కళాభిమానం…

ముత్యాల ముగ్గు లో రావు గోపాలరావు చెప్పినట్టు “మడిసన్నాక కూసంత కళాపోషణ ఉండాలా” లేకపోతె మిగతాది … నేను చెప్పను ఇక్కడ.
చాలా మంది కళాభిమానులని కలవర పెట్టే అంశం ఏంటంటే, అయ్యో పూర్వ కళ లన్ని అంతరించి పోతున్నాయి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అనుకుంటూ వా పోవడం ..

ఎందుకు ఈ కళ మీద నా కన్ను పడి అది పెన్ను గా మారింది అని మీరు అడిగితె, అవును ఏడాది కిందట మా అన్నయ్య కొడుకు సుహాస్ ఉపనయనం ఆనాతరం లో అంటే అమెరికా నుంచి అందరం బయలుదేరాం. ఈ కార్యక్రమానికి కి చుట్టాలు, పక్కాలు, అందరూ వస్తారు కాబట్టి ఏదైనా ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం కానీ, లేదా ఏ సినిమా పాటలు పాడే వాళ్ళను పిలిస్తే బావుంటుంది , వచ్చినవాళ్లు చూసి ఆనందిస్తారు అని మేము ముగ్గురు అనుకుని ఈ విషయాన్నీ ఊరులో ఉన్న నాన్న గారు కి చెవిలో ఊదాం.

మీ ఐడియా బానే ఉంది, కానీ, ఈ సినిమా పాటలు అవి ఇవి వద్దు .నాకు తెలిసిన ఒక మాస్టారు ఉన్నారు, అతనికి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. నేను అతనితో మాట్లాడి మంచి కార్యక్రమం చేయిద్దాం, అది అందరికి నచ్చుతుంది అలాగే మంచి సరదాగా ఉంటుంది అని అనడం తో అలాగే నాన్నారు అని ఊ కొట్టాం.

ఆ రోజు రానే వచ్చింది. ఇంట్లో కోలాహలం బంధువులతో, స్నేహితులతో..ఊళ్ళో జనాలతో. అందరూ ఆ సాయంత్రం చక్క గా భోజనాలు చేసి ,కొందరు వేసిన కుర్చీల మీద, మరికొందరు అరుగుల మీద ఆలా ఆలా సర్దుకుని కూర్చున్నారు.

ఎదురుగా పెద్ద స్టేజి . ఆ స్టేజి మీద ముగ్గురు వ్యక్తులు ఒకవిధమైన డ్రెస్ వేసుకుని ఉన్నారు. ఒకతని చేతి లో తంబూరా ఉంది. కాళ్ళ కి గజ్జెలు ఉన్నాయ్. మిగతా ఇద్దరి చేతిలో చిన్న డోలు లాంటిది ఉంది. ఆ ముగ్గురు లో మధ్యనున్న అతను కథ ను కళ్ళ కి కట్టినట్టు చెబుతున్నాడు., ఇంకో అతను చక్క గా హాస్యాన్ని కురిపిస్తున్నాడు, ఇంకో అతను మధ్యనున్న వ్యక్తి కి సరదాగా అడ్డు చెప్తూ కథ కి సరిపోయే ఇప్పటి విషయాలని చెప్తున్నాడు.

కథ రసవత్తం గా జరుగుతోంది, మైకులో వస్తున్న ఈ కథ వింటున్న అవతలి వీధి వాళ్ళు కూడా వచ్చి, అప్పుడే ఏమి పడుకుంటాములే, ఎప్పుడో చాలా కాలం అయ్యింది ఇది విని అంటూ, ఒక పరుగు లాంటి నడకతో ఈవీధి కి వచ్చి ఆ కార్య క్రమాన్ని ఆత్రుతతతో తిలకిస్తున్నారు

వచ్చిన వాళ్లందరికీ మంచి నీళ్లు ఇవ్వడం లో నేను , నాతొ పాటు మరికొందరూ….

ఇంతకీ స్టేజి పైన జరిగేది ఒక గొప్ప బుర్ర కథ.ఆ రాత్రి మహా భారతం లో ని “విరాట పర్వం” ని ఈ ముగ్గురు చక్కగా ఈ బుర్ర కథ రూపం లో వినిపించారు. ఒక గంట అనుకుని మొదలెట్టిన ఈ బుర్ర కథ ని రెండున్నర గంటలు అయిన తర్వాత కూడా చూసే పిల్లలలో, పెద్దలలో అదే ఉత్సాహం, అప్పుడే అయ్యిందా ఇంకా ఉంటె బావుంటదమో అని అనుకునేంత గా వాళ్ళ వర్ణన వర్ణనాతీతం .

చాలా మంది పెద్దలు అన్నట్టు గురుతు …చాలా మంచి పని చేసారు, ఎప్పుడో విన్న, చూసిన బుర్రకథ ని మళ్ళి తీసుకొచ్చారు అని…

వాళ్ళ వృత్తిలో ఎంతో బిజీ గా ఉంటున్నా, మేము ముగ్గురు బుర్రకథ వేస్తాం, వచ్చి మిమ్మల్ని అందరిని ఆనంద పరుస్తాం అని చెప్పడం తో నే అర్ధమయ్యింది.

ఇంకా పూర్వ కళ లని అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ , ఎంతో మంది కళాభిమానులకి నేత్ర, శ్రవణ విందులందిస్తున్న ఆ త్రిమూర్తులకు నమస్సుమాంజలి .

ఆ తరువాత మేము కొంతమంది ఉత్తర అమెరికా తెలుగు సంఘాలు వ్యక్తలతో మాట్లాడి నప్పుడు, వాళ్ళు కూడా ఇష్టత వ్యక్తం చేసారు, అక్కడ అనాతరం గ్రామ వీధుల్లో మోగిన బుర్రకథ తంబురా, ఎప్పటికైనా అమెరికా పుర వీధుల్లో కూడా ఆ తంబురా మోత మోగుతుందని ఆశిస్తూ….

ఇలాంటి పూర్వ కళలను అభిమానించే ప్రతీ మనిషి కి కోటి దండాలు.
—ప్రసాద్ ఓరుగంటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s