రాయల్ Express (స్వర్ణ యుగం to సెల్ యుగం)

అది 1517 సంవత్సరం …కృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్న రోజులు..అలాగే అష్ట దిగ్గజాలు అలరింప చేస్తున్న సమయం. ఇది మాకు స్వర్ణ యుగం లాంటిదే.
నేను చక్కగా వ్యవసాయం చేసుకుంటూ, పాడి పంటలతో అమ్మా, నాన్న లతో ఉంటూ ఎంతో ప్రశాంతం గా జీవిస్తున్న రోజులు.అప్పుడప్పుడు రాయలు వారు జరిపే ఊరు సంబరాలలో పాల్గొంటూ, స్నేహితులతో చలాకి గా ఉంటూ మంచి జీవితం గడుపుతున్న రోజులవి. మాది హంపి పక్కనూరు కావడం తో రెండు ఎడ్ల బండి మీద హంపి కి వెళ్తూ , ఊరు లో పండిన ధాన్యం, కూరగాయలు, పళ్ళు హంపి బజారు లో అమ్ముకుని మళ్ళి ఊరికి రాత్రి రావడం, ఆ రాత్రి గుడ్డి దీపం లో అమ్మా నాన్న తో కలిసి భోజనం చేయడం….అలాగే అప్పుడప్పుడు ఊరు నడి మధ్యలో జరిగే సాంస్కృతిక కార్య క్రమాలని చూస్తూ ,హరికథలలో చెప్పే హనుమంతుని వేగం గురుంచో లేదా పుష్పక విమాన విశిష్టిత గురుంచో లేదా దేవతలు వాడే వాహనాలు గురుంచో ..
మా బంధువులు అందరూ చుట్టూ పక్క ల ప్రదేశం లో ఉండేవారు, ఎప్పుడైనా వెళ్ళాలసి వస్తే అప్పుడప్పుడు నడకతో , మరో అప్పుడప్పుడు ఎడ్ల బండి మీద వెళ్లి వాళ్ళ ని చూసి వచ్చేవాళ్ళం.

కొన్ని రోజుల తర్వాత మనసులో ఏదో అలజడి. ఏదో కొత్తది చూడాలి , వేగాన్ని చూడాలి…ఒక కొత్త వెలుగులతో నూతన ప్రపంచం కావాలీ…అని మనసులో తలచుకుంటూ ఒకరోజు బాగా అలసి, తర్వాత నిద్ర లో కి జారుకున్నా,
_______________________________________________________________________
అది 1880 సంవత్సరం, అమెరికా .అప్పుడే ఎడిసన్ బల్బు కనిపెట్టడం. ఇంక కొత్త బల్బు తో వెలుగు మయం. నా ముఖం కూడా మెరిసిపోతోంది యెర్రని బల్బు వెలుగు తో. ఒకటేంటి మెల్ల మెల్ల గా అన్నీ వస్తున్నాయి.అప్పటికే టెలిఫోన్ వచ్చి నాలుగు ఏళ్ళు అయ్యింది. ఈ నాలుగేళ్లలో కొన్ని సార్లు నా స్నేహితులకి ఫోన్ చేసి ఈ కొత్త ఫోన్ గురుంచి ముచ్చటించుకోవడం జరిగింది..కొంత కాలం తర్వాత నా తపన ఇంకా ఏదో కావాలీ..ఇంకా ఏదో కొత్త ప్రపంచం చూడాలి…..అని ఆరోజు న్యూ జెర్సీ లో ని ఎడిసన్ దగ్గెర ఉండే నా ఇంటి బ్యాక్ యార్డ్ లో కూచుని ఏదో ఆలోచిస్తూ …వేగం గురుంచి ఆలోచిస్తూ న్నా.
_________________________________________________________________________
ఆ వేగం కూడా…వచ్చింది..ఇంకో 25 సంవత్సరాలలో …ఆ నాలుగు చక్రాల వాహనం లో దూర దూర ప్రదేశాలకి బంధువుల దగ్గెరళి వెళ్తూ..అప్పుడప్పుడు ఫోన్ లో ముచ్చటించుకుంటూ ఉన్నా, మనసు ఇంకా ముందరకు వెళ్ళాలి…ఇంకా వేగం గా వెళ్ళాలి అనుకున్న కొన్ని సంవత్సరాలకి విమానం కూడా నన్ను పిలిచింది. దూరాలని దగ్గెర చేస్తూ…వాయు వేగం తో అవతల ప్రేదేశాలకి, మరో దేశాలకి వెళ్లడం ఒక ఆనందం.అలాగే కదిలే బొమ్మలను చిత్రీ కరించి, అది ఒక థియేటర్ లో మూవీ గా చూడటం జరుగుతోంది… నేను కోరుకున్న ప్రపంచం ఇది ….అద్భుత ప్రపంచం అని అనుకుంటూ ఉండగానే, మళ్ళి మనసులో మరో అలజడి…ఇంకేమైనా ఉందా..ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ.
________________________________________________________________________
వచ్చింది..నాకు కావలసిన మూవీస్ ని క్రికెట్ మ్యాచ్లని బుల్లి తెర మీద నుంచి చూడటం జరుగుతోంది. అప్పుడప్పుడు వీడియో క్యాసెట్టు ని VCP లో పెట్టుకుంటూ పాత సినిమాల ను ఇంట్లో సోఫా మీద కూర్చుని చక్కగా బుల్లి తెర మీద చూడటం జరుగుతోంది..చూస్తూ..చూస్తూ…ఇంకా చిన్న చిన్న వస్తువులతో ఆ మూవీస్ ని న్యూస్ ని పడుకుని చూస్తే యెంత బావ్వుంటుందో అనుకుంటున్నా…..
_____________________________________________________________________
అది 2001 .. ఇండియా, హైదరాబాద్. …..బాగా అభివృద్ధి చెందుతోంది. రోడ్లన్నీ కారుల తో, లేదా ద్విచక్ర వాహనాలతో రద్దీ ..అమీర్ పేట మరీ రద్దీ. కంప్యూటర్ కోర్సెస్ , పెద్ద పెద్ద banners జావా అని, శాప్ అని ..టెస్టింగ్ టూల్స్ అని..ఇంకా చాలా..చాలా..
చదువుకున్న కుర్రాళ్ళు అంతా జావా నేర్చుకుంటున్నారు, చదువులేనోళ్ళు అంతా బిజినెస్ చేసేసుకుంటున్నారు. ఈ జావా కుర్రాళ్ళు జాయ్ గా అమెరికా కి వచ్చేస్తున్నారు…నేను కూడా ఏదో నేర్చుసుకుని…ఆ నేర్చుకున్న దాంతో కొంగొత్త ప్రపంచాన్ని చేసేయాలని తపన….
ఇదేనా జీవితం..లేదు….ఇంకా కొత్త…మరో నూతన ప్రపంచం ..ఏది ..అదేదీ…నన్ను ఇంకా ముందరకి తీసుకెళ్తోంది..
_________________________________________________________________________
అది 2013 , ఇండియా ….సగం మంది బి-టెక్ కుర్రాళ్ళు అమెరికా వచ్చేసారు, SAP అనో, salesforce అనో…మిగతా వాళ్ళు ఇంకో దేశానికీ రెడీ అవుతున్నారు. అక్కడ కుర్రాళ్ళు బాగా సెటిల్ అవుతున్నారు.
కొత్త సెల్ ఫోన్ లు, కొత్త అప్ లు…మనుషుల మధ్య దూరం పెరుగుతోందా….లేదు నా తపన ఒకటే…నవ ప్రపంచం..కొంగొత్త లోకం. కావాలి..అది రావాలి. అనుకున్నది వచ్చింది ..సినిమా లని, న్యూస్ ని సెల్ ఫోన్ లలో నే చూస్తూ, అదొకరకమైన కాలక్షేపం.
________________________________________________________________________
ప్రస్తుతం … అక్కడైనా..ఇక్కడైనా…..ఎక్కడైనా…ఒకటే ..అదే అందరి మనసులోనుచి వచ్చే మాటలు whatsup ,ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ etc ,etc చక్కగా ఏది చేసుకున్నా, ఎక్కడున్నా స్నేహితులకి నేనిక్కడున్నా అని ప్రపంచ మొత్తానికి తెలేసేలాగా చేస్తున్నా.
టకాటకా చాట్ చేసేసుకుని తన యోగ క్షేమాలని సెల్ లో నే పంచు కుంటూ పండుగ చేసుకునే లోకం, సెల్ phoneనా ప్రపంచం……..మొత్తానికి నాకు కావలిసిన ప్రపంచం వచ్చేసింది….అనుకుంటూ…నవ్వుకుంటూ ఉంటె…ఎవరో నన్ను తట్టి లేపుతున్నారు…ఓహో అది మా అమ్మ….
_______________________________________________________________________
ఒరే, లేచి హంపీ సంతకు వెళ్లి నగలు కొనుకుని తెచ్చుకో, నీ కాబోయే పెళ్ళానికి పెడుదువు కానీ అని…..
మెల్ల గా లేస్తూ అనుకున్న.. నాకు వచ్చిన కల 600 సంవత్సరాల ముందర జరిగేది అని..మెల్ల గా రెండు ఎడ్ల ని బండి కి కడుతూ అమ్మ కి చెప్పా నా కల గురుంచి. అప్పుడు అమ్మ అంది ఒరేయి నీకు వచ్చింది కల కాదు, అది ఒక పీడా కల అని…ఎందుకంటె మనం ఉన్నది రాయలు వారి స్వర్ణ యుగం లో…మనకి వద్దు రా అలాంటి కొత్త కొత్త ప్రపంచాలు..అంటూ లోపలి కి వెళ్ళింది. నేను సరే అని నవ్వుకుంటూ హంపికి బయలు దేరా …
********************************************************************************
ప్రసాద్ ఓరుగంటి

7 thoughts on “రాయల్ Express (స్వర్ణ యుగం to సెల్ యుగం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s