నా మదిలో మామిడాడ.

ఎన్నో భిన్న మనస్తత్వాలు, విభిన్న వ్యక్తులు ని కలిపి, ఆ రోజులును   ప్రతీ మదిలోను  గుర్తు  ఉంచుకునే  కథ ఈ నా మదిలో మామిడాడ
************************************************************
ఇక్కడ బాగా చదివేస్తే  ,ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు క్యాంపస్ నుంచే కొట్టేయచ్చు అని కల కనలేదు..అలాగే ఇక్కడ చదివిన చదువుతో మనం మాంచి పెద్ద కంపెనీ పెట్టేద్దామని అసలు అనుకోలేదు.అందరిదీ ఒకటే ఆశయం అక్కడ చదువు పూర్తి చేసిన తర్వాత చూద్దాం మిగతా సంగతి అనుకుంటూ ..ఒకొక్కలు మెల్ల మెల్లగా జాయిన్ అవుతున్నారు MBA కళాశాలలో …….
ఆ ఊరు కాకినాడ కి గంట ప్రయాణ దూరం లో, అలాగే సామర్లకోట కి కూడా కొంచం దగ్గరవడం తో ఆంధ్ర ప్రదేశ్ లో నున్న వివిధ నగరాలతో పాటు, తెలంగాణ నుంచి కూడా వచ్చి, ఈ తూగోజి హార్వార్డ్ అనే DLR కాలేజీ ని కళ కళ లాడేలా చేసారు అమ్మాయిలు & అబ్బాయిలు.
కాలేజ్ కి హాస్టల్ ఉంది కాబట్టి, అక్కడే ఉండి చింపేద్దాం అని నా లాంటి వాళ్ళు చాలామంది. ఎందుకులే ఈ హాస్టల్ గోల, మార్నింగ్ వచ్చేసి, బాగా పాఠాలు వినేసి , మళ్ళి ఇంటికి పోదామనుకుని డే స్కాలర్స్  కొంత మంది.
************************************************************
నేను ముందరుండి మిమ్మల్ని నడిపిస్తాను అన్నట్టుగా ఉండే సారధి, పార్థ సారధి మామ. తన పాత అనుభవాలు అందరకీ చెప్తూ, సరదాగా ఉంటూ…ముందరికీ నడిపించే మామ..
లీడర్ అంటే ఇలాగె ఉండాలేమో అన్నట్టుగా,  మంచి నాయకత్వ లక్షణాలున్న మనిషి,  ..నువ్వు మనిషివా…మంగిరెడ్డి వా అంటూ తన దైన శైలి లో చెప్పి నవ్విస్తూ,…బాలయ్య బాలయ్య నా గుండెల్లో నీవయ్యా అంటూ ..ఉండే DP (దుర్గా ప్రసాద్)
DP  కి ఆప్త మిత్రుడు, సినిమా హీరోలకి డబ్బింగ్ ఇచ్చే వాయిస్ కలిగిన పల్నాటి కుర్రోడు కృష్ణ, మాదీ అక్కడే అంటూ చెప్పే పల్నాటి పౌరుషాన్ని చూపే మాధవ రెడ్డి.
నేను , నాగార్జున  కజిన్స్ అంటూ, శివ లో నాగార్జున లా కనిపించే రవి బాబు.
డీసెంట్ గా కనిపించే డేవిడ్ . లేట్ గా వచ్చినా మ్యూజిక్ లో నేను దిట్ట అంటూ వచ్చిన విల్లియమ్స్,
పూత రేకుల్లో, చాలా లేయర్లు ఉన్నట్లు  నా లో  కూడా ఎన్నో లేయర్లు ఉన్నాయ్ (చమత్కారం, వెటకారం, ఉపకారం మరియు మమకారం ) అంటూ ఆత్రేయపురం నుండి వచ్చిన రవికిరణ్
సైలెంట్ గా ఉంటూ, మెత్త గా మాట్లాడుతూ , ముక్కు సూటిగా మాట్లాడని ముక్కు రాజు ,
ఏవోవో కబుర్లు చెప్తూ, చాలా హడావిడి చేసే వైజాగ్ రామ కృష్ణ.
నేను పక్కా లోకల్  అంటూ చెప్పే ఊలపల్లి రామ కృష్ణ, జాకిష్రాఫ్ఫ్ లాగా మత్తు కళ్ళు పెట్టి చూపించే రవి శంకర్ ,
ఇవన్నీ కాదు, నేను మీ జాతకాలు తిప్పేస్తా , చెయ్యో సారి ఇచ్చుకోండి అంటూ హాగో (హరగోపాల్), నేను తెలంగాణ బిడ్డని, చూసుకోండి, నా తడాఖా అంటూ తెలంగాణ యాసలో హడావిడి చేసే మధుకర్,
తన దైన శైలి లో అందర్నీ నవ్వించే ఉయ్యురూ మధు,కాకినాడ నుంచి వస్తూ , హలో అంటూ వెళ్లే కాకినాడ మధు, అన్వార్, అమర్, సురేష్ & జీవన్ లు.
పాన్ పరాగ్ కి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు గా ఉండే ప్రసాద్ (PP ), లెక్కల్లో నేను దిట్ట అంటూ చెప్పే మహీంద్రా .
నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒక వైపు అంటూ అనుకునే మా బాలాజీ అందగాడు (MBA ),
మాట కన్నా నవ్వు తో ఎక్కువుగా పలకరించే పెద్దాపురం కిరణ్, అప్పుడప్పుడు హలో అనే సుబ్బారావు,
నేను జాణ పదాల పాటలలో ఆణి ముత్యం అంటూ , మాది వీజీ నగరం అంటూ చెప్పే నాయుడు బావ.
చిన్నప్పుడెప్పుడో వేసిన ఒక లాంటి కుప్పిగంతులను, చిరంజీవి స్టెప్ లా అనేసుకుని, ఈ స్టెప్పులను సీనియర్స్ ముందర వేసేసి, వాళ్ళని ఒప్పించేయచ్చు, రాగ్గింగ్ తప్పించుకోవచ్చు అనేసుకునే  ONS
కాలేజీ లో అబ్బాయిలే కాదు, మేము  ఉన్నాం అంటూ, లలిత, నీలిమ, అనీషా, అనురాధ, మల్లేశ్వరి, సుందరి, కాత్యాయినీలు.
************************************************************
ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందునా ఫ్రెషర్స్ అంటే సీనియర్స్ కి లోకువే కాబట్టి, హాస్టల్ లో ఉండే వాళ్ళను నంచుకి తినడం మొదలెట్టేసారు అప్పటి సీనియర్స్..ఈ గోల మాకెందుకు లే అని కాకినాడ బ్యాచ్ అమర్, అన్వార్, మధు, సురేష్ , మరియు జీవన్ లు మాత్రం పొద్దున్నే వచ్చి ఈవెనింగ్ కి ఇంటికెళిపోతూ ఈ సీనియర్స్ రాగ్గింగ్ నుంచి కొంత తపించుకున్నారు
ఇంకా హాస్టల్ లో ఉండే వాళ్ళకి ప్రతీ రాత్రి కాళ రాత్రే. వాళ్ళ రూమ్ లకి పిలిపించుకుని, ఎన్నో లాజిక్ ప్రశ్నలతో, చిలిపి చేష్టలతో, జూనియర్ల భయం తో, సీనియర్ ల ఆనందం తో,హాస్టల్ వార్డెన్ మంగి రెడ్డి వార్నింగ్ లతో ఆ హాస్టల్ మారు మ్రోగి పోయేది.
చిన్న చిన్న గొడవలు, గోలలు, కేరింతలు…మామిడాడ టౌన్ లో మీటింగ్ లు, లేట్ గా వచ్చారని మంగిరెడ్డి వార్నింగ్ లు, సచిన్ టెండూల్కర్ birthday కి చాక్ లెట్స్ పంపిణీలు..
ఫ్రెషర్స్ పార్టీ లో నాయుడు బావ పాట తో ONS డప్పులు, మేజర్ ఇండస్ట్రీ టూర్ అని పెద్ద ప్లాన్ చేసిన తరువాత అది cancel అని అనడం తో చాలామంది లో దిగులు.
లోకల్ ఇండస్ట్రీ టూర్ లో బస్సు  ప్రయాణం, కాకినాడ లో మద్యానం భోజనం. యేవో చుట్టుపక్కల కంపెనీ లు చుట్టేసి, హమ్మయ్య ఇండస్ట్రీ టూర్ అయ్యిందనిపించడం.
ఫ్రెండ్స్ తో పుణ్య క్షేత్రాలు (అన్నవరం), విహార యాత్రలు (అరకు)…ఫ్రెండ్షిప్ రోజున మామిడాడ లో స్నేహితులతో సెలెబ్రేషన్స్, హోలీ రోజున పక్కనున్న కాలువలో సెలెబ్రేషన్స్.
************************************************************
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, మామిడాడ కాలేజీ నీడ లో,
వీడలేమంటూ  వీడుకోలంటు వెళ్ళిపోయాము ..ఎవరి బ్రతుకు వాళ్ళ దారిలో .
 We Had All The Fun  , We Had All The  Joy
హాగో పెట్టిన  watsup గ్రూప్ లో ఆందరూ కలిసాము.
పాత గుర్తులను మళ్ళి తీస్తూ , పండగ చేద్దాము,
We All  Meet  Again  …We All  Meet  Again
************************************************************
ఇది నా మది లో ఉండే మామిడాడ డేస్….కాలేజీ డేస్…….హ్యాపీ డేస్….
********
ప్రసాద్ ఓరుగంటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s