టీం-జావా (Click & Call ==SAVE )

సమయం రాత్రి 8  గంటలు. హైదరాబాద్…ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ…ఒక పాతికేళ్ల  యువతీ కంప్యూటర్ వైపు చూస్తూ చాలా అసహనం గా ఉంది, తను అనుకున్న రిసల్ట్ రాకపోవడం తో….ఇంకో అరగంట లో onsite కాల్ ఉంది. ఇంకా ప్రాబ్లెమ్ సాల్వ్ అవలేదు అని. ఈ ఇష్యూ ఫిక్స్ అయితే , అమెరికా లో నున్న onsite టీం కి  అప్డేట్ చేసేసి క్యాబ్ లో రూమ్ కెలిపోవచ్చు అని అనుకుంటోంది.

ట్రింగ్ ట్రింగ్ మని  సెల్ ఫోన్ రింగు……హే దివ్యా!, ఏంటి ఇంకా ఆఫీస్ లోనా.. ఏంటి ఇంటికెళ్ళావా అంటూ ఒక గొంతు అటుపక్క. అవును రా మీటింగ్ ఉంది ఇంకో అరగంట లో…నాకేమో ఇక్కడ బగ్ ఫిక్స్ అవ్వలేదు. టెన్షన్ తో చస్తున్నా ఇక్కడ…మా టీం అందరూ వెళ్లిపోయారు. ఈరోజు నాదే అప్డేట్ ఇవ్వాలి onsite  వాళ్ళకి…I  am  going to be mad రా అంటూ గట్టి గానే అరిచింది దివ్య. డోంట్ వర్రీ …నేను వచ్చి పిక్ చేసుకుని డ్రాప్ చేస్తా మీ రూమ్ దగ్గెర అంది అటుపక్క గొంతు. సరేలే వాట్స్ అప్ టెక్స్ట్ చేస్తా అయిన వెంటనే …వచ్చేసే అంది దివ్య. ఓకే సి యు.అని పెట్టింది అటుపక్క గొంతు.

సమయం 8 గంటల ఏభై  నిముషాలు. ఆఫీస్ లో అందరూ ఒక్కొక్కలే ఇంటికి మెల్లగా వెళ్తున్నారు.దివ్య కూడా కంప్యూటర్ shutdown చేసి, వాట్స్ అప్ టెక్స్ట్ చేసింది. hey  I am డన్ అని….అటుపక్క నుంచి వెంటనే రిప్లై ‘Ok , see you soon ” అని. దివ్య లిఫ్ట్ దగ్గెరకెళ్ళి groundfloor  బటన్ నొక్కింది. లిఫ్ట్  మెల్లగా చేరుకుంది groundfloor  కి. అక్కడ వెయిట్ చేస్తోంది అతను గురుంచి. మళ్ళి వాట్స్ అప్ చూసుకుంది. ఇంకా మెసేజ్ ఇవ్వలేదు అనుకుంది…కొంచం చికాకు గా ఉంది. అసలే ఆఫీస్ లో వర్క్ తో అలసిపోయి ఉంది. వీడెంతకు రాడు, రాని చెప్తా వీడికి అనుకుంటుండగానే….హలో దివ్యా! చలో లేట్ అయ్యింది ఇప్పటికే…మీ రూమ్ లో డ్రాప్ చేసేస్తా..పదా అన్నాడు . దివ్య ఏదో అంటుండగానే, హే ట్రాఫిక్ చాలా ఉంది..ఇంకేమి మాట్లాడకు అని చెయ్యి పట్టుకుని కార్ దగ్గరకి తీసికెళ్తున్నాడు కళ్యాణ్ 

హే బయట డిన్నర్ చేద్దామా , లేకపోతె డ్రాప్ చేసేనా అన్నాడు కళ్యాణ్  కార్ నడుపుతూ, పక్కన కూర్చున్న దివ్య తో. లేదు నేను ఇంట్లో తినేస్తా…టూ లేట్ ఇప్పటికే అని అంది దివ్య. ఓకే  అంటూ కార్ దివ్య రూమ్ వైపుకి పోనిచ్చాడు అతను.

*************************************************************************************

ట్రింగ్ ట్రింగ్ మని సెల్ ఫోన్ రింగు. దివ్యా ! గుడ్ మార్నింగ్ ! లేచావా అని అటుపక్క గొంతు. హా లేచా మమ్మీ …ఫ్రెష్ అయి ఆఫీస్ కెళ్ళాలి…ఈవెనింగ్ కాల్ చేస్తా లే అని పెట్టేసింది దివ్యా. దివ్యా ఫోన్ తీసుకుని కాల్ చేసింది..హలో కళ్యాణ్ లేచావా బాబూ..ఏంటి ఇవ్వాళా ప్లాన్ నీది. ..హే దివ్యా….నథింగ్ …ఐ విల్ ఫాలో యు wherever యు గో  అని అన్నాడు. హే నాకు వర్క్ బాగానే ఉంది ఈ రోజు…ఈ మంత్ ఎండింగ్ కి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, సో మనం ఇంకా వీకెండ్స్ మాత్రమే కలుద్దాం. నీ పని చూసుకో ..ఒకే నా అంది దివ్యా…yeah సరే అని అన్నాడు కళ్యాణ్…

******************************************************************************

హే కళ్యాణ్ ….హౌ అర్ యు man అంటూ, నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు కళ్యాణ్ ఉంటున్న ఫ్లాట్  కి, ఏంటి ఈ వీకెండ్ plans , shall we go  long  drive అని అన్నారు. హే కళ్యాణ్…ఐ థింక్ నిన్ను ఒకమ్మాయి తో చూసాం లాస్ట్ వీక్. నీ ఫ్రెండా/ లవరా  అంటూ గోల పెట్టారు. అవును ఫ్రెండ్స్, తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు 3  ఇయర్స్ బ్యాక్ అమీర్పేట్ లో నేనేదో కోర్స్ నేర్చుకుందామని వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది…ఈ 3  ఇయర్స్ లో తను అనుకున్న టార్గెట్ కి చేరింది జాబ్ కొట్టి. అవును she is  గుడ్ అని తన గురించి ఆలోచిస్తున్నాడు.. హే మాన్..గాల్లో చూడటం కాదు..ఆ స్టోరీ మాకు కూడా చెప్పు…వింటాం అంటూ నవ్వుతున్నారు.

************************************************************************

మైత్రీవనం సెంటర్…అమీర్పేట్….హైదరాబాద్….అక్కడ ఆ స్త్రీట్స్ అన్ని బానర్స్ తో కప్పి ఇదే ఆకాశం అని చెప్పిన్నట్టుగా ఉంది. చాలా పేపర్స్ కింద పడి ఉన్నాయ్.అవి పాంప్లెట్స్ అనుకుంట..ఒక పక్క zerox  మెషిన్ లో నుంచి కాపీ లు తీయిస్తున్నారు. ఇంకో పక్క చిన్న బండి మీద నూడుల్స్ పెట్టి టక టక సౌండ్ చేస్తూ అమ్మేస్తున్నారు. అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు యేవో మాట్లాడుకుంటూ అవి తింటున్నారు. ఇంజనీరింగ్ ని పూర్తిచేసి, క్యాంపస్ లో జాబ్ కొట్టని అమ్మాయిలు, అబ్బాయిలు ఇక్కడకు వచ్చి ఏమి నేర్చుకుంటే బావుంటుందని వచ్చి, అడిగి, కోర్సెస్ లో జాయిన్ అవుతున్నారు.  ఇంజనీరింగ్ అయిన వెంటనే నేను కూడా అక్కడ జావా కోర్సు చేద్దామని ఒక సెంటర్ కి వెళ్ళా. అప్పడు కనపడింది నా కలల రాణి దివ్యా. అప్పుడు యేవో questions వేస్తోంది ఇన్స్ట్రక్టర్ కి. నేను ఆమె నే చూస్తున్న……ఆలా మొదలయ్యింది రా  మా లవ్ స్టోరీ….చాలా….ఇంకేమి చెప్పాలా…అంటూ వెయిట్, కాఫీ తాగి వస్తా అంటూ కిచెన్ లో కెళ్ళాడు కళ్యాణ్….

*****************************************************************************

ఆఫీస్ లోదివ్యా:   ఓహ్ మై గాడ్ , ఇది అందరి స్టోరీ లానే ఉంది, దివ్యా….వాట్ is న్యూ ఇన్ యువర్ లవ్ స్టోరీ అంటూ అడుగుతూ…something నువ్వు దాస్తున్నావ్ …ప్లీజ్ ప్లీజ్ రివీల్ ది స్టోరీ అంటూ…చాలా ఆత్రుత తో అడుగుతున్నారు ఆఫీస్ కొలీగ్స్ లంచ్ టైం లో, హే గైస్..ఐ విల్ టెల్ ది స్టోరీ లేటర్…ఒకే..అంటూ..కోడింగ్ లో మునిగిపోయింది దివ్యా…

****************************************************************************

కళ్యాణ్ ఫ్రెండ్స్ తో:  ఆవును రా…మాది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ అంటూ మొదలెట్టాడు  ఫ్రెండ్స్ తో కాఫీ  తాగుతూ, మేము మొట్టమొదట కలుసుకున్నది అమీర్పేట్ జావా సెంటర్ లో నే….ఆమె రోజు క్లాస్ కి మిస్ అవకుండా వచ్చేది. నేను కూడా మిస్ అయ్యేవాడిని కాదు ఈ మిస్ ని చూడకుండా….ఆమె చాలా ఫోకస్డ్ గా ఉండేది. ఇచ్చిన ప్రోగ్రాంలు టక టక ఎగ్జిక్యూట్ చేసేసి అవుట్ ఫుట్ చూపించేది. నా ఫోకస్ అంతా ఈమె. ఒకరోజు ఆమెని అడిగా..”హలో దివ్యా! మీ నోట్స్ ఇస్తే నేను అవి చూసి “హలో వరల్డ్” లు ఎగ్జిక్యూట్ చేసుకుంటా అని, ఆమెకి నవ్వు వచ్చింది. మనోడు ఇంకా హలోవరల్డ్ లో నే ఉన్నాడు అనుకుని. ఆమె నోట్బుక్ ఇచ్చింది. నేను ఆమె రాసుకున్న ప్రోగ్రాం లన్ని ఎగ్జిక్యూట్ చేసి అబ్బో నాకు కూడా తెగ ఔట్పుట్ వచ్చేస్తోంది అని మురిసిపోయేవాణ్ణి. దానికన్నా ఆమె తో ఎక్కువగా మాట్లాడుతున్నందుకు హ్యాపీ గా ఉండేది….

అప్పటికే కోర్ జావా అయ్యిపోయింది , అడ్వాన్స్ జావా క్లాస్ లు మొదలెడుతున్నారు. ఒక రోజు అడిగా క్లాస్ అయిన తరువాత నూడుల్స్ తిందామా ని, తను తలూపింది. క్లాస్ అయిన వెంటనే ఇద్దరం అక్కడేనున్న నూడిల్ బండి దగ్గెరకెళ్ళి నూడుల్స్ తిన్నాం. తను ఏదో మెటీరియల్ కాపీ తీయాలనుకుంటే అక్కడ జిరాక్స్ మెషిన్ దగ్గరకెళ్ళి కాపీ లు తీయించుకున్నాం…..అలాగా స్టార్ట్ అయ్యింది. తను గురుంచి అడిగా….ఏ ఊరు , ఫామిలీ అని….తను చెప్పింది ఎక్కడ ఇంజనీరింగ్ చేసింది, వాళ్ళ ఫామిలీ గురుంచి…ఆలా ఆలా…..స్లో గా స్టార్ట్ అయ్యింది…అంటూ గైస్ i  have సం వర్క్  అని ఫోన్ లో మునిగిపోయాడు…..ఓహ్ మై గాడ్….this guy  always  like this only అంటూ…నెక్స్ట్ ఏమి జరిగిందో అని ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు…..

*****************************************************************************

దివ్యా హాస్టల్ లో: హే దివ్యా…..లెట్స్ కంటిన్యూ ఆన్ యువర్ లవ్ స్టోరీ….అంటూ దివ్యా ఫ్రెండ్స్ అంతా గోల చేస్తున్నారు….దివ్యా మొదలెట్టింది…వాడు మంచోడే. కానీ ప్రోగ్రామింగ్ మీద ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. కానీ నా ఆలోచనలు అంతా వేరు. నేను మంచి జాబ్ కొట్టాలి, నా కెరీర్ చాలా బాగా ఉండాలి..అనుకుని ఆ జావా ని జావ లా తాగేసి, జాబ్స్ కి అప్లై చేశా. నాకు ఫస్ట్ attempt కె ఈ కంపెనీ లో జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తరువాత నేను కళ్యాణ్ కి టచ్ లో లేను, నా జాబ్, నేను ఫుల్ బిజీ….కళ్యాణ్ ని నేను ఎప్పడూ అతనుగురుంచి అడగలేదు..అతనిదేవూరు, ఫామిలీ లాంటివి…అతను మాత్రం నా గురుంచే ఎక్కువ ఆలోచిస్తూ ఉండే వాడు అని నాకు అనిపించేది…

అంటే అతనికి లైఫ్ లో సెటిల్ అవుదామని లేదంటావా..అని ఆపిల్ కొరుకుతూ ఒక ఫ్రెండ్ దివ్యా ని అడిగింది. అవునే అలాంటిదే…ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ,  నన్నే చూస్తూ  ఉండేవాడు. సో నేను ఎక్కువగా పట్టించుకోలేదు. నాకెపుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అతని మీద  because  he is  not జీనియస్, but he is  Ok అని అంది ఫ్రెండ్ తో….కానీ అప్పుడు మాది మూడు నెల్ల పరిచయం మాత్రమే ఆ జావా కోర్సు లో అంది…

ఓరోజు నాకు కాల్ వచ్చింది కళ్యాణ్ నుంచి, హే దివ్యా ఎలా ఉన్నావ్…జాబ్ వచ్చిందిట…చెప్పలేదు నాకు…అంటూ… అవును కళ్యాణ్, జాబ్ లో ఫుల్ బిజీ వర్క్ ఎక్కువుంది అందుకే కుదర్లేదు..ఇంతకీ నువ్వ్వు ఏమి చేస్తున్నావ్..ఇంకా అక్కడే నేర్చుకుంటున్నావా…జాబ్ వచ్చిందా..హే కళ్యాణ్..మంచి ఫ్రెండ్ గా చెప్తున్నా. నేర్చుకున్నావు కదా…ఎక్కడైనా జాబ్ చేయచ్చు కదా..అలా ఖాళీ గా తిరగకపోతే అని అన్నా..సరే…అని ఫోన్ పెట్టేసాడు…

నేను చాలా హ్యాపీ గా ఉన్నా, జాబ్ ఉంది ఎప్పుడో అమెరికా కి onsite కూడా వెళ్ళచ్చు, అప్పుడప్పుడు కొంచం వర్క్ ప్రెషర్ ఉన్నా, జాబ్ ని ఎంజాయ్ చేస్తున్న. హాలిడేస్ కి ఆమ్మా వాళ్ళింటికెళ్ళడం అక్కడ వాళ్ళు మా అమ్మాయి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబ్ అని గొప్పగా చెప్పడం, అహ, వండర్ఫుల్ డేస్.

రోజులు గడుస్తున్నాయి, ఇంట్లో వాళ్ళు సంబంధాలు మొదలెట్టారు. ఆస్ట్రేలియా నుంచి, అమెరికా దాకా అబ్బాయిలు ఫోటో లు వస్తున్నాయి.కానీ నాకెవరు నచ్చట్లేదు. ఆమ్మా ఇంకా తొందరెంటే…మెల్లగా చూద్దాం అని ఆమ్మా వాళ్ళకి చెప్తున్నా…నా మైండ్ లో కూడా ఎవరూ లేరు. ఉన్నది ఒకటే అది జావా కోడింగ్…

************************************************************************

కళ్యాణ్ ఫ్రెండ్స్ తో: కళ్యాణ్ మళ్ళి మొదలెట్టాడు ఫ్రండ్స్ తో, తనకి జాబ్ వచ్చిన తరువాత నేను ఎక్కువ గా మాట్లాడలేదు, తను నాకి ఎప్పుడూ ఫోన్ చేయలేదు. నేనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడిని. ఎలా ఉంది జాబ్ , హాస్టల్, అని….

ఒకరోజు తను ఆఫీస్ నుంచి లేట్ గా ఆఫీస్ కి ఇంటికి బయల్దేరింది. తను క్యాబ్ బుక్ చేసుకోపోవడం తో అక్కడ ఆగి ఉన్నా ఆటో ని పిలిచింది. ఆటో ఎక్కింది. ఆటో మెల్లగా బయలుదేరింది. తను చాలా టైర్డ్ గా ఉండటం తో ఆ ఆటో ఎక్కడికెళ్తోందో ఆమెకి తెలియడం లేదు…ఆటో మెయిన్ రూట్ నుంచి అడ్డా రూట్ కి వెళ్తోంది.  ఆ టైం కె నేను దివ్యా కి కాల్ఈ చేశా . సడన్ గా నా కాల్ రావడం తో దివ్యా ఉలిక్కిపడి, అటు ఇటు చూసి, నా తో మాట్లాడుతూ కొంచం ధైర్యం గా ఉండటం తో ఆటో డ్రైవర్ భయపడి మల్లి మెయిన్ రూట్ కి తీసుకొచ్చాడు. నా తో మాట్లాడుతూ చాలా ఏడ్చేసింది. నేను ధైర్యం చెప్పి జాగ్రత్త గా ఇంటికెళ్ళమన్న..

ఆ రాత్రి నాతొ మాట్లాడుతూనే ఉంది. ఏడుస్తూ..నీ కాల్ వలెనే నేను సేఫ్ గా వచ్చేసా అంటూ…అప్పటినుంచి మొదలయ్యింది ఆమెకి నా మీద ఒక మంచి అభిప్రాయం, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేది. నా గురుంచి ఎప్పుడూ తెలిసికోలేదు.ఆమె.

***************************************************************************

హాస్టల్ లో దివ్యా: హే దివ్యా….కంప్లీట్ చేసేవే నీ లవ్ స్టోరీ ఈ నైట్, నేనైతే ఈ నైట్ పడుకొను, నిన్ను పడుకొను నీ లవ్ స్టోరీ  చెప్పేవరకు అంది రమ ,దివ్యా తో. ఓకే లే ఈరోజు తో చెప్పేస్తా నా కథ ని అని మొదలెట్టింది.  ఒక రాత్రి ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరినప్పుడు ఆటో వాడు నన్ను ఎక్కడికో తీసికెళ్తుంటే, సడన్ గా నాకు కళ్యాణ్ నుంచి ఫోన్ వచ్చింది, నన్ను మాట్లాడుతూ ధైర్యం గా ఉండమన్నాడు. ఈ లోపులో ఒక పోలీస్ వాన్ వచ్చి ఆ ఆటో డ్రైవర్ ని పోలీస్ స్టేషన్ కి తీసికెళ్లారు. లక్కీ గా కళ్యాణ్ ఆ టైం కి కాల్ చేసాడు…

ఆ రాత్రి కళ్యాణ్ కి ఫోన్ చేసి ఏడ్చేసా…అదే అతనితో ఆంతా సేపు మాట్లాడింది.ఆ రాత్రి తలచుకుంటే ఇప్పటికే భయం గా ఉంటుంది. హి saved me .అప్పటినుంచి అతనితో మాట్లాడాలనిపించేది.కానీ, అప్పటికీ అతనికి కెరీర్ మీద గైడెన్స్ ఇచ్చి జాబ్ చేసుకోమని చెప్తూనే ఉన్నా..అతను అలాగే అలాగే అని అంటుండేవాడు.కానీ అతనితో ఫ్రెండ్షిప్ చెయ్యాలనిపించేది, యేవో యేవో కబుర్లు చెప్పాలనిపించేది. కానీ ఒక్కటే భాద గా ఉండేది అతను ఇంకా సెటిల్ అవలేదని. అలా అలా మొదలయ్యింది మా స్టోరీ…..చాల్లే..ఇంక బజ్జోమ్ది అంటూ లైట్ కట్టేసి పడుకుంది. బానే ఇంటరెస్టింగ్ గానే ఉంది మీ స్టోరీ…లెట్స్ సి వేర్ ఇట్ గోస్ అంది రమ వాట్స్ అప్ చూసుకుంటూ …

***************************************************************************

సమయం 2 am . హైదరాబాద్. కాల్ సెంటర్ ఆఫీస్. ..ఇద్దరు అమ్మాయిలు క్యాబ్ లో హాస్టల్ కెల్దామని క్యాబ్ ని బుక్ చేసుకున్నారు. క్యాబ్ వచ్చింది. అమ్మాయిలు క్యాబ్ ఎక్కారు. కొంత దూరం వెళ్లిన తరువాత క్యాబ్ మెయిన్ రూట్ నుంచి అడ్డా రూట్ కెళ్ళి ఆగింది. అక్కడ ఇద్దరు మగాళ్లు కార్ ఎక్కుదామనుకున్నారు. ఒక అమ్మాయి డ్రైవర్ తో అరుస్తోంది ఎవరు వాళ్ళు అని, ఇంకో అమ్మాయి మొబైల్ మీద ఏదో పని చేస్తోంది. ఈ argument అయిన 10  నిమిషాలలో ఒక పోలీస్ వాన్ వచ్చి ఆగింది….డ్రైవర్ తో పాటు ఆ మగాళ్లని కూడా పోలీస్ లు తీసికెళ్లారు.

సమయం నాలుగు గంటలు. తెల్లవారు జామున. ఒక ఫామిలీ బండి మీద వెళ్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళని వెంబడిస్తున్నారు. ఈ ఫామిలీ మాన్ బండిని ఫాస్ట్ గా పోనివ్వడం మొదలెట్టాడు. కొంత దూరం వెళ్లి బండి ని ఆపాడు. ఈ లోపులో గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళని పట్టుకుని గన్ చూపించి ఎవరు మీరు అని గట్టి గా అడిగాడు. ఈలోపులో పోలీస్ వాన్ వచ్చింది. ఆ గుర్తు తెలియని వ్యక్తులని పోలీస్ లు పోలీస్ స్టేషన్ కి తీసికెళ్లారు.

***************************************************************************

హైదరాబాద్ లో అర్ధ రాత్రి నుంచి, తెల్లవారు జామున ఇంటికి వెళ్లే జాబ్ చేస్తున్న యువతులు అందరూ వాళ్ళ వాళ్ళ ఫోన్ లలో ఒక ఆప్ ని use  చేస్తూ  ఇంటికి సేఫ్ గా వెళ్తున్నారు. ఏదైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆ క్యాబ్ లో కి ఎక్కాలనుకున్న, లేదా ఆటో లు దారి మళ్లించాలనుకున్న…పది నిమిషాలలో పోలీస్ లు వచ్చేస్తున్నారు, అమ్మాయిలను సురక్షితం గా ఇంటికి చేరుస్తున్నారు. ఆగంతకులును  జైలు కి పంపిస్తున్నారు.

ట్రింగ్..ట్రింగ్….హే కళ్యాణ్ ! దివ్యా హియర్. ఏంటి ఏమి చేస్తున్నావ్ అంది దివ్యా., వర్క్ లో ఉన్నా…ట్రాక్ చేస్తున్నా అని రిప్లై ఇచ్చాడు కళ్యాణ్. ఏంటీ అక్కడ బయట అమ్మాయిలని చూస్తున్నావా….ఏదో ట్రాక్ చేస్తున్నావ్ అని అంటున్నావ్ అని నవ్వుతూ అంది. ఆ మాటకి అవును అమ్మాయిల్నే ట్రాక్ చేస్తున్నా..అని నవ్వుతూ అన్నాడు. హే కళ్యాణ్…చిన్న suggestion . నువ్వు ఏమి అనుకోకపోతే ఒక మాట వింటావా..నేను నీకు మళ్ళి జావా ని రిఫ్రెష్ చేస్తా.. బాగా నేర్చుకుని జాబ్ ట్రై చేయచ్చుకదా…ఇంకా అమ్మాయిలని చూస్తూ ఎప్పటికి సెటిల్ అవుతావు అంది. సరే సరే ఇంక తొందరలోనే సెటిల్ అయిపోతా..ఓకే నా అని అన్నాడు. సీ అప్పుడు నేర్చుకున్న అందరికీ జాబ్ వచ్చేసింది. ఆ గ్రూప్ లో నువ్వొక్కడే ఇంకా సెటిల్ అవలేదని నా ఫీలింగ్ అంతే..డోంట్ మైండ్ అని పెట్టేసింది.

***************************************************************************

ఆ ఆప్ ఆండ్రాయిడ్, IOS లలో చక్కగా రన్ అవుతోంది. ఆ ఆప్ క్లిక్ చేసిన వెంటనే గూగుల్ మ్యాప్ ద్వారా అక్కడున్న ప్రదేశం అవతలవాళ్ళకి చేరుతుంది. ఎమర్జెన్సీ కాల్ నొక్కినవెంటనే…ఆ చుట్టుపక్కల మొబైల్ రూమ్స్ కి చేరి వెంటనే ఆ టీం అలెర్ట్ అయ్యి, ఇక్కడ ఫోన్ అలారమ్ కింద మోగుతుంది. 10 లేదా 15 నిమిషాలలో ఆ టీం ఇక్కడికొచ్చి సేవ్ చేస్తూ ఉంటుంది. ఆపదలోనున్న అమ్మాయిలు అందరూ వాడుతున్నారు. అప్పుడప్పుడు కొంచం సరదాగా కి కూడా వాడుకుని ఆ టీం చేత చివాట్లు కూడా తింటున్నారు.

**************************************************************************

ట్రింగ్ ట్రింగ్….దివ్యా కాల్ చేసింది కళ్యాణ్ కి. హే కళ్యాణ్, నీకు తెలుసా…ఒక అప్ ఉంది సం వన్ developed that  అప్, ఐ థింక్ its a  startup  కంపెనీ…చాలా మంది వర్క్ చేస్తున్నారట…you  know its  రియల్లీ సేవింగ్ వర్కింగ్ గర్ల్స్ lives …నాకే ఆ అప్ రెండు, మూడు సార్లు  use అయ్యింది. ఇప్పుడే చెక్ చేస్తున్నా, వాళ్ళ దాంట్లో చాలా పొజిషన్స్ ఉన్నాయిట. జావా మీద, నైట్ టీం సపోర్ట్ అని, ఇలా చాలా..నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు కళ్యాణ్….its a గ్రేట్ కంపెనీ….ఎంతో కొంత మనీ వస్తుంది, దానికన్నా ఆ టీం లో వర్క్ చేస్తున్నావని ఒక గ్రేట్ ఫీలింగ్ కూడా వస్తుంది. నేను కూడా చూస్తున్నా అక్కడ…వస్తే హ్యాపీ గా అక్కడకే వచ్చేస్తా….అని అంటూ, ఇదిగో కళ్యాణ్…ప్లీజ్ దీని గురుంచి కొంచం ఆలోచించు రా అంటూ పెట్టేసింది.  

****************************************************************************

దివ్యా హాస్టల్ లో: హే దివ్యా, సీ న్యూస్ లో వస్తోంది ఆ అప్ గురుంచి. దివ్యా, ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు. అప్పుడే లైవ్ లో కి ఒకతను వచ్చి కుర్చీ లో కూర్చున్నాడు. యాంకర్ చెప్తోంది. వెల్కమ్ to కళ్యాణ్  యంగ్ సీఈఓ అఫ్ ది startup , ఇప్పుడు ఈ అప్ గురుంచి తెలియని యువతులు ఉండరు. ఇంకా తెలియని వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకందరికీ ఆ అప్ గురుంచి, ఆ ఆప్ ని కనిపెట్టిన మన కళ్యాణ్ గురుంచి మీకందరికీ అందిస్తున్నాం….స్టే ట్యూన్డ్ అంటూ….యాడ్ లో కెళ్ళింది..ఆ ఛానల్.

దివ్యా కి నోటి మాట లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా…..దివ్యా ఏడుస్తూనే ఉంది. హే దివ్యా….తరువాత ఏడుద్దువు కానీ, ఆ కళ్యాణ్ చెప్పిన మాటలు విను……

కళ్యాణ్ చెప్తున్నాడు. ఆ అప్ గురుంచి, నేను మాములుగానే ఇంజనీరింగ్ చదివి పాస్ అయ్యా. చదువుతున్నప్పుడే నాకు ఒక అప్ ని తయారు చేసి, ఆ అప్ ని ఎక్కువమందికి ఉపయోగపడేలా చెయ్యాలని తపన ఉండేది…ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే నేను ఈ అప్ కి అంకురార్పణ చేశా…నా సీనియర్స్ అమ్మాయిలు కి జరిగిన అలాంటి సంఘటనలు ఏ అమ్మాయిలకి జరగకుండా ఉండాలనే ఈ అప్ ని చేశా.

మొదట్లో ఎవరైనా ఎమర్జెన్సీ కాల్ ని కొట్టినవెంటనే, ఆ కాల్ మా మొబైల్ టీం కి రావడం. ఆ తరువాత మా మొబైల్ టీం నుంచి పెద్దగా అలారమ్ మెసేజ్ లు పంపడం, దీనివలన అడ్డదారిలో వెల్దాముకునే వాళ్ళకి కొంచం భయం కల్పించాం. తరువాత ఇంటర్నల్  గా కొద్దీ మంది తో టీం ని ఏర్పాటు చేసి, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే వాళ్ళు ఇమ్మీడియేట్ గా ఆ ప్లేస్ కెళ్ళి, అమ్మాయిలని సేఫ్ జోన్ కి తీసికెళ్ళేవాళ్ళం. ఆ తరువాత పోలీస్ టీం తో కూడా అనుసంధానమయ్యి ఆ అప్ ద్వారా, పోలీస్ లు కూడా సకాలం లో అక్కడికి వచ్చి బాధితుల్ని సేవ్ చేస్తున్నారు. నెమ్మదిగా స్టార్ట్ అయ్యిన ఈ టీం, మేము కూడా జాయిన్ అవుతాం నైట్ టీం సపోర్ట్ కి అంటూ చాలా మంది మాకు, పోలీస్ డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేస్తున్నారు…..అక్కడ టీవీ చూస్తున్న  అమ్మాయిలాల్ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి

దివ్యా ఏడుస్తూ .. TV లో మాట్లాడుతున్న కళ్యాణ్ వైపుకి చెయ్యి చూపిస్తూ…….ఇతనే నా కళ్యాణ్ ….ఇతనే నా కళ్యాణ్ అంటూ ఏడుస్తోంది……..

******************************************************************************

ట్రింగ్ ట్రింగ్ మంటూ ఫోన్….హే దివ్యా….కళ్యాణ్ హియర్….అని అంటున్నాడు కళ్యాణ్. ఇటు పక్క దివ్యా కంగారు గా ఫోన్ లిఫ్ట్ చేస్తూ..ఏమి మాట్లాడాలో తెలియట్ లేదు. హలో..క..క..కళ్యాణ్….కాదు CEO కళ్యాణ్…అంటూ కొంచం తడబడుతూ మాట్లాడుతోంది…హే దివ్యా…ఈ వీకెండ్ కూర్చుందామా జావా క్లాస్ లో అని అన్నాడు…దివ్యా ఏడుపు ఆగట్లేదు. హే కళ్యాణ్….నువ్వు నాకు ఎప్పుడూ నీ గురుంచి చెప్పలేదు..కాదు…నేనే నీ గురుంచి అడగలేదు…అంటూ ఏడుస్తూ  చెప్తోంది…హే దివ్యా…be కూల్…be కూల్…మనం కలుద్దాం. కలిసి మాట్లాడుకుందాం ఓకే న….come  to  మై స్వీట్ కంపెనీ కి…అంటూ ఫోన్ పెట్టేసాడు.

*************************************************************************

  6 నెలలు తర్వాత

హే కళ్యాణ్!, నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పేశా అంది మన గురుంచి. ఏమన్నారు అని అడిగాడు కళ్యాణ్.ఒకసారి నిన్ను రమ్మంటున్నారు. టీవీ లో చూశారట. కానీ దగ్గెర గా చూడాలిట. అప్పుడే డిసైడ్ చేస్తారు ట అని నవ్వుతూ అంది. సరే నువ్వు కూడా నచ్చేసావుట మా వాళ్ళకి…మరి మా ఇంటికెప్పుడొస్తావ్ అని అన్నాడు కళ్యాణ్ దివ్యా తో.

హే దివ్యా…మన పెళ్లి అయ్యిన తరువాత హానీమూన్ కి మూన్ వెళ్దామా అని అడిగాడు కళ్యాణ్, ఏం బాబు..నువ్వు ఒక అప్ తయ్యార్ చేసి, అది నొక్కినా వెంటనే స్పెషల్ రాకెట్ వచ్చి తీసికెళ్తుందా అని నవ్వింది. హే గుడ్ ఐడియా…..లెట్ మీ ట్రై అని నవ్వాడు.

****************************************************************************

ప్రసాద్ ఓరుగంటి.

Note: కథ, కథ లోని లో పాత్రలు, పాత్రధారులు కల్పితం. ఎవర్నీ ఉద్దేశించినది కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s