ఊరూరా.. వాట్సాప్ కథలు

ఇంకా తెల్లవారలేదు. కోడి కూసే సమయం కూడా అవలేదు. ఆ నిద్ర మత్తు లో నుంచే మంచం కింద ఉన్న ఫోన్ తీసి, ఒక్కసారి కళ్ళను సాఫి చేసుకుని, వాట్సాప్ ని ఓపెన్ చేసేసి, నా గ్రూప్ లో కొత్త గా ఏమైనా మెసేజ్ వచ్చేసాయమో అని తెగ కంగారు పడిపోయి, కొత్త గా వచ్చినవి చూసుకుంటూ ఈ లోపులో ఇంకొక గ్రూప్ లో ఉన్న మంచి గుడ్ మార్నింగ్ పిక్చర్ ని ఈ గ్రూప్ లో పోస్ట్ చేసేసి హమ్మయ్య మొత్తానికి ఫస్ట్ మెసేజ్ నేనే పంపించాను అని సంబర పడిపోయి, దీనికి ఎవరైనా రిప్లై ఇచ్చి లైక్ చేస్తారేమో అని ఆ నిద్ర కళ్ళ తో కొంచం వెయిట్ చేసేసి, అయ్యో ఇంకా ఎవరూ ఇవ్వలేదంటూ మళ్ళీ నిద్ర లో జారుకునే వారు ఒకరు.

ఈ లోపులో మంచి కోట్స్ (మనిషి జీవితానికి ఉపయోగపడే మెసేజ్ లు), ఏ అబ్దుల్ కలాం గారినుంచో లేదా ఏదో మంచి వెబ్సైటు నుంచో లేదా ఇంకొక గ్రూప్ లో ఎవరో పెట్టిన కోట్స్ ని ఇంకొక గ్రూప్ లో పడేసి , ఈ మెసేజ్ లు మనకి కాదు పక్కనోడికే అన్నట్టుగా ఎంచక్కా ఫార్వర్డ్ చేసేసి పరవశించి పోయేవాళ్లు మరి కొందరూ.

ఇంక ఏ గుడ్ మార్నింగ్ మెసేజ్ వచ్చినా, లేదా ఏ మంచి కోట్ మెసేజ్ వచ్చినా వెంటనే దాన్ని లైక్ చేసేసి పంపిన వాళ్ళకి ఇలాగ కృతజ్ఞత తెలుపుకుందామని అనుకునే వారు మరి కొందరు.

చేసిన ఫార్వర్డ్ మెసేజ్ లే చేసి చేసి చేసి , సంబర పడే వాళ్ళు కొందరు అయితే , అప్పుడే కొత్త గా గ్రూప్ లో జాయిన్ అయ్యి మళ్ళీ అదే పాత ఫార్వర్డ్ మెసేజ్ తో కొత్త సభ్యులని పలకరించి ,పులకరించే కొత్త సభ్యులు.

దేవుళ్ళ పేరు చెప్పి, ఈ మెసేజ్ ని కనీసం పది మందికి పంపక పొతే మీ తలలు పది చెక్కలు అవుతుందని అని కొందరంటే, ఆ మెసేజ్ లు పంపిన వాళ్లకు పది కాలాలు పాటు ఈ ఫార్వర్డ్ మెసేజ్ లు ఫ్రీ అనే వాళ్ళు కొంత మంది.

ఇంక పుట్టిన రోజులకి, పెళ్లి రోజులకు ఆ రోజు 300 మెసేజ్ లు 600 లైక్ రిప్లైస్ తో కళ కళ లాడి పోతూ , అయ్యో గ్రూప్ లో నేను రిప్లై ఇవ్వకపోతే ఆ వ్యక్తి యెంత బాధ పడతాడో అని ఫీల్ అయిపోయి వాళ్ళు చాలా మంది.

కొంత మంది లెక్క లతో , పజిల్స్ తో గ్రూప్ సభ్యుల విజ్ఞానాన్ని పరీక్షించి పరీక్షించి, పరవశించే వాళ్ళు కొంత మంది.

ఇదే మంచి సమయం అనుకుని, రాసిన కథలను ఈ గ్రూప్ లో పెట్టేసి, వాళ్ళ తో చదివించేసి, వాళ్ళ మన్నలను పొందేసి, తపించపోయే నా లాంటి వాళ్ళు కొంత మంది.

గ్రూప్ లో ఉంటూ, పెట్టిన మెసేజ్ లు చూసేస్తూ, ఏవిధమైన రిప్లై లు ఇవ్వకుండా, అందరి సమాచారం తెలుసుకుంటూ ,గుప్తం గా ఉండే వాళ్ళు కొంత మంది.

ఇలాగ రకరకాల మనసులు కలసి ఉన్న మనుషులను కలిపి, అందరిని ఒక తాటి పై నడిపిస్తూ, ఏదైనా ఒక మంచి చేద్దాం అంటే, ” నేను ఉన్నా, నన్నూ కూడా కలుపుకోండి” అంటూ వచ్చే గ్రూప్ సభ్యులకి .. ఏ సమస్య కైనా దానికి పరిష్కారం ఒకటి ఉంటుంది, అది మనం ఇద్దాం అని గర్వం గా చెప్పే ప్రతీ గ్రూప్ కి హాట్స్ ఆఫ్ చెబుతూ …..

ప్రసాద్ ఓరుగంటి

2 thoughts on “ఊరూరా.. వాట్సాప్ కథలు

Lalitha TSకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s