మా ఊరు సంత…..

ఓ రోజు ,అమెరికా లో మా ఇంటి పక్కనుకున్న ఫార్మర్స్ మార్కెట్ కెళ్ళి యేవో పండ్లు తీసుకు రమ్మంటే, ఒక సంచి పుచ్చుకుని బయలు దేరాను. ఈ సంత లో దొరకనవి అంటూ ఉండక పోవడం తో కాయ గూరలనుంచి, వివిధ రకాల పండ్లు  , అలాగే తోటకూర, గొంగూర కూడా తేవడం, తెచ్చి కట్టలు కట్టలుగా అమ్మేయడం వాళ్ళ ప్రత్యేకత. అలాగే ఈ ఆకు కూరలను ఎలా వండాలో కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు..చెప్పే వాళ్లకు అడిగే వాళ్ళు లోకువైనట్టు.

ఒక పక్క కూరలు రాసులు పోసి అమ్మేస్తుంటే, మన వాళ్ళు మంచి తాజా చిన్న వంకాయలను ఏరేసుకుంటూ , ఆ పక్కనున్న బెండకాయలను ఆ చివర తెంపి, ఆ తెంపిన ముక్క ను ఇంకో పక్క పడేసి హమ్మయ్య నేను ముదర బెండకాయలను ఏర లేదు అని మంచి ఉత్సాహం తో సంత చేసి ఇంకో దగ్గెర కెళ్తుంటారు.

ఒక పక్క చైనా వాళ్ళు , ఒక సైలెంట్ మ్యూజిక్ పెట్టి యేవో యేవో ఎక్సరసైజెస్ చేసేస్తుంటారు.  కుక్క లని తీసుకుని వచ్చి షికారు చేసే తెల్లోళ్ళు కొంత మంది..

ఇంకోడు  గిటార్ వాయిస్తూ , ఏదో మనకి తెలియని రాగం లో పాట పాడేస్తుంటాడు, ఆ పాటకి మై మరచి ఆ పాడుతున్న పాటరి కి ఒక సెంటో, ఒక డాలరో వేసే వాళ్ళు కొంత మంది.

ఇంకో పక్క ,పండ్ల దుకాణం వాడు కొన్ని సాంపిల్స్  స్ట్రాబెర్రీ ముక్కలో, ఆపిల్ ముక్కలో, వైట్ పీచ్ అనో , ప్లం నో  బయట పెట్టి, సూపర్ స్వీట్ సూపర్ స్వీట్ అంటూ ఉంటాడు, కొంత మంది ఆ ముక్కలని నోట్లో పడేసుకుని, సంత చేస్తూ ఉంటారు.

ఇలాగ ఆ రోజు నేను సంచి నిండా కాయగూరలు, పళ్ళు నింపుకుని శాంపిల్ వాడి ఇచ్చిన ఆ పండ్లను బుగ్గ నిండా పెట్టుకుని ఇంటికి వస్తుంటే…..ఇక్కడ సంత.. నన్ను ఎక్కడికో ..ఏదో ఊరు సంత కి తీసికెళ్ళింది…

____________________________________________________________________________________________

నాకు అర్ధ రూపాయి కావాలి. ..

ఎందుకురా ..! ?

ఈ రోజు మంగళారం …

.అయితే..?

ఇవ్వాళా సంత కదా…

అవును రోయ్..ఈ రోజు కూరలు తెచ్చుకోవాలి. సంత కెళ్ళి…

ఆ అర్ధ రూపాయి ఇచ్చుకుని , ఒకింత గర్వం తో ,కోట వాడి కొట్లో వేరు సెనగపప్పు అచ్చు కొనుక్కుని, తర్వాత ,కొంత శాంపిల్ పకోడీ అడిగి తీసుకుని వస్తూ వస్తూ , ఆ సంత లో గుడి పక్కనే పెట్టిని శరభయ్య బెల్లం కొట్లో ఆగి, అక్కడ గుప్తా గాడో లేదా నానాజీ గాడో ఉంటె, వాళ్ళ తో మాట్లాడి, మళ్ళి వాళ్ళు ఇచ్చే శాంపిల్ బెల్లాన్ని కూడా తీసుకుని, బుగ్గ నిండా అవన్నీ పెట్టుకుని ..ఇంకా విజయ గర్వం తో ఇంటికి రావడం.

ఆ సంత లో గుడి దగ్గెర నుంచి కొంత లోపల వరకు కూర గాయాలు, పళ్ళు ,జీడీ , పోకుండ లు, బెల్లపు అచ్చులు అమ్ముతుంటే, కొంచం అటుపక్క న మాంసాహారం అమ్మేయటం . వర్షా కాలం లో జామకాయలు, సీతా కాలం లో తేగలు, వేసవి కాలం లో మామిడి పండ్లు  అని, అప్పుడప్పుడు పచ్చని పనస తొనలని చక్క గా బయట పెట్టి చుట్టూరా ఈగలతో  ఆ తొనలకి భద్రత గా ఉంచటం.

ఇంక ఏ ముత్యాలమ్మో , మరిడమ్మో తీర్థం అయితే, ఇంకా హడావిడి సంత అంతా…ఒక పక్క రంగుల రాట్నం మీద పిల్లలు తిరిగేస్తుంటే, ఇంకో పక్క న ఆ తిరగడం ఎక్కువైపోయి ,లోపల తిప్పేస్తోంది అంటూ..పక్క కెళ్ళేవాళ్ళు కొంత మంది. కోళ్ల అరుపులు, కుక్కల బిత్తర చూపులు ఏ ముక్కైనా దొరుకుతుందేమో అని.

చిన్న పిల్లల రోదనలు  జీడీ నోట్లోనుంచి పడి పోయిందని.పెద్ద వాళ్ళ  కేకలు, బేరం అడిగితె కొట్టోడు చాల్లే ,ఎల్లెల్లు అని అన్నాడని. ఒక  పక్క గుళ్లో ఆసాదు లు , మరో పక్క  మెళ్ళో బాటిల్స్ తో  తాగుబోతు ల హడావిడి. ఇదంతా ఒక వింతైన సంత గోల…

ఇంతకీ ఈ సంత గోల అంతా, మన ఊరి అనాతరం సంతేనండి..ఆయ్..అవునండి.

____________________________________________________________________________________________

ఒకో రోజు.. ఒకో సంత ….అనాతరం లో మంగళారం, అంబాజీ పేట లో బుధారం…ఇంకో ఊరులో ఇంకో వారం…

ఇప్పటికి  …అప్పటికి….. ఏ సంత లో మార్పు రానివి  ..రెండు…..

  • ఒకటి “ఇచట క్రెడిట్ కార్డ్స్ తీసుకొనబడవు. “No Credit Cards Accepted , Only  Cash “
  • రెండోది …”గోల” 

అది అమెరికాలో నైనా…..ఎక్కడైనా…….

____________________________________________________________________________________________

 ఆదివారం వచ్చేస్తోంది …..మా సంత కెళ్ళాలి…మళ్ళి కలుద్దాం….

____________________________________________________________________________________________

ప్రసాద్ ఓరుగంటి  

4 thoughts on “మా ఊరు సంత…..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s