నా అమెరికా ప్రస్థానం (Part2 )

అలాగ మొత్తానికి బెంగుళూరు నగరం నుండి 18 గంటలు కూర్చుని అన్ని సముద్రాలని చుడుతూ పసిఫిక్ సముద్రానికి ఆనుతూ ఉన్న శాన్ఫ్రాన్సిస్కో నగరం లో ల్యాండ్ అయ్యాము .

అన్నాయి కి తెలుసు ఎలాగ వీళ్ళు ల్యాండ్ అయినా ఒక 2 గంటలు పడుతుంది ఈ పోర్ట్ అఫ్ ఎంట్రీ మరియు luggage బాగ్స్ రావడానికి , మెల్లగా ఫ్లైట్ టైం ని ట్రాక్ చేస్తూ వచ్చి మమ్మలిని రిసీవ్ చేసుకోవడం, మేము ఈ బాగ్స్ తో కార్ ఎక్కి ఆ ఫ్రీవే 101 మీదుగా ఎయిర్పోర్ట్ నుండి San Jose కి వచ్చి చేరడం ఆలా జరిగాయి.

వచ్చిన వెంటనే బాగ్ లు ఓపెన్ చేసి, కొత్త ఆవకాయ, తొక్కు పచ్చడి లాంటి పచ్చళ్ళను ఓపెన్ చేసేసి, ఇంకొక బాగ్ లో ఉన్న ఆత్రేయపురం పూతరేకులు మరియు మన అమలాపురం వారి గణపతి స్వీట్స్ హోమ్ నుండి తెచ్చిన బెల్లం కొమ్ములు & కార పూస ఓపెన్ చేయడం, తినటం జరిగాయి.

ఈలోపులో suhas & Medha నాకు తెచ్చిన టాయ్స్ ఏ బాగ్ లో ఉన్నాయని అడగటం, ఆ టాయ్స్ వాళ్లకు ఇచ్చి ఇంకో బ్యాగ్ లో ఉన్న  పాస్పోర్ట్ లు సర్టిఫికెట్ లు జాగ్రత్త గ బయటకు తీసి పోర్ట్ అఫ్ ఎంట్రీ ఆఫీసర్ I 94 డేట్ యెంత వరకు ఇచ్చాడో ఇంకో సారి చూసుకుని హమ్మయ్య మొత్తానికి కాలిఫోర్నియా వచేశామన్న కొంత హ్యాపీ ఫీలింగ్ ఒక వైపు. ఎందుకంటె అమెరికా వెళ్తావు అని బ్రహ్మ తలరాత రాసినా, మన వీసా వెంకన్న బాబు నీకు వీసా స్టాంపింగ్ ఖాయమన్నా, అమెరికా లో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత పోర్ట్ అఫ్ ఎంట్రీ ఆఫీసర్ ఇచ్చేదే ఫైనల్ తలా రాత కాబట్టి.

అమెరికా లో మరుసటి రోజు ఉదయాన్ని చూస్తూ,, మన వాళ్ళు ఏమి చేస్తూ ఉంటారో ఇప్పుడు అంటూ మనసు లో ఒక విధమైన చిన్న బాధ తో కూడిన జ్ఞాపకాలను తెచ్చుకుంటూ ఇంతలో నే ధైర్యం ని తెచ్చుకుని ఇప్పుడు వాళ్ళు TV లో సీరియల్ స్ చూస్తూ ఉంటారు మనసు లో అనుకుంటూ ఉండగానే అక్కడ నుంచి కాల్ రావడం, వాళ్లతో మాట్లాడి జరిగిన ప్రయాణ విషయాలను ,అన్ని స్వీట్స్ బాగానే వచ్చాయి ఆవకాయ నుంచి నూనె లీక్ అవలేదు, ఫ్లైట్ లో ఏమి ఫుడ్ పెట్టాడు ఇలాంటివన్నీ అప్డేట్ చేస్తూ ఉండగా, అన్నాయి ఒరే మేము ఆఫీస్ కి వెళ్తున్నాం అంటూ అనడం ఈ లోపులో జెట్ Lag వలన నిద్ర లో కి జారుకోవడం ఇలాగ కొన్ని అమెరికా లో ని రాత్రులని ఇండియా పగలుగా ను అమెరికా పగలును ఇండియా రాత్రిళ్లు గ మార్చుకుంటూ ఆ జెట్ Lag లు కూడా పూర్తి చేసి ఇంకా అమెరికా సంగతి చూద్దాం అని అనుకున్నాం.

అలాగ శాన్ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జి, బే బ్రిడ్జి లని చూస్తూ మన అమలాపురం యెర్ర వంతెననో లేదా నల్ల వంతెన లాగో లేదా బెంగుళూరు లో కేర్ పురం బ్రిడ్జి నో కామెడీ గా compare చేసుకుంటూ , ఉషారు గా ఫ్రీవే 280 మీదుగా కొండలని చూస్తూ ఇంటి కి చేరుకొని ఫేస్బుక్ లో ఆ ఫోటో లను అప్డేట్ చేస్తూ ఎన్ని లైక్ లు వచ్చాయో అని ట్రాక్ చేసుకోవడం సూపర్ కదా .

ఇలాగ కొంత బే ఏరియా సంగతి ని అప్పుడప్పుడు చూస్తూ , ఒకే లే మనం కూడా డ్రైవింగ్ నేర్చుకుంటే బావుంటుంది మనం కూడా సరదాగా ఓన్ గా డ్రైవ్ చేసుకుంటూ ఆలా గా ఇలాగ తిరిగేయచ్చు అనుకుంటుంటే, Santa Clara లో ఉన్న చైనా వాడి డ్రైవింగ్ స్కూల్ ఉంది, వాడు కొంచం విసుగ్గా ఉన్నా బాగానే నేర్పుతాడు అని జనాలు అనడం తో చైనా వాడి వద్ద డ్రైవింగ్ శిష్యరికం చేశా.

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని అన్నాడు ఒక సినీ కవి, కానీ అది అమెరికాలో డ్రైవింగ్ విషయం లో పొరపాటే అని డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక తెలిసింది , ఈ డ్రైవింగ్ సీట్ లో కూచునే మూడు రోజుల ముందర డ్రైవింగ్ టెస్ట్ కి ప్రిపేర్ అయ్యి కాలిఫోర్నియా లో డ్రైవింగ్ రూల్స్ ని బట్టి బట్టి మరియు పాత టెస్ట్ పేపర్ లని కూడా రిఫర్ చేసి మొత్తానికి ఆ డ్రైవింగ్ రాత పరీక్ష లో పాస్ అయ్యి, డ్రైవింగ్ లైసెన్స్ పట్టా ను పొందా. అప్పుడెప్పుడో ఆంధ్ర యూనివర్సిటీ M B A కో లేదా ఎంసెట్ exam కో అలాగ బుక్స్ ని ముందర వేసుకుని చదవడం గుర్తు , తర్వాత ఈ నా కాలిఫోర్నియా డ్రైవింగ్ యూనివర్సిటీ వారి పరీక్ష దాని ప్రేపరషన్. మొత్తానికి ఆ పట్టా ని ఈ చైనా వాడి కి చూపించి ఆ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నా.

నేను ఇండియా లో కార్ ని నడిపిన అనుభవం తో ఇక్కడ డ్రైవింగ్ ని రఫ్ ఆడించేచ్చు అని కలలో మరియు నిజం గా కూడా అనుకున్నా, కానీ ఇక్కడ రూల్స్ కి ఆ చైనా వాడి విసుగు చేష్టలకి కొంచం కష్టమే అయిన నష్టం లేదు వీడికిచ్చిన డబ్బులకూ అని , ఏదో దీని అంతు చూసేద్దామని మొత్తానికి behind ది వీల్ డ్రైవింగ్ టెస్ట్ కి DMV కి వచ్చా.
నేను ఇండియా లో డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు ఆఫీసర్ పక్కన కూర్చుని మొదటి గేర్ వేయి ఆ..ఇప్పుడు రెండో గేర్ వేయి.. స్టాప్ …ఆ ..ఇప్పుడు రివర్స్ గేర్ వేయి అనేసి, సైలెంట్ గా కార్ దిగివెళ్ళిపోతే మనకి లైసెన్స్ వచ్చేసినట్టు గుర్తు అంటే మనవాళ్ళు మన కార్ ని ఎలా వాడతారో అని టెస్ట్ చేస్తారు అనుకుంట.
ఇక్కడ వచ్చేటప్పటికి దానితో పాటు స్పీడ్ లిమిట్ మరియు వీడు అసలు నడిచే జనాలని చూస్తాడా, సిగ్నల్ కి ఆగుతాడా, సిగ్నల్ జంప్ చేస్తాడా , కార్ ని రోడ్డు మీద నడుపుతాడా , ఇలాంటి వన్నీ కఠిన మైన కళ్ళతో ఆ ఆఫీసర్ పరీక్షంచడం,
అంతా బానే చేశాను అని కొంత గర్వం తో ఉండగానే , తనదైన శైలిలో చక్కటి చిరు నవ్వుతో అందం గా నువ్వు పాస్ అవలేదు అని ఆ ఆఫీసర్ స్వరం వింటున్నప్పుడు , విన్న ఈ స్టూడెంట్ డ్రైవర్ కి బాధ తో కూడిన కోపం వలన వచ్చిన విసుగు ని బయట పెట్టకుండా, ఓకే సర్ అని మెల్లగా బయటికి వచ్చి ఏమి చేయాలో ఆ టైం కి తెలియక, ఏమైంది అబ్బా అని ఒకసారి గింగిరాలు తిప్పితే (దోమల Tortoise ) , అవును కదా వాడెవడో నడిచేవాడు ఆ సైడ్ నుంచి వస్తున్నాడు, వాడు ఇటువైపు వచ్చేటప్పటికి కొంత టైం పడుతుంది కదా అని రైట్ టర్న్ తీసుకోవడం వలన వచ్చిన ఫలితం కదా అని మనసులో అనుకున్నా.

ఇండియా లో ఎవడినో నడిచే వాడిని విండో ఓపెన్ చేసి మరీ తిట్టే ఉంటాను ,ఇక్కడ వాడి శాపం అనుకుంటూ మొత్తానికి ఇంకో సారి బాగా రూల్స్ పాటిస్తూ ఒక పద్దతి గా ఒక వినయం గా మరియు చాకచక్యం గా నడిపి ఆ ఆఫీసర్ మన్నలను పొంది కాలిఫోర్నియా డ్రైవింగ్ పట్టా పొందడం , ఆ ఆనందం అంతా ఇంతా కాదు.

డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత బానే తిరుగుదామని అనుకున్న సమయానికి మేరీల్యాండ్ లో ని బాల్టిమోర్ వెళ్ళవలసి వచ్చింది ప్రాజెక్ట్ పని మీద.
అప్పటికీ ఇంకా ౩ /4 నెలలు అయ్యింది వచ్చి ఈ బే ఏరియా కి, మల్లి కొత్త ప్రదేశం కొత్త వాతావరణం అనుకుంటూ వెళ్ళాం, అక్కడ రెంటు కార్ తీసుకుని ఆఫీస్ కి వెళదామని వెళ్తున్నపుడు ఈ GPS పని చేయకపోవడం వలనో లేదా ఆ ప్రదేశం కొత్త అవడం వలనో మొత్తానికి ఒక ఎగ్జిట్ మిస్ అయ్యి ఇంకొక హైవే ఎక్కేయడం జరిగింది.
ఆ దారి చూపిన దేవత మా ఆవిడ అయ్యి, మల్లి GPS ని రీసెట్ చేసి గమ్యానికి పెట్టుతుండగా ఒక పోలీస్ కార్ మా పక్కనే పార్క్ చేసి గన్ తీసి ఆ పక్కన పార్క్ చేసిన కార్ లో ఉన్న కుర్రాళ్ల మీద పెట్టి, ఏదో అడుగుతుండం, మాకు ఇది ఒక విధమైన భయముతో ఏమి చేయాలో మేము కూడా కార్ దిగాలో , చేతులు పైకెత్తి నించోవాలో (అంటే సినిమా లో చూపిస్తారు కదా హాండ్స్-అప్ అని) అని అనుకుంటూ కార్ లో ఉండగానే పోలీస్ అక్కడనుంచి వెళ్లిపోవడం, ఈలోగా GPS రీసెట్ అయ్యి మా గమ్య స్థానాన్ని చేర్చడం ఇది ఒక చెప్పుకోలేని అనుభూతి.

ఉంటున్నది ఈస్ట్ కోస్ట్ కనుక అప్పుడప్పుడు మంచు తుఫాను లు పలకరించడం మాములే, మన ఈస్ట్ గోదావరికి వచ్చిన 96 తుఫాను ఇంకా నాకు తెలిసి కోన సీమ వాసులు ఇప్పటికి అది ఒక చేదు అనుభవం, ఒక నెల రోజులు కరెంట్ లేకపోవడం, రోడ్లు పాడై పోవడం, కొబ్బరి తోటలు పడిపోవడం లాంటివి. ఇప్పటికి గుర్తు మా వీధిలో అందరు కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవడం, ఎందుకు వచ్చిందనా ఈ టాపిక్ అని మీ మనసు ని అడిగే ప్రశ్న, అవును బాల్టిమోర్ లో ఉంటున్నప్పుడు టీవీ లలో, న్యూస్ లోను హోరు ఎత్తించారు.

ఎలాగ అంటే వచ్చే మంచు తుఫాన్ వలన కరెంటు ఉండదు, కార్ డ్రైవింగ్ చెయ్యద్దు, ఇంట్లోనే ఉండండి గ్యారేజీ లో దాక్కోండి, ఫుడ్ మరియు వాటర్ స్టోర్ చేసుకోండి అని వాళ్ళ strom వార్నింగ్ ఎలా ఉందంటే ఇంట్లోనే చావండి బయటకు వచ్చి చావకండని . పక్కనే ఉంటున్న తెలుగు వాళ్ళని అడిగితె వాళ్ళకి మా కన్నా ఇంకా కంగారు మాస్టర్స్ అవడం తో, అవును ఇప్పుడే అన్ని MILK , బ్రెడ్ అన్ని తెచ్చుకుందాం Walmart లో అంటే ఇంకా హడావిడిగా వెళ్లి వీటిలితోపాటు Rice అవి తెచ్చుకుని, ఎలాగ weather డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ కూడా ఉండదంటున్నారు అని భయం తో మేము పులిహోర చేసుసుకుని ఉంటె బా ఉంటుంది అని అనేసుకున్నాం.

మంచు పడటం బానే ఉంది, TV లు, Weather ఛానల్ అన్ని బానే ఉన్నాయ్. ఒక్క పులిహార తప్ప, ఎందుకంటే కరెంటు పోకపోవడం వలన చేసేసిన పులిహారని తినాలా పడేయాలా అనుకుంటూ కొంత తింటూ ,తిట్టుకుంటూ మొత్తానికి ఆ తుఫాన్ నుండి బయట పడ్డాం. అందుకే ఇప్పటికి పులిహార అంటే ఆ మంచు తుఫాన్ గుర్తువస్తుంది చేస్తే తినాలా వద్దా అని, మా పక్కింటి వాళ్ళైతే ఒట్టు పెట్టుకున్నారట ఎప్పటికి ఇంకా బ్రెడ్ తినమని ఎందుకంటె ఆ తుఫాన్ లో అదే తిన్నారు కాబ్బటి.

ఈ లోపులో మళ్ళీ బే ఏరియా నుంచి పిలుపు వచ్చింది అక్కడే ప్రాజెక్ట్ ఉంది వచ్చేయండి అని, మళ్ళీ మన అన్నాయి మన బే ఏరియా అనుకుంటూ హ్యాపీ గా San Jose కి బయలు దేరాం. బే ఏరియా లోని విరిజల్లు రేడియో వారు దీపావళి ధమాకా కాంటెస్ట్ అని రేడియో లో హోరు యెత్తిస్తుంటే, మనం కూడా కాంటెస్ట్ చేద్దాం లే అని ఏదో ఒక రికార్డు చేసిన పాటలు, కొన్ని సినిమా డైలాగ్స్, ఒక వెరైటీ యాడ్ పంపిస్తే దాంట్లో సెలెక్ట్ అవడం, రేడియో వాళ్ళు పిలిచి గిఫ్ట్స్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది, ఇలాగ ప్రతీ సంవత్సరం పార్టిసిపేట్ చేయడం ఏదో బహుమతి రావడం జరిగాయి. అప్పుడు అనిపించింది ఈ సారి ఫామిలీ అందరిని పార్టిసిపేట్ చేయించి పెద్ద గిఫ్ట్ కొట్టాలని అనుకోవటం, ఆ సంవత్సరం నిజం గా అన్ని గిఫ్ట్స్ మా ఫ్యామిలీకే రావడం ఇప్పటికే ఆనందమే.

ఏదైనా పండగలు వస్తే సిలికాన్ ఆంధ్రా వాళ్ళ హడావిడి అంతా ఇంతా కాదు, వాళ్ళ తెలుగు నాటకాలు , అవధానం, పద్యాలు, నేను ఇంతవరకు ఇండియా లో ఉన్నప్పుడు ఎప్పుడు అంత దగ్గెర నుండి అసలు చూడలేదు. చిన్న పిల్లల కి తెలుగు పాఠాలు నేర్పే మన బడి , వాళ్లతో పద్యాలూ నాటకాలు వేయేంచే ఇక్కడ టీచర్స్ కి ఎప్పుడు ఇక్కడ తల్లి తండ్రులు కృతజ్ఞత తో ఉంటారు.

ఇంక బాటా వారు ప్రతీ వారం సినిమా వాళ్ళనో, సింగర్స్ నో తీసుకుని వస్తూ ఉంటారు, S P బాలు ని, చిత్ర ని, ఇళయరాజా ని కూత వేటు దూరం లో చూసి వాళ్ళ పాటలని వినడం చాలా హ్యాపీ అలాగే మన కీరవాణి గారిని, అయిన బృందాన్ని చూసి మరీ పాటలు వినడం మనసుకి ఎంతో ఆనందం.
ఒకసారి దేవి శ్రీ ప్రసాదు వాళ్ళ గ్యాంగ్ వచ్చినప్పుడు, దేవి పాటలకి డాన్స్ లు చేయడం ఒక అనుభూతి అయితే ఇంకో సారి సినీ హీరో నిఖిల్, కలర్స్ స్వాతి వచ్చినప్పుడు వాళ్ళ తో కలిసి స్టేజి మీద డాన్స్ చేయడం ఇంకొక అనుభూతి.

సిలికానాంధ్ర వాళ్ళు తీసుకువచ్చిన నేత్రా అవధానం ను చూసిన అమ్మా, నాన్నలు ఇప్పటికి ఇంకా ఆమ్మ చెప్తూ ఉంటుంది ఆ ప్రోగ్రాం నా నేత్రాలలో తిరుగుతుంది రా అని, ఆ కార్యక్రమం అయిన వెంటనే ఉగాది పచ్చడి మరియు కమ్మని తెలుగు భోజనం ఇవన్నీ అమెరికాలో మన ఆంధ్రా వాళ్ళు జరుపుతున్న కార్యక్రమములు కమామీషు.అంటే మనం తెలుగు తనం యేమి మిస్ అవట్లేదు అని చెప్పడం.

ఇంక మన తెలుగు రెస్టారెంట్ లు అయితే ఉలవచారు కానీ, ఆంధ్రా భవన్ లు మన తెలుగు రుచి ని యెక్కడా మిస్ చేయకుండా వడ్డించి మరీ తినిపించడం, మన మాణిక్యం బజ్జి ని మర్చిపోయేలాగా ఇక్కడ ఉలవచారు లో మైసూర్ బజ్జి, తెలుగు name బోర్డు తో పెసరెట్టు అని, టిఫిన్స్ తిందామంటే మన తమిళ సర్వనా భవన్ అని, కొంచం బిరియాని ని రుచి చూద్దామంటే Paradise లేదా బావర్చి బిర్యానీని, ఇవన్నీ ప్రతీ వీకెండ్ లో టచ్ చేయాల్సిందే.

ఇంక తెలుగు సినిమా విషయానికొస్తే అక్కడ కన్నా ఒక రోజు ఇక్కడ ప్రీమియర్ షో అని ముందరే రిలీజ్ చేయడం, థియేటర్ ముందర మన జనాలు డీసెంట్ గా టికెట్ గురుంచి వెయిట్ చేస్తూ టికెట్ తీసుకోవడం, అత్తారింటికి దారేది మూవీ కి అయితే కట్ అవుట్ ఒకటి తప్పా అన్ని హంగులు థియేటర్ ముందర చేయడం ఇవన్నీ ఒక సినీ ప్రేక్షకుడికి కనుల విందే కదా .

పేరెంట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ క్లాస్ మేట్స్ ని ఫామిలీస్ ని అందరిని ఇక్కడ కలవడం అనేది వాళ్ళకి మాకు అది ఎప్పటికి తీపి గుర్తు.
అప్పుడప్పుడు ఆప్యాయం గా కాల్ చేస్తూ మన ఊరు ముచ్చట్లతో మునసబుగారి శాస్ట్రీ , నేను బాల్టిమోర్ లో ఉన్నప్పుడు విన్న కోట గణేష్ & ఫామిలీ వాళ్ళ ఆప్యాయత ని ఎప్పటికి గుర్తు పెట్టుకోవలసిందే. ఎప్పుడొస్తున్నావు ఎప్పుడొస్తున్నావు మా ఇంటికి అంటూ పిలిచి మరీ భోజనం పెట్టిన బుచ్చి మాస్టర్ గారి మణి ని, మన బాబీ గారి లలితా & బద్రీ ని,  అప్పుడప్పుడు  పలకరించే  మన సరిపెల్ల బాబ్జీ  మరియు కాంబాబు గారి శారదా ని , డ్రైవింగ్ అంటే ప్రాణం పొసే మన రాంమూర్తి గారి శ్రీనివాస్ ని ఇక్కడ కలవడం, నేను ఉన్నాను అంటూ మన దత్తు గారి నిరంజన్, అప్పుడప్పుడు హలో అనే మన పట్టాభి గారి శ్రీనివాసు ,అలాగే మన మాణిక్య శర్మ గారి సూరిబాబు గారిని & భయ్యా ని మరియు సూరిబాబు గారి తమ్ముడు నూకల పేరప్ప గారిని,బుచ్చి మాస్టర్ గారి శేషు నర్సు వాళ్ళ పిల్లలు ప్రకాష్, వెంకటేష్ & అజయ్ లను ఇక్కడ చూడటం కలవటం చాలా హ్యాపీ, అలాగే అనుకోని అతిధి మన బాబీ గారు మా ఇంట్లో ఉండి ఆయన స్టడీస్ గురుంచి మరియయు భజనల గురుంచి కబుర్లు చెప్పటం, అలాగే అగ్నిహోత్రుని గారి బాచి గారి ని కలవడం ఇవన్నీ ఇక్కడ జరగడం చాలా హ్యాపీ కదా.

ఇండియా లో ఈ పేరెంట్స్ అందరూ ఎప్పుడు కలుసుకున్నారో కానీ, ఇక్కడ మాత్రం రెండోల్లోకొకసారి మాత్రం తప్పకుండ కలుసుకుంటూ వాళ్ళ స్కూల్ లైఫ్ గురుంచో, వాళ్ళ ఉద్యోగాల గురించో లేదా అప్పట్లో దేవుడి పెళ్లి ఇలాగ జరిగేదని , లేదా బుల్లి వెంకన్న గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ గురుంచో చెప్పుకుంటూ ఎవరో పిల్లల ఇంట్లో ఈ కార్యక్రమం పెట్టి భోజనాలు చేస్తూ చాలా సరదాగా గడుపుతూ ఉండడం చాలా ఆనందాన్ని ఇస్తుంది.

ఇంతా బావున్నా ఏదో వెలితి , ఏంటంటే ఏదో తెలియని మన మనసుకు మాత్రమే తెలిసి ఎక్కడో దూరం గా 9000 మైల్స్ దూరం లో ఉంటూ మన వాళ్ళని రోజు Face time లోనో skype లోనో చూస్తూ మాట్లాడుతున్నా మనం వాళ్ళ దగ్గెర లేము అని ఒక రకమైన ఫీలింగ్, మళ్ళీ వాళ్ళ దగ్గెర నుంచే వచ్చే ధైర్యానికి , ప్రోత్సహానికి మళ్ళీ బలం పుంజుకుంటూ మేము అన్ని మైల్స్ దూరం లో వున్నా రోజు మీ దగ్గరే ఉంటాము అని వాళ్ళకి ధైర్యం చెప్తూ, ఇక్కడ ఉద్యోగాలలో చాలా బిజీ గా ఉంటూ కష్ట పడుతూ ప్రతీ డాలర్ కి విలువ ఇస్తూ ఇదొక రకమైన కాలక్షేపం.

ఏదేశ మేగినా ఎక్కడున్నా చూడరా నీ తల్లి తండ్రులను, ఆప్తులను
మరువకురా నువ్వు పుట్టి పెరిగిన ప్రదేశాన్ని

జై హింద్ -ప్రసాద్ ఓరుగంటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s