వంద రోజులు vs వంద కోట్లు.

అప్పుడే..బయట నుండి వచ్చి తన కుర్రాడి నెత్తినున్న కట్టును నిమురుతూ , ఒరే పిచ్చోడా , నీ వయసులో నేను కూడా ఇలాగె చేసి , అందరితో గొడవపడుతూ …మొత్తానికి నిన్ను కష్ట పడీ చదివిద్దామనుకుంటే నువ్వేటిరా ఇలా చేహసావు అని చిన్న మందలింపుతో తన 20 సంవత్సరాల క్రిందట కథ ను ఆరంభించాడు రామా రావు …
————————————————————————————————————————————–
ఒరే సుబ్బి గా, ఇవ్వాళా మనోడు బొమ్మ వత్తోంది. మనం అక్కడికెళ్లి పువ్వులు అవ్వి పట్టికేల్లాలి, అలాగే మనోళ్లందరికీ చెప్పి, ఆళ్ళను అన్ని పనులు ఆపెసుకోమని సెప్పి, వచ్చేమను ఏవంటావు రా..అని సైకిల్ మీద నుంచి ఒక కాలు కింద పెట్టి రామ రావు సుబ్బి గాడి తో చెప్పాడు. అప్పుడే ఆరవ ఇడ్లి ని కొబ్బరి పచ్చడి తో తింటూ..మనోడి బొమ్మ కి మనం కాకపోతే ఆ చిన్నా గాడు వాళ్ళు వచ్చి సేత్తారా, ఇదిగో ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత టీ తాగేహి నేను లాగించేత్తా అని అన్నాడు రామారావు తో సుబ్బి గాడు.శుభ్రం గా టిఫిను లాగించేహి , ఇదిగో మాణిక్యం ..ఇవ్వాళ్టిది , మొన్నటిది కలిపి తర్వాత ఇచ్చేత్తాను లే అని సైకిల్ ఎక్కి తుర్రున ఎగిరిపోయాడు సుబ్బి గాడు. ఒరే సుబ్బి గా ఈ సారి నా హోటల్ కి నిన్ను రానిత్తె, నా చెప్పు తో నేనే కొట్టుకుంటాను రా ..ఎదవా..అని డబ్బులు ఎగ్గొట్టిన సుబ్బి గాడి ని తిట్టుకుంటూ బజ్జి లు ఏయడానికి పొయ్యదగ్గెర కెళ్ళాడు మాణిక్యం.
*****

రామారావు, సుబ్బి గాడు మరియు కొంత మంది జనాలు కలిసి, సినిమా హాలు దగ్గెరకెళ్ళి, ఆ కథా నాయకుడి బొమ్మ కి ముస్తాబు చేసి, అప్పుడే కొన్న తాజా పూదండల్ని ఆ హీరో మెల్ల కి చుట్టి, ఈళ్ళు బొట్లు పెట్టుకుని సినిమా హాల్ ముందట పెద్ద హడావిడి చెహసారు.మరి ఈళ్ళు పెద్ద అభిమానులు కాబట్టి కొంచం ఎక్కువ ధరతో టికెట్ తీసుకుని, అందరకీ ఆ టికెట్ చూపిస్తూ …ఏదో మంచి ఘన కార్యం చేసినట్టు గర్వం గా హాల్ లో కి వెళ్లారు.. అలాగా ఎప్పడు ఈ హీరో సినిమా వచ్చినా, ముందర 10 రోజులనుండి అన్ని పనులు మానేసుకుని, దండలకి, పోస్టర్స్ కి అప్పు చేసీ మరీ గర్వం గా ఆ సినిమా చూసి ఆనంద పడేవారు.

మా వోడి సినిమా 100 రోజులు ఆడుతుంది రా, మీ వాడి సినిమా పట్టు మని 10 రోజులు కూడా ఆడదు, పందెం అంటే పందెం అనుకుని రామా రావు , సుబ్బి గాడు మనుషులు ఇంకొక హీరో అభిమానులతో అప్పలు చేసి మరీ పందాలు ఆడేవారు..అప్పుడు అలాగా అభిమానాన్ని వాళ్ళ హీరో లకి అంకితం చేసుకునేవారు.

మొత్తానికి అలాగా, ఆ హీరో సినిమా లు చుట్టూతా తిరుగుతూ, ఒక పని అనేది లేకుండా పెద్ద వాళ్లయ్యి , పెళ్లి చేహసుకుని ,ఆ వచ్చే వ్యవసాయ డబ్బులతో కాలక్షేపం చేసి, ఆ తరువాత కొంచం బుద్ది వచ్చి ,పై ఊరికెళ్ళి పైసలు సంపాదించ సాగాడు ఆ రామా రావు, ఇక సుబ్బి గాడు మరియు మిగతా జనాలయితే అదే ఊరులో ఉండి కాలక్షేపం చేసేత్తున్నారు ఆ నాలుగు న్యూస్ పేపర్ లతో మాణిక్యం బజ్జి తింటూ….
*****
ఆలా జరిగింది రా కన్నా అప్పట్లో అని తండ్రి , ఆ కుర్రాడికి చెప్పి ఇకనైనా జాగత్త గా ఉండరా బాబు అంటూ పెరట్లో కెళ్ళి దండెం మీద తువ్వాలు ఆరేస్తూ, ఏరా ఇంకా ఎవరి కుర్రాళ్ళకైనా తగిలాయా దెబ్బలు..అసలు ఎలా జరిగింది ఇవరం గా చెప్పు అని అక్కడనుండే అరిచాడు.

కుర్రాడు మొదలెట్టేసాడు ….నేను, ఇంకొంతమంది కుర్రాళ్ళు కలిసి మనోడి సినిమా కి ప్రీమియం ఆట కి యెల్లి ఆ సినిమా తప్పకుండ 100 కోట్లు దాటెత్తుంది , ఇంకోడి సినిమా వచ్చింది కదా అది పెద్ద ప్లాప్ అయిపోద్ది , వాడికి 10 కోట్లు కూడా రావు అనుకుంటూ , అక్కడున్న వాళ్లందరికీ చాక్లేట్లు పంచేసి, వచ్చేతుంటే , ఇంకోడి సినిమా అభిమానులు వచ్చి నాతొ ని, మన సుబ్బు అంకుల్ కొడుకు చిట్టి గాడి తో తగవు లాడటం మొదలెట్టేహరు.మేము ఎందుకు ఊరుకుంటాం మనోడి సినిమా మొదట 4 రోజుల్లలోనే 100 కోట్లు దాటెత్తది, అలాగే అమెరికా లో కూడా మంచి వసూల్ వచ్చేత్తాది అని అన్నాం. ఈ లోపులో అవతల వాడికి కోపం వచ్చి మన హీరో ని తిట్టేహడు.మన సుబ్బి అంకుల్ కొడుకు చిట్టి గాడు అవతల వాడిని కొట్టడం తో వాళ్ళ కి చిరెత్తుకొచ్చి మా ఇద్దరినీ బాదేహరు.
ఆ టైం లో ఇంక బండి ఎక్కి స్పీడ్ గా వచ్చేద్దామని అనుకుని వచ్చేతుంటే, అక్కడున్న స్పీడ్ బ్రేకర్ ని గుద్దేహం.హెల్త్మేట్ లేదు కదా అందుకే తలకి బొప్పి కట్టెహింది అని ఏడుపు స్వరం తో జరిగింది అంతా చెప్తున్నాడు తండ్రికి.

ఈ లోపులో వాళ్ళఇంటికి చుట్టం చూపుకు వచ్చిన ప్రసాదం గారు అంతా విని, ఒరే రామా రావు నువ్వు అప్పట్లో మనోడి సినిమా 100 రోజుల ఆడుతుంది అని తెగ పందాలు కాహేసి, అప్పులు చేసి మరీ వాల్ పోస్టర్స్ కి అలంకారాలు చేసి ఇలా అయ్యావు. నీ కొడుకు కొంచం అభివృద్ధి చెంది ఇప్పుడు 100 కోట్లు వత్తదా రాదా అని ఇలాగ దెబ్బలు తగిలించుకున్నాడు అని గట్టి గా అన్నాడు.

ఇది అంతా వింటూ, వంటింట్లో కూర తగురుతూ ఉన్న రామా రావు భార్య అంది, అవును ప్రసాదం బాబాయ్ గారు..అప్పట్లో ఈయన 100 రోజుల గురుంచి తపన, ఇప్పుడు వీడికి 100 కోట్లు గురుంచి తపన. వీడికి 100 రోజుల లోపలే పరీక్ష లున్నాయి, వీడు 100 మార్కుల పరీక్ష గురుంచి ఆలోచించట్లేదు కానీ 100 కోట్లు గురుంచి తెగ ఆలోచించేతున్నాడు అని విసుగ్గా వెళ్ళింది.

*********************************************************************************

– నీ ఇంటికి నువ్వే హీరో…నీ ఊరి కి మీరే హీరో లు..అంతే కానీ ఎవడో గురుంచి కొట్టుకి చావద్దు..మీ హీరోస్ ఎప్పుడూ హ్యాప్పీస్……

-ప్రసాద్ ఓరుగంటి.

2 thoughts on “వంద రోజులు vs వంద కోట్లు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s