పెద్ద పెరడు…….

ఆరోజు 1950 May 16 , ఒక చిన్న గ్రామం.అప్పటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి మూడేళ్లు అవుతోంది..
ఆరాత్రి ఒక అమ్మ 8 సంవత్సరాల బాబు సోమేశం కి అన్నం పెడుతోంది, పెడుతూ ..”ఓరే ఎప్పడు ఆ వీధి లో కెళ్ళినా ఆ పెద్ద పెరడు వైపు కి వెళ్ళకండి.ఎప్పుడూ అటువైపు చూడకండి”…అంటూ అన్నం పెట్టేసి వాడిని పడుకోమంది.

ఆ కుర్రాడు పడుకుంటూ ఉంటె, అమ్మ చెప్పినవి గుర్తుకొస్తున్నాయి. అమ్మ ఎందుకిలా చెప్పింది..అసలు పెద్ద పెరట్లో ఏముంది అనుకుంటూ ఆలోచిస్తూ నిద్ర లో కి జారుకున్నాడు.

అర్ధ రాత్రి అయ్యింది. ఎక్కడో కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా ఈ కుర్రాడు నిద్ర లో నుంచి లేచి “అమ్మా అమ్మా” అంటూ ఏడవటం మొదలెట్టాడు.ఆ పక్కనే పడుకున్న కుర్రాడి నాన్న కూడా లేచి “ఎందుకురా ఏడుస్తున్నావు..ఏదైనా పీడా కల వచ్చిందా”…అంటూ వాడిని సముదాయించి పడుకోపెట్టాడు.

***

ఉదయం అయ్యింది. “ఇదిగో నేను పొలం వెళ్తున్నాను” అంటూ తన భార్య కి చెప్పాడు. ఈ కుర్రాడు పరిగెత్తుకుంటూ తన స్నేహితుడు రంగా దగ్గెర కి వెళ్ళాడు.ఆ పాటికే ఇంకో ఇద్దరు స్నేహితులు రంగా ఇంట్లో ఉన్నారు..సోమేశం మొదలెట్టాడు వాడికొచ్చిన పీడ కల గురుంచి. మిగతా పిల్లలందరూ భయం భయం గా వింటున్నారు. దాంట్లో ఒకడు “అవును రా మా నాన్న కూడా చెప్పాడు. మనం పెద్ద పెరడు వైపు కి వెళ్ళ కూడదు అంట. అక్కడ యేవో యేవో ఉన్నాయంట…మనం అసలు అటువైపు వెళ్ళద్దు” అని అన్నాడు.
ఇంకో స్నేహితుడు, “అవును మా తాత కూడా చెప్పాడు..అటువైపు వెళ్లోద్దని…వెళ్లినా గట్టి గట్టి గా అరుచుకుంటూ వెళ్లాలని”…ఈ లోపులో రంగా వాళ్ళ నాన్న ఒక్క అరుపు అరచి, “ఓరే బయటి కెళ్ళి ఆడుకోండి, ఈ కబుర్లు చెప్పకుండా” అని కసిరాడు.

వాళ్ళు అలాగే అని ముట్టుకుంటే ఆట ఆడుతూ పరుగులు తీస్తున్నారు.ఆ వీధి లో నుంచి పరిగెడుతున్నారు.ఆ వీధి చివరి ఎడమ మలుపులో పెద్ద పెరడు ఉంది. ముందు రంగా పరిగెడుతున్నాడు. వెనుక సోమేశం, మిగతా ఇద్దరి స్నేహితులు పరిగెడుతున్నారు. వాళ్ళు ఆ వీధి చివరి మలుపుఉన్న పెద్ద పెరడు వైపు చూడకుండా..బిగ్గర గా అరుస్తూ …పరిగెడుతున్నారు…..వీళ్ళ కన్నా బిగ్గర గా అరచిన శబ్దం వీళ్ళకి వినపడింది.. వీళ్ళు అటువైపు చూడకుండా, వెనక్కి చూడకుండా పరిగెట్టేసారు .

ఆ నలుగురు కుర్రాళ్ళు తెగ ఆయాస పడుతున్నారు. భయం తో వణికి పోతున్నారు..ఇంతకీ ఆ శబ్ధం ఎక్కడ నుంచి వచ్చిందా అని…ఆ అరుపు ఇంకా దగ్గెర అవడం తో బెంబేలెత్తుతున్నారు.ఆ అరుపు ఇంకా దగ్గెర అయ్యి. “ఏరా కుర్ర వెధవల్లారా…ఎందుకు రా పెద్ద పెరడు నుంచి వస్తూ ఆడుకుంటున్నారు..ఇటువైపు రాకండి” ..అంటూ ఒక పెద్దావిడ దగ్గెర కొచ్చి ,వీళ్ళని తిట్టి, “ఉండు మీ ఆమ్మ నాన్న లకి చెప్తా” అంటూ మెల్ల మెల్లగా ,కుంటూ కుంటూ…వాళ్ళ పెద్దలని కలవడానికి అరుస్తూ వెళ్తోంది.

****

అప్పుడే చీకటి పడుతోంది.సోమేశం నాన్న పొలం నుండి వచ్చేశాడు, సోమేశం ఆమ్మ పెరట్లో ఏదో పని చేసుకుంటోంది. సోమేశం పొద్దున్న విషయాన్నీ నాన్న కి చెప్దామా అని అనుకుంటున్నాడు. ఈలోపులో ఆమ్మ కూడా లోపలకి వచ్చింది.సోమేశం ఇంక ఆగలేక పొద్దున్నదంతా చెప్పేసాడు కొంచం ఏడుపు స్వరం తో. వీళ్ళ పరుగులనుంచి ఆ ముసలావిడ అరుపుల దాకా.”అమ్మా అమ్మా ఆ ముసలావిడ అరుస్తూ ..మీకు వచ్చి చెప్తానందే”..అంటూ గట్టి గా ఏడవటం మొదలేశాడు.కుర్రాడిని ని సముదాయించి, వీడికి అన్నం పెట్టేసి, హనుమాన్ చాలీసా చదివి పడుకో పెట్టె” అని చెప్పాడు భార్య తో.

అందరూ భోజనాలు చేసేసి పడుకున్నారు. బయట కుక్క ల అరుపులు. మళ్లీ అకస్మాత్తుగా సోమేశం నిద్ర లో లేచి “ముసలమ్మా ముసలమ్మా” అంటూ ఏడవటం మొదలెట్టాడు. నాన్న లేచి వాడిని సముదాయించి “ఏమి ముసలమ్మా రా..నీ గోల” అంటూ కొంత విసుక్కుని, భార్యని గట్టి గా తిట్టి “వీడ్ని అసలు అటువైపు పంపకు..బాగా దడుసుకున్నాడు” అని అరచి పడుకున్నాడు…అప్పడు భార్య మెల్ల గా భర్త తో చెప్పింది. “నేనే నండి వాడిని అసలు పెద్ద పెరడు వైపుకి వెళ్ళద్దు” అని అన్నాను నిన్న రాత్రి. “అప్పటినుండి వీడికి భయం వేస్తోంది” అని. “ఇంతకీ వీడు ముసలమ్మా అన్నాడు..ఎవరు రాలేదు” నాకు చెప్పడానికి అని మెల్ల గా అంది. “సరేలే వీళ్ళందరూ బాగా భయ పడి అలాగా ఊహించుకున్నారు” అని భర్త, భార్య తో చెప్పి పడుకున్నాడు.

****

మరుసటి ఉదయం సోమేశం నాన్న, రంగా వాళ్ళ నాన్న ని కలిసి “పిల్లలు అటువైపు వెళ్లి ఆడుకుంటున్నారు, మళ్లీ రాత్రి భయ పడుతున్నారు. నిన్న రాత్రు మా సోమేశం గాడు నిద్ర లో భయ పడుతూఉన్నాడు” అని చెప్తుంటే, “అవును మా రంగా కూడా ముసలమ్మా ముసలమ్మా” అంటూ ఏడుస్తూ లేచాడు” అని అన్నాడు. “సరే లే ఇంక వీళ్ళను అటువైపు వెళ్ళ కుండా చూద్దాం” అనుకుంటూ ఎవరి పనులకి వాళ్ళు వెళ్లారు.
మరుసటి రోజు ,పక్క ఊరునుంచి సోమేశమ్ మావయ్య కొడుకు బాబీ గాడు వాళ్ళ నాన్న తో వచ్చాడు. బాబీ గాడు వయసు సోమేశం కన్నా రెండేళ్లు ఎక్కువ.ఈ విషయాలన్నీ బాబీ గాడి తో చెప్పాడు. బాబీ గాడి కి కొంచం ధైర్యం ఎక్కువ అలాగే ఇలాంటివంటే మహా సరదా. ఆ రోజు బాబీ గాడు వీళ్ళ స్నేహితులందర్నీ కలిసి..”ఓరే మనం సరదాగా పెద్ద పెరట్లో కి వెళ్లి చూసొద్దాం” అంటూ ఉండగానే మిగతా వాళ్ళు “అబ్బో మేము రాం రాం” అంటూ జరిగిన కథ అంతా చెప్పారు.బాబీ గాడు ఇవన్ని వినకుండా “నా తో ఎవరైనా వస్తే వాడికి నేను పీచు మిఠాయి ఇప్పిస్తా అంటూ చెప్పడం తో మిగతా వాళ్ళు కూడా సరే సరే అంటూ లోపల చాలా భయం ఉన్నా అది పగలు కావడం తో కొంచం గంభీరం గా వస్తాం అని అన్నారు..

వీళ్ళ తండ్రులంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ పిల్లలంతా కలిసి ఏదో ఆట ఆడుకుంటూ ఆ వీధి ఎడమ చివరి మలుపులో లో నున్న పెద్ద పెరడు వైపు కొచ్చారు…మిగతా నలుగురు పిల్ల లో భయం ప్రస్ఫుటం గా కనిపిస్తోంది. ఈ లోపులో రంగా గాడు “మా నాన్న చెప్పాడు ఇక్కడికొస్తే మనం గట్టి గా అరవాలి” అని.అలాగే అని గట్టి గా అరుస్తూ ఆ పెద్ద పెరడు వైపు కి కొంచం భయం భయం గా చూస్తున్నారు.ఈ లోపులో బాబీ గాడు “ఓరే కొంచం లోపలకెళ్దాం” అన్నాడు.మెల్ల మెల్లగా నడచుకుంటూ భయం భయం గా అరుస్తూ,ఇటూ అటూ చూసుకుని వెళ్తున్నారు.ఈ లోపులో రంగా స్నేహితుడు గట్టి గా బాబోయ్ అని అరిచాడు…వాడు దూరం గా ఏదో చూసాడు…వీళ్లంతా అటువైపు చూసి “బాబోయ్ బాబోయ్”అని అరుస్తున్నారు.

****

“చీకటి పడుతోంది, పిల్లలేరి పిల్లలేరి” అని పెద్దలంతా భయం తో వెతుకుతూ , ఈ బాబీ గాడు వీళ్ళందర్నీ తీసికెళ్ళి ఉంటాడు అని చాలా మంది పెద్దలు , లాంతర్ లతో, పెద్ద పెద్ద కర్ర లతో పెద్ద పెరడు వైపుకి బయలు దేరారు. అందరూ మెల్ల మెల్ల గా, కొంచం భయం తో ముందరకి వెళ్తూ వీళ్ళని పేరు పేరునా పిలుస్తూ, వెళ్తున్నారు.

*****

ఇంటివద్ద ఆడవాళ్ళూ కూడా అదే భయం తో ఉన్నారు. పిల్లలు కి ఏమైంది అని. ఎవరో పెద్దావిడ మెల్ల మెల్ల గా కుంటూ కుంటూ , ఇంట్లోకి రావడం చూస్తోంది సోమేశం వాళ్ళ ఆమ్మ…

*****

అక్కడ మగాళ్లు అంతా పిల్లలని వెదుకుతున్నారు, అరుస్తూ. చూసేటప్పటికి రంగా కింద పడీ ఉన్నాడు.ఇద్దరు మనుషులు వాడిని లేపారు.కొంచం దూరం లో బాబీ గాడు, మిగతా స్నేహితులు పడీ ఉన్నారు.వాళ్ళని కూడా లేపి “అసలు ఏమైంది రా ..సోమేశం గాడు ఎడి” అంటూ ఏడుస్తూ గట్టి గా అరిచాడు సోమేశం నాన్న .

*****

సోమేశం వాళ్ళ ఆమ్మ బిక్క చచ్చి పోయింది, ఈవిణ్ణి ఎప్పుడో ఊళ్ళో చూడలేదు, “ఈ టైం లో ఎవరు ఈవిడ” అంటూ భయం తో గట్టి గా అరుస్తోంది. ఆ అరుపుకి పక్కనే నున్న రంగా వాళ్ళ ఆమ్మ కూడా పరిగెత్తుకుని వచ్చి “ఏమైందీ వదినా” అంటూ అరిచింది.”చూడు దూరం గా అని వేలు ఎత్తి చూపిస్తోంది. “ఎవరు లేరే ఇక్కడ, మన పిల్లలు వచ్చేస్తారు” అంటూ సముదాయిస్తోంది రంగా వాళ్ళ ఆమ్మ సోమేశం అమ్మని.

****

మొత్తానికి సోమేశం కూడా ఆ చివరన పడీ ఉన్నాడు, వాడిని లేపి, అందర్నీ మెల్ల గా ఇంటికి తీసికొచ్చారు.పెద్ద ఎత్తున పూజలు చేసారు.పిల్లలని మందలించారు.బాబీ గాడిని బాదేసారు…

****

సోమేశం ఆమ్మ ఇంకా ఆలోచిస్తోంది…ఎవరు ఆ ముసలమ్మా ని …”ఎవరై ఉంటుంది” అని. భర్త తో చెప్తే ,భర్త అన్నాడు “భయం వేసి అలాగా,ఊహించుకున్నావు” అని
_______________________________________________________________________
ప్రస్తుతం….

ఓరే పిల్లలు …ఆ పెద్ద పెరడు వైపు వెళ్ళకండి…మీకసలే ఆత్రుత ఎక్కువ….అని ముని మనవలతో చెప్తోంది….సోమేశం వాళ్ళ ఆమ్మ.

“ఏముంది అక్కడ గ్రేట్ గ్రాండ్మా ” అని అడిగాడు లండన్ నుండి వచ్చిన సోమేశం 8 ఏళ్ళ మనవడు చింటూ.

“నాన్న .. నాన్న . వెళ్దాం వెళ్దాం పెద్ద పెరడుకి ” అంటే, సరేలే, ఆ వీధి నుంచి పెద్ద పెరడు ని చూపిద్దామె లే అనుకుంటూ తీసికెళ్ళాడు చింటూ ని వాళ్ళ నాన్న.ఆ వీధి కెళ్ళి ఆ పెద్ద పెరడు వైపు చూస్తూ , “నాన్న.. నాన్న ..చూడు దూరం గా” అంటున్నాడు ,చింటూ వాళ్ళ నాన్న తో “ఏముందిరా…అక్కడ ..ఏమి లేదు…నడు..వెళ్దాం” అంటూ చింటూ ని ఇంటికి తీసికెళ్ళాడు. …..
దూరం గా నవ్వుతూ ముసలావిడ, ఆ చింటూకి మాత్రం కనిపించింది

ఇంటికొచ్చి, గ్రేట్ …గ్రాండ్మా గ్రేట్ …గ్రాండ్మా..నేను పెద్ద పెరడు వైపు వెళ్ళాను అని నవ్వుతూ అన్నాడు. “ఎందుకు తీసికెళ్లావురా వీడ్ని” అని ఏడుపుతో గట్టి గా అరిచింది పెద్దావిడ.ఈ లోపులో ఈ ముని మనవడు నవ్వుతూ “గ్రేట్ …గ్రాండ్మా గ్రేట్ …గ్రాండ్మా..అక్కడ ఒకటి చూసాను..చూసాను.అక్కడ దూరం గా నిన్ను చూసాను” అని వెళ్తూ వెళ్తూ ..నవ్వుకుంటూ చెప్తూ వాడి ఆటలలో మునిగిపోయాడు.

అది విని గ్రేట్ గ్రాండ్మా …భయం తో గాల్లో కి చూసింది…

అప్పటింకింకా పగలే…..ఆ రాత్రి ఏమవుతుందో.
——————————————————————————————————-

Note: కథ, కథ లోని లో పాత్రలు, పాత్రధారులు కల్పితం. ఎవర్నీ ఉద్దేశించినది కాదు.

concept and story written by
ప్రసాద్ ఓరుగంటి

2 thoughts on “పెద్ద పెరడు…….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s