మ(నసు) ట్టి లో మాణిక్యం

సమయం: తెల్లవారు జామున మూడు గంటల నలభై నిముషాలు…. ఒక యంత్రం గిరా గిరా తిరుగుతోంది. ఆ యంత్రం లో కొన్ని పదార్దాలు నలుగుతున్నాయి.ఆ నలుగుడి కి ఆ యంత్రం కొంచం గట్టి గానే శబ్దం చేస్తోంది….ఆ యంత్రం వేసిన మనిషి, ఇంకో యంత్రాన్ని కూడా మొదలెట్టాడు, అక్కడా కూడా కొన్ని పదార్దాలు మెత్తగా నలుగుతున్నాయి.

సమయం : పావుతక్కువ ఐదు.సంత పాకల్లో ని కోళ్లు ఇంకా నిద్ర లేవలేదు. కొంచం సేపుఅయ్యాక కొక్కొరొకో అందాములే అని చూస్తున్నాయి.ఒక మనిషి సైకిల్ వెనుక పైన చెప్పిన ఆ పదార్దాలని సైకిల్ కి కట్టుకున్నాడు.  ఇదంతా పడుకుని చూస్తున్న కొన్ని కుక్కలు పైకి లేచి, మనోడే కదా అని మళ్ళి బజ్జున్నాయి. ఆ మనిషి అవన్నీ పెట్టుకుని సైకిల్ ఎక్కి అక్కడికి చేరాడు.

ఆ ముందర రాత్రే అన్ని సర్దేసుకున్న డొక్కలని, కమ్మల్ని పోగు చేసి మంట వెలిగించాడు. అప్పుడే తెచ్చిన ఆ పిండిని  ఒక దాంట్లో పెట్టి, ఆ మంట మీద పెట్టాడు. ఆ డొక్కల మంటకి వెచ్చ గా చక్కగా ఉడుకుతున్నాయి.ఈ లోపులో ఇంకో పొయ్యి మీద పాలు మరిగేస్తూన్నాడు. టీ కాయడానికి.

తెల్లవారుతోంది. ఒక్కొక్కలే మెల్ల మెల్లగా వస్తున్నారు అక్కడికి. పోదున్నే పనికి వెళ్ళేవాళ్ళు…ఇంకో ఊరు వెళ్తూ ఇక్కడ తినేసి వెల్దామనుకునే వాళ్ళు, కాలేజీ కుర్రాళ్ళు.ఊళ్ళో జనాలు.

ఇదిగో ఒక ప్లేట్ వేడి వేడి ఇడ్లీ ఇవ్వయ్య….

ఆయ్ అలాగేనండి. ఇదిగో నండి వేడి వేడి ఇడ్లీ లు.

కొంచం చట్నీ వేయమ్మ ,చట్నీ బావుంది. 

ఇదిగో నండి చట్నీ…

రెండు ప్లేట్ లు ఇడ్లీ పార్సెల్, 

బజ్జి కూడా అయిపోతోంది. బజ్జి కూడా పట్టుకెళ్లండి …..

అయితే బజ్జి కూడా రెండు ప్లేట్ పార్సెల్. 

ఇదిగో డబ్బులు.బజ్జికి ఇడ్లీ కి 

ఇదిగోనండీ మిగతా చిల్లర.

సమయం: ఉదయం తొమ్మిదిన్నర. ఏమయ్యా ఏమైనా ఉన్నాయా , లేదు అన్ని అయ్యిపోయాయి. ఏంటి ఇయ్యాల లేట్ గా వచ్చావ్. , ఇదిగో ఇవే ఉన్నాయ్ మిగిలినా రెండు మూడు బజ్జిలు ని చూపిస్తూ . అవునయ్యా బాబు ఇక్కడికి ముందరే రావాలి, లేకపోతె ఏవుండవు అంటూ కొంచం బాధతో సైకిల్ ఎక్కాడు ఓ పెద్ద మనిషి.

తెల్లవారుతోనే ప్రారంభించే ఆ జీవన పోరాటం, గ్రైండర్ లో మినపప్పు లాగా తిరుగుతూ తిరుగుతూ, చివరికి తెల్లటి ఇడ్లీ రూపం లో అందించటం, సరదాగా కబుర్లు చెప్పటం, కుర్రాళ్లతో క్రికెట్ ఆడటం. మిమిక్రి చేయడం. కండలు చూపించి నేను సల్మాన్ కి తక్కువేమి కాదనటం, కంప్యూటర్స్ గురించి మాట్లాడటం, , అన్నింటికన్నా  తన చేసే పనిని ఎంజాయ్ చేస్తూ, మిగతా విషయాలతో అందరి తో కలిసిపోవడం.

 మైసూరు బజ్జిలాంటి మెత్తటి మనసున్నోడు,  చిన్న చిన్న విషయాలకే పొంగిపోయే పూరి లాంటోడు, అందరితో కలిసిపోయే పెసరట్టు ఉప్మా లాంటోడు 

ఈ మనిషి కి చదువు మినపప్పు అంత, ఆదాయం జనాలకి అప్పు లిచ్చేటంత, వాళ్ళ పిల్లలని చక్కగా చదివించేంత. అందరిలో ఒకడయ్యేటంత , అంతకన్నా నాకు ఆప్త మిత్రుడయ్యేంత. 

ఇంతకీ ఆ మనిషి, నా ఆప్త మిత్రుడు నిజం గా మట్టి లో నుంచి వచ్చిన మాణిక్యమే….ఈయన పేరు మాణిక్యం…హోటల్ మాణిక్యం….గీతాంజలి మాణిక్యం…..

********

ప్రసాద్ ఓరుగంటి 

4 thoughts on “మ(నసు) ట్టి లో మాణిక్యం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s