కూ…ఛుక్…ఛుక్

 

చిన్నప్పుడు చుట్టాలింటికి వెళ్లాలంటే పట్టాలెక్కే అవసరం ఉండేది కాదు.అంతా చుట్టూ పక్కల లేదా బస్సు దూరం లో ఉండడం తో చిన్నపట్నుంచి ట్రైన్ ని చూస్తే బాడీ లో ఆనందం తో కురిసే రైనే, మరీ ట్రాక్స్ ని చూస్తే ఒక రకమైన క్రాక్ అనుకోవచ్చు. అంటే రైలు కూత వినిపించడానికి మా ఊరు రైల్ స్టేషన్ కి కూత వేటు దూరం లో లేదు…కొన్ని వేల మీటర్స్ దూరం లో ఉంది కదా మరి..

ఎప్పుడైనా బస్సు లో దూర ప్రదేశాలు వెళ్తున్నప్పుడు, మెల్లగా బస్సు ఆగేది. మెల్లగా డ్రైవర్ బస్సు దిగి ఆ పక్కోడి తో మాట్లాడే వాడు. ఇదే సందనుకుని తినుబండారాలు అమ్మే వాళ్ళు తిన్న గా బస్సు ఎక్కేసి అమ్మేసే వారు. బస్సు లో ఉన్న వాళ్ళు అందరూ కిటికీ లో నుంచి తలలు బయట పెట్టి, అది ఎప్పుడొచ్చి ఎప్పుడెళ్తుందా అని. నేను మాత్రం దూరం గా వస్తూ ఉన్న ఆ సొగసరిని, దాంతో పాటు తీసుకొచ్చే ఆ కమ్మని కూతని , ఈ రెండూ ఉండాలంటే నేను ఉండాలి అంటూ కొంచం గట్టి గా చెప్పే పట్టా లని చూస్తూ .అయ్యో అప్పుడే వెళిపోయిందా అనుకుని, మల్లి ఇంకో గేటు పడితే బావుంటుంది అనుకోవడం.అలాగా డెస్టినేషన్ చేరుకునేటప్పటికీ రెండూ మూడు ట్రైన్ లతో ఆ ప్రయాణం అదిరేది.

కాలం కోరమాండల్ ఎక్ష్ప్రెస్స్ అంత వేగం తో పరిగెత్తింది.ఉద్యోగం కుడా ఊరు కి  కొన్ని వందల కిలో మీటర్ లో దూరం లో. ఇక ప్రయాణం నా కిష్టమైన ఆ రైల్ మీదే. విభిన్న లక్షణాలున్న వ్యక్తులతో ప్రయాణం.

అప్పుడే ఆగిన స్టేషన్ లో , ట్రైన్ ఎక్కి ఇది నా సీట్ అని లోయర్ బెర్త్ లో కూచున్న పెద్దాయనికి టికెట్ చూపిస్తూ గట్టి గా అరిచేవాడొకడు. దానికి దీటు గా నాది మిడిల్ సీట్, ఇంకా పడుకుని టైం అవలేదు కదా, అందుకే కింద కూర్చున్న, నీకేమైనా ఇబ్బందా అంటూ కొంచం గట్టిగానే సమాధానం ఇచ్చే ఆ కూర్చున్న వ్యక్తి. కొంచం వాగ్విదాలు, ఆ తరువాత ప్రశాంతత. తరువాత వాళ్లిద్దరూ కలిసి మెలిసి ఎన్నో కబుర్లు.

ఏమైనా తెచుకున్నావా రాత్రి తినడానికి అని, ఒక ఫామిలీ లో పెద్దాయన ఎదురుకుండా కూర్చున్న కుర్రాడితో తో పలకరింపు. లేదండి ఇక్కడే తీసుకుంటా అని ఆ కుర్రాడు రిప్లై. పర్లేదులే ఇదిగో ఇడ్లీ ఉంది, రెండు వేసుకుని తినేయి, మల్లి ఏమి కొనుకుంటావు లే అని పెద్దరికం తో ఇడ్లీ ల వడ్డన.ఈ విందారగించడం లో ఎన్నో కుశల ప్రశ్నలు.

ఏవండీ! మీది, లోయర్ బెర్తా !, మా నాన్న గారి కి పై బెర్త్ వచ్చింది, మీరు ఆ సీట్ తీసుకుని, లోయర్ బెర్త్ ఇస్తారా అంటూ, రైలు ఎక్కినప్పటి నుంచి లోయర్ బెర్త్ లో కూర్చున్న వాళ్ళందర్నీ అడిగే వాడు ఒకడు, అలాగేనని ఆ లోయర్ బెర్త్ ని ఆ పెద్దయానికి అప్పగించే ఎందరో త్యాగమూర్తులు.

మీది ఒక హడావిడే, మాది హడావిడి అంటూ, అటు ఇటు తిరుగుతూ.. వేడి వేడి ఇడ్లీ లు, బిసి బిసి బిర్యానానీలని, ఘరమ్ ఘరమ్ టీ అని అమ్మేవాళ్ళు ఒక వైపు….వీళ్ళందరూ ఎప్పడొస్తారా…తినేసి పడుకుందామని పై బెర్త్ లో కూర్చుని, ఎదురుచూస్తున్న ప్రయాణికుడొకడు ఇంకో వైపు.

ఇలాగ విభిన్న వ్యక్తిత్వాల మధ్య సాగే ఆ రైలు ప్రయాణం, ఎప్పటికీ మర్చి పోలేనిది.

అన్ని ప్రయాణాలందు రైలు ప్రయాణం బెస్టు అని ఎవరైనా అంటారు, అందులో అమెరికా కి వచ్చే ఆ విమాన యాన ప్రయాణికులు మరీ గట్టి గా బెర్త్ మీద చెయ్యి వేసి చెప్తారు,

అన్ని ప్రయాణములందు రైలు ప్రయాణం సుఖము.
బెర్త్ రిజర్వేషన్ ఉన్నచో ఆ రైలు ప్రయాణం మరీ సుఖము సుఖము

వేడి వేడి వడలుతో, బిసి బిసి బిర్యానీ లతో తిరుగుతూ, తిరుగుతూ ఎప్పటికప్పుడు కడుపుని ఖాళీ గా ఉంచని రైలు కష్ట జీవులు,
మంచి నిద్ర లో ఉన్నప్పుడు డిన్నర్ డిన్నర్ అంటూ మరీ లేపే విమాన సిబ్బంది., తినకపోతే మళ్ళి ఇవ్వరేమో అని తినేసే విమాన ప్రయాణికుల ఇబ్బంది.

ఎయిర్ బస్సు లో సీట్ల కంటే యెర్ర బస్సు లో ని సీట్ లు పడుకోవడానికి వీలయా ..
రైలు లో ని సుఖములు మరీ విమాన ప్రయాణములో ఎందుకు లేవయ్యా
విశ్వదాభిరామ….కొచం చూడవయ్యా మోడీ మామా ….

కోనసీమ కి కూడా కూ ఛుక్ ఛుక్ వచ్చేతోంది అంట. ఎప్పుడు అక్కడ పట్టాలు చూడాలో…చుట్టాలింటికి పట్టాలమీద వెళ్లే రోజులు వచ్చేతున్నాయహో…..

ఇంతకీ ఈ కథ రాస్తున్నది కూడా, నేను రోజు ప్రయాణించే కాల్ ట్రైన్ లో నుంచి…సరే నా ఆఫీస్ వచ్చింది మళ్ళీ కలుద్దాం ఇంకో కథ లో….

– ప్రసాద్ ఓరుగంటి

One thought on “కూ…ఛుక్…ఛుక్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s