వాళ్లిద్దరూ….

అక్కడేదో అలికిడి..కాళ్ళ శబ్ధం…తలుపు శబ్ధం…భయం గుప్పిట్లో ఇద్దరు ….ఎవరు వాళ్లిద్దరూ
=======================================================================
అర్ధ రాత్రి అవుతోంది…అప్పుడే ఇద్దరు యువకులు ఎక్కడినుంచో వచ్చి ,కారు పార్క్ చేసుకుని…ఒక ఇంటి ముందర ఆగి, తాళం తీసుకుని, ఇంట్లో ప్రవేశించారు.

ఇంటి బయట అంతా ప్రశాంతం గా ఉంది, ఆ రోజు పౌర్ణమి వలన ఏమో బయట అంతా పట్ట పగలు లాగా అక్కడున్న చెట్లు , పుట్టలు ప్రస్ఫుటం గా కనిపిస్తున్నాయి.

వీళ్లిద్దరు ఇంట్లోకి వెళ్లిన తరువాత , ఒకడు ఫ్రిజ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఓపెన్ చేసి తాగుతూ, హమ్మయ్య మొత్తానికి ఇంటికి వచ్చేసాము రా అని అవతల వాడితో అంటున్నాడు…అవతలివాడు వాడి బుజానున్న బాగ్ ని కింద పెడుతూ అవును రా, నాక్కూడా వాటర్ ఇయ్యి , డ్రైవ్ చేసి బాగా అలసిపోయా అని అన్నాడు….

వీళ్లిద్దరు వాటర్ తాగేసి, ఫ్రిజ్ లో ఉన్న ఆపిల్ పండు ని కోసి తింటూ…TV ఆన్ చేసుకున్నారు..టీవీ లో ఏదో క్రైమ్ న్యూస్ వస్తోంది…అది కొంత సేపు చూసి..తరువాత ఇంకొక ఛానల్ తిప్పు కుంటూ, ఏదో భక్తి టీవీ లో భజనలు వస్తుంటే…ఒరేయి ఆపరా ..ఈ ఛానల్ ఉంచు..మనం కూడా కొంచం భక్తి లో మునుగుదాం అంటూ
వీళ్లిద్దరు కూడా ఆ TV లో వచ్చే భజన పాటకి వంతు పాడటం మొదలెట్టేశారు.

=======================================================================

ఇంతలో ధడేల్ ..ధడేల్ అంటూ తలుపు శబ్ధం, వీరికి వినపడలేదు…మళ్ళీ అదే శబ్ధం ఇంకొంచం గట్టి గా..
వీరి లో ఒకడికినిపించి , ఎవరో తలుపు కొడుతున్నట్టుంది, ఈ రాత్రి లో ఎవడురా బాబూ అనుకుంటూ..మెట్లు మెల్ల గా దిగుతూ కిటికీ లో నుంచి చూసాడు ఎవరైనా ఉన్నారేమో అని….వీడికి ఎవరు కనపడలేదు…కానీ…ఎక్కడో ,కుక్క లో ,నక్కలోఆరుస్తున్నాయి…వీడి కి కొంచం భయం వేసి..మళ్ళీ పైకి వచ్చి టీవీ చూస్తున్నాడు.

మళ్ళీ అదే తలుపు శబ్దం, దభా దభా అంటూ……ఈసారి ఇంకోడు పైనుండి తాగుతున్న గ్లాస్ ని టేబుల్ మీద పెట్టి బయట లైట్ వేసి, విండో నుంచి చూడటం మొదలెట్టాడు…వీడికీ ఏమి కనపడలేదు….కాని చిన్న అనుమానం ..ఎవరో బయట ఉండి ఇలాగ చేస్తున్నారు అని అనుకుని వీడికి కూడా కొంచం భయం వేసింది..

వీడు కూడా పైకొచ్చి…సరేలే బయట ఎవరు లేరు కదా ని ఈసారి టీవీ ఛానల్ మార్చి ఇంకోటి చూద్దాం లే అనుకుంటూ ఉండగా , ఏదో హారర్ మూవీ కనిపించింది..ఒకడికి భయం వేసి ఈ ఛానల్ ఎందుకురా బాబు ఈ టైం లో అంటే, లేదురా ఈ టైం కి ఈ సిట్యుయేషన్ లో ఇలాంటి దే చూస్తే నే థ్రిల్లింగ్ గా ఉంటుందని అంటే, ఇద్దరు ఆ హారర్ సినిమా ని చూస్తూ ఉన్నప్పుడు….

=======================================================================

మళ్ళీ మళ్ళీ అదే శబ్ధం ధడేల్ ధడేల్ అంటూ, ఈసారి గట్టి గా..ఆ తలుపులు ఊడి పడుతున్నట్టు గా శబ్ధం.
అసలే హారర్ మూవీ లో ఒక భయంకరమైన ఘటన జరుగుతోంది…ఇక్కడ తలుపుల శబ్ధం..ధడేల్ ధడేల్ అంటూ …

వీళ్లద్దరికి చాలా భయం వేసి, ఈసారి మనం ఇద్దరూ కలిసి చూద్దాం అంటూ ..మెల్ల మెల్ల గా..ఒకొక మెట్టు దిగుతూ, భయం గా ఒకరి మొహాలు ఒకరి చూసుకుంటూ..ఆ కిటికీ లో నుంచి చూసారు…ఈసారి వాళ్ళ కి దూరం గా కాళ్ళ శబ్ధం ఎవరో పరిగెడుతున్నట్టు వినిపించింది…వీళ్ళకి ఇంకా భయం ఎక్కువై , స్పీడ్ గా మెట్లు ఎక్కుకుంటూ, ఆయాస పడుతూ…ఎవరో ఇక్కడికి వస్తున్నారు..మనల్ని ఏమి చేస్తారో అని ఒకలికోకలు భయం గా దీనం గా చూసుకుంటూ ఉండగా….ఈసారి ఒక గావు కేక వినపడటం తో వీళ్ళు ఇద్దరు కూడా అంటే స్వరం తో భయం తో గావు కేక పెట్టారు..

ఇంతకీ ఆ విన్న గావు కేక టీవీ లో నుంచి వచ్చిందని తెలుసుకుని, అందుకే చెప్పా ను ఈ టైం లో హారర్ మూవీ పెట్టద్దని, నువ్వు వినలేదు, నేను చెప్పింది అంటూ ఒకడు ఇంకోడి తో గద్గద స్వరం తో భయం తో చెప్తున్నాడు…వాడు కూడా అవును రా అని అదే స్వరం తో అంటున్నాడు…..
=======================================================================
బయట నుంచి తలుపుల శబ్దాలు, ఈ సారి నాలుగు మూలల నుంచి వస్తోంది శబ్దాలు, ఇల్లంతా శబ్దాలు..
కుక్కల గోల…వీళ్ళకి ఎక్కడ కెళ్ళినా ఆ శబ్దాలు భయంకరం గా మారి వీళ్ళ కి ఏమి చేయాలో తెలియని సమయం లో……

తలుపులు దభాలు మని తెరుచుకున్నాయి …ఆ అడుగుల చప్పుడు దగ్గెర కొస్తోంది…వీళ్ళకి చెమటలు పడుతున్నాయి…ఒక సోఫా మూల కూర్చుని భయం భయం గా చూస్తున్నారు……ఏమి జరుగుతుంది అని……..

ఏమి జరుగుతోంది …అక్కడ…

ఇంతకీ లోపలకు చొచ్చుకు వస్తున్న వాళ్లెవరు….మనుషులేనా….లేదా …….

ఇంట్లో ఉన్న వాళ్ళు …ఎవరు….. వాళ్లిద్దరూ …

త్వరలో ముగింపు …ప్రస్తుతానికి ….సశేషం

——————————-
Story written by
ప్రసాద్ ఓరుగంటి.

3 thoughts on “వాళ్లిద్దరూ….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s