నేనేంటి ఇలా..

అదో మత్తులో ఉన్న నాకు ఏవొ కొంచం కొంచం గా గుర్తుకు వస్తున్నాయి, ఆ మత్తు లో ఎప్పుడో జ్ఞాపకాలతో పాటు కొంచం భవిషత్తు కూడా భయం గా కనిపిస్తోంది.నేను మంచి గా బతకగలనా, నన్ను సమాజం వెలివేస్తుందా అన్న భయంకరమైన భవిషత్తు ను ఒక వైపు తలచుకుంటూ మెల్ల మెల్ల గా పాత జ్ఞాపకాలతో మత్తు గా వెనక్కి వెళ్తున్నా………

నేను ఒక బాగా డబ్బున్న కుటుంబం లో పుట్టిన మనిషి ని , నాన్న పెద్ద పారిశ్రామకవేత్త, అమ్మ కూడా నాన్న తో ఆ వ్యాపార వ్యవహారాలు చూసుకునేది. వాళ్లకు నేను ఒకే ఒక్క కొడుకుని. డబ్బుకి లోటు లేదు.చదివింది వరల్డ్ క్లాస్ స్కూల్స్ లో. నా స్నేహితులు కూడా నాకు తగ్గట్టు వారే.వాళ్లంతా సినిమా స్టార్స్ సన్స్ , పొలిటికల్ లీడర్స్ పుత్రులు, లేదా బడా పారిశ్రామకవేత్త ల బేటాస్. మా అందరి ఆలోచనా ఒకటే అదేంటంటే ఉన్న డబ్బుని బాగా ఖర్చు పెట్టి లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి, పలుకుబడి ఎలాగ ఉంది కాబట్టి ఏమి చేసినా పర్లేదు మనవాళ్ళు చూసుకుంటారు అనే ఒక రకమైన over confidence .

అప్పుడప్పుడు అమ్మ మాత్రం జాగ్రత్త గా ఉండూ అని చెప్తూ ఉండేది తనకి టైం దొరికినప్పుడు. అమ్మ మాటలని ఎప్పుడూ పట్టించుకోలేదు, అన్ని అలవాట్లు మెల్ల మెల్ల గా అవలీల గా అవలింప చేసుకున్నా. వీకెండ్ పార్టీ లని, ఫ్రెండ్స్ పుట్టిన్రోజులని,ఒకటేంటి ఆ వీకెండ్ పార్టీ లని వీక్ డేస్ పార్టీ లాగా మార్చి, మనీ కి లోటు లేదు కాబట్టి రకరకాల మద్యం తో , పలురకాల మగువలతో, అప్పుడప్పుడు మత్తు మందులతో ఇలా నా రోజు వారి కార్యక్రమం ప్రారంభం అలాగే దానితో నే ఆ రోజు పూర్తి చేయడం.

ఆ రోజు ఏమి జరిగింది.. ఇప్పటికి నాకు గుర్తుకు రావట్లేదు, ఆ రోజు పార్టీ లో తెల్లవార జాము వరకు పూర్తి గా మత్తు మందు తీసుకుని, ఇంటికి వెళ్తా అని స్నేహితులకి చెప్పి, ప్రచండమైన వేగం తో నా ఎక్సపెన్సివ్ కార్ లో ఇంటికి వెళ్తూ ….ఏమైంది ఇప్పటికీ నాకు గుర్తు రావడం లేదు…నేనింకా మత్తు లో ఉన్నానా….అసలు ఏమి జరిగింది…ఏమి జరుగుతోంది నాకు…….అవును కొంచం గుర్తు వస్తోంది..ఆ వేగం లో మత్తు లో కార్ అదుపు తప్పి అప్పుడే అటువైపు నుంచి వస్తున్న ఇంకొక కార్ ని గుద్దేయడం….

ఆ…నాకు కొంచం కొంచం వినిపిస్తున్నాయి.. ఎవరో మాటలు నా చెవులకి, “ఎవడో వీడు మత్తులో ఉన్నాడు మొత్తానికి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు, వీడి వలన ఆ కార్ లో పెద్దాయన మరియు అతని భార్య అనుకుంట వాళ్ళు మాత్రం బతకడం కష్టమే” అని మెల్ల మెల్ల గా సూదులతో చెవులలో పొడుస్తున్నట్టు గా ఉంది.

ఆ గుర్తు వస్తోంది ..నన్ను కూడా అంబులెన్సు లో తీసికెళ్ళడం..ఏదో చేతులకి, కాళ్లకి ఏవొ బ్యాండేజ్ లు కట్టడం గుర్తు వస్తోంది..ఆ కార్ లో వారికి ఏమైంది…వాళ్ళు ఎవరు..అని మెల్ల మెల్ల గా మత్తులో కి జారుకున్నా.
బ్రేకింగ్ న్యూస్ అంటూ వివిధ రకాల ఛానల్ వాళ్ళు , ఈ విషయం గురుంచి TV లలో మోత ఎక్కిస్తుంటే కానీ తెలియలేదు, నేను చేసిన తప్పిదం ఏమిటో అని, నేను ఏంటి ఇలా..నేను ఏంటి ఇలా.. అంటూ ఏడుస్తూ …ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయా.. TV లో చూపిస్తున్న అచేతనం గా ఉన్న నా తల్లి తండ్రులను చూస్తూ…
********************************************************************************
ఇలాంటి వి జరగడానికి కోటీస్వరుల పుత్రులు కానక్కర్లేదు, మత్తు లో ఉంటూ డ్రైవింగ్ చేసిన వారికీ జరిగే ప్రతిఫలం ఇదే.

మత్తు లో జరిగే ప్రమాదాలకు మర మత్తులు ఉండవు , అది నిజం

– Story written by
ప్రసాద్ ఓరుగంటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s