రాడు ఏడుపు ఆపేసాడు.

తల్లి కి ఏమి చేయాలో తెలియలేదు. “హే ఆర్నవ్ నీకు నీ ఫ్రెండ్స్ చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చారు, ఆ గన్ పడేసి కిందకు రా చూపిస్తా” అని మెల్లగా బుజ్జగించింది. వాడు విన లేదు. అక్కడున్న అందరూ భయ బ్రాంతులతో ఉన్నారు. ఈలోపులో సడన్ గా గన్ శబ్దం ధడేల్ ధడేల్ అని రెండు సార్లు మ్రోగింది.
***********

ఇరవై ఏళ్ళ తరువాత….

హే ఆర్నవ్, “ఈ రోజు మనం సిటీ కెళ్తున్నాం. టెర్రరిస్ట్స్ ఎటాక్ ఉందని సమాచారం అందింది. సో నైట్ కి మనం ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకుందాం” అని టీం మెంబెర్ చెప్తున్నాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆర్నవ్ కి. “ఎస్ ఐ యామ్ రెడీ, ఐ విల్ కిల్ థెం”  అంటూ కాఫీ తాగుతున్నాడు ఆర్నవ్. “హే ఆర్నవ్ ఇంతకీ ఆ రోజు ఏమైంది, అదే.. నీ చిన్నప్పుడు మీ డాడీ ఈశ్వర్ గారు ఇచ్చిన పార్టీ లో నువ్వు గన్ పట్టుకుని హడావిడి చేసావు కదా,  చెప్పు, బి క్విక్” అంటూ ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకుంటున్నాడు ఆర్నవ్ టీం మెంబెర్.

“ఓహ్ అదా..మా అమ్మ అప్పుడు నన్ను బాగానే బుజ్జగించింది గన్ ఇచ్చేమని”. నేను వినలేదు. మా డాడీ కూడా కింద నుండే చూస్తున్నారు, అలాగే అంకుల్స్ కూడా.అప్పటికి హాల్ అంతా సైలెంట్ గా ఉంది. మా అన్న గాడు వీడియో గేమ్స్ లో ఒక అప్ ఓపెన్ చేసి టీవీ వాల్యూం ఫుల్ పెట్టి రెండు గన్ షాట్స్ చేసాడు. ఆ వాల్యూం కి నేను భయపడి గన్ పడేసాను. ఇదంతా మా డాడీ ఐడియా. బ్యాక్ నుండి నడిపించారు. తరువాత నాకు టైంఔట్ లు, మొట్టికాయలు ,నో గిఫ్ట్స్ అలాగా…..

తరువాత, నా ఇంటరెస్ట్ మీద మళ్ళి నేను మా డాడీ లాగానే స్పెషలిస్ట్ అయ్యా…”లెట్స్ ఫినిష్ టెర్రరిస్ట్స్ టుడే.. లెట్స్ గో సిటీ” అంటూ ఆర్నవ్ తన టీం ని రెడీ అవ్వమంటున్నాడు ముష్కరులని అంతమొందించడానికి.
*************************
ప్రసాద్ ఓరుగంటి

Note: కథ, కథ లోని లో పాత్రలు, పాత్రధారులు కల్పితం. ఎవర్నీ ఉద్దేశించినది కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s