అనాతవరం క్రికెట్ కధలు

అనాతవరం క్రికెట్ కధలు :

ఎందుకో మన ఊరు క్రికెట్ చరిత్ర గురుంచి నేను చూసినప్పటినుంచి, నాకు తెలిసిన విషయాలను నా బ్లాగ్ లో వ్రాయాలనిపించింది.
చెప్పాలంటే మన గ్రామ బహిర్గత క్రీడ (Outdoor Sport ) క్రికెట్టే అని బాట్ తో కొట్టి మరీ చెప్పచ్చు.ఎప్పటికైనా మన ఊరి అంతర్గత క్రీడ (ఇండోర్ sport ) పేకాట అనుకోండి అది వేరే విషయం.

అప్పుడు రెండో వీధి, మూడో వీధి కుర్రాళ్ళు బాటరీ బళ్ళు , దొంగా పోలీస్ లు లేదా విస్సప్ప గారి ఇసక కొట్టు లో గోడ మీద ఇటుకలు అరగదీసి పొడుం చేయడం లేదా టైర్ లు దొర్లించుకోవడం ఇలాంటి ఆటలు ఆడుతున్న సమయం. అప్పుడపుడు ఒకటో వీధి కుర్రాళ్లతో ఈ వేరు వేరు ఆటలతో గొడవలు పడటం జరిగేయి.

అకస్మాత్తుగా ఒక్కసారి ఈ క్రికెట్ వచ్చి ఈ మూడు వీధుల కుర్రాళ్లను ఒక్క పిచ్ మీద కి తీసుకువచ్చి ఒకే ఆట మీద గొడవపడటం, మంచి గా ఆట నేర్చు కోవడం చేసింది. మూడు వీధి కుర్రాలందరికి ఒకటే ఆట అదే క్రికెట్ క్రికెట్ క్రికెట్.

రెండో వీధి మూడో వీధి కుర్రాళ్లకు క్రికెట్ కిట్టు ని ప్రప్రధమం గా అందించినవారు విస్సప్ప గారి ఫణి మరియు వెత్సా బుజ్జి (ఇతను లేడు ఇప్పుడు), వీళ్లు ఇద్దరు క్రికెట్ ఎక్కువ ఆడేవారు కాదు కానీ ఇలాగ ఎంకరేజ్ చేసేవారు.

నాకు తెలిసి మొదట ఇసక కొట్టు లో రబ్బరు బాలు తో ప్రారంభం అయిన ఈ క్రికెట్ కి అప్పుడపుడు పొరుగూరి క్రికెట్ ఆటగాళ్లు కూడా వచ్చి పలకరించే వాళ్ళు, .అలాగ క్రికెట్ ను శెలవులు వచ్చినప్పుడు అయితే పొద్దునుంచి సాయంకాలం వరకు ఆడుతూనే ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు పేరి విస్సు వచ్చి ఆ గోడ బయట నుండి ఆటగాళ్ల ను పలకరిస్తూ ఉండటం, నారాయుడు ఐస్ అమ్ముతూ తన మార్కెటింగ్ స్కిల్స్ ను అక్కడ కుర్రాళ్ల మీద ప్రయోగిస్తూ, ఆ ఇసకొట్టు చుట్టూ తిరుగుతూ ఉండేవాడు , ఎప్పటికైనా ఈ పిల్లలు ఆట లో అలిసి తన ఐస్ కొంటారేమోనని.

కొంత కాలం తర్వాత పిచ్ ని మార్చి రాంబాబు మాస్టర్ పాత ఇంట్లో ఆడే వాళ్ళం.
అక్కడ అయితే పాలగుమ్మి రమేష్ వాళ్ళ ఇంటి పై కప్పు కి తగిలితే 6 అని ,ఆ గోడ కి దొల్లుకుంటూ తగిలితే 4 అని పెట్టుకుని మరీ ఆడేవాళ్ళం , వాళ్ళ ఇంటి పెరట్లో పడితే అవుట్ ఇలాగ రూల్స్ పెట్టుకుని, ఎందుకు అప్పుడే చీకటి పడిందా అని తిట్టుకుంటూ మళ్లీ మరుసటి రోజు గురించి వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళం

ఇలాగ చిన్న చిన్న గా ఇక్కడా, అక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉంటె, ఒకటో వీధి కుర్రోళ్ళు వచ్చి మనలో మనం ఆదుకోవడం కాదు పొరుగూరు మీద ఆది మన పరువు తేల్చుకుందాం అనేసరికి, రెండూ, మూడు వీధి కుర్రాళ్ళు కూడా సై అంటే సై అని ఒక పెద్ద టీం ని తయారు చేసి పొరుగూరు భట్నవిల్లి మీద మ్యాచ్ లు పురమాయించడం, ఇప్పుడు రబ్బరు బంతి తో కాకుండా కార్క్ బాల్ తో ఆడటం ఆ భట్నవిల్లి టీం ని చిత్తు చిత్తు చేసి ఆనాతరం జెండా ని అక్కడ పాతి ఆనాతరం క్రికెట్ అంటే ఏంటో అని రుచి చూపించారు.

అప్పటికే సీనియర్ టీం మంచి ఫామ్ లో ఉండేది , క్రికెట్ టీం కి 11 మంది మాత్రమే ఉండాలిని అన్న కాన్సెప్ట్ ఎవరు పెట్టారో కానీ అది నాకు మాత్రం గొప్ప ఇబ్బంది పెట్టింది.మా ఇంట్లో ముగ్గురు కాబట్టి అన్నలు నరేష్ & రమేష్ లకి సీనియర్ టీం లో ప్లేస్ ఉండేది నాకు ఎప్పుడు ఉండేది కాదు.సైకిల్ తొక్కుకుని మ్యాచ్ లు చూసి చప్పట్లు కొట్టి రావడమే . నాకు తెలిసిన టీం :

ప్రసాద్ (మాల్కమ్ మార్షల్): ఈయన ఫాస్ట్ బౌలర్, తక్కువ పరిగెడుతూ బాల్ ను సూపర్ ఫాస్ట్ గా వేసి ప్రత్యర్థులని బెంబేలెత్తిచండం

రాంబాబు: (కెప్టెన్) 1 డౌన్: సూపర్ బాట్స్మన్ , కూల్ గా ఆడుతూ మ్యాచ్ లని నగ్గిచడం లో దిట్ట, అప్పుడ్డపుడు చిన్న టీం లతో ఆడి అక్కడా గొని పెట్టి ఎప్పుడూ మొట్ట మొదట బాటింగ్ చేసి almost అన్ని ఓవర్ లు ఆడేసి లాస్ట్ ఓవర్ ఇంకోడికి ఇవ్వడం,

గౌస్: (అలెన్ బోర్డుర్): ఓపెనింగ్ బాట్స్మన్, చాల బాగా ఆడుతూ, ఎపుడైన ఆట లో తాను 4 కొడితే తన దైన శైలిలో చేతులు చూపిస్తూ కూల్ డ్రింక్ ని తెమ్మని ఆదేశించడం, పాపం ఎవరు ఎప్పుడు ఇవ్వలేదు అది వేరే విషయం

నరేష్:(వసీం అక్రమ్): తన లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ తో ప్రత్యర్థులని కన్ఫ్యూజ్ చేసి అప్పుడప్పుడు వికెట్స్ తీయడం, ఇంకో సారి 6 లు ఇవ్వడం కూడా అనుకోండి.

చంటి : ఇతను బాటింగ్ కి వస్తే బౌలర్ లకి ధడే, కొడితే 4 లేదా 6 అంతే, ఇంకోటి ఉండదు.మనోడు క్యాచ్ లు పట్టడం లో దిట్ట. మంచి ఫీల్డర్. ఇతని ఇంకో ప్రతిభ ఏంటి అంటే ఒకసారి టీం లో జనాలు లేకపోతె, అక్కడ గేదులు కాసుకునే కుర్రాళ్లలో ఇద్దరినీ ఎంచు కుని వాళ్ళ తో ఆడి టీం ని గెలిపించడం.తరువాత ఈయన స్ఫూర్తి తో తీసినవే  హిందీ మూవీ లు  లగాన్ మరియు చక్ దే, అలాగే తెలుగు లో వచ్చిన కబడ్డీ కబడ్డీ.

పానుగంటి రమేష్: మంచి బాటింగ్, కాని మనిషి దొరికేవాడు కాదు , బ్రతిమాలి తీసుకురావాల్సి వచ్చేది.

పానుగంటి రవి: మంచి ఫీల్డర్, ఇంకో పేరు Logie .

ఓరుగంటి రమేష్: ఇతను, గౌస్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ లు, గౌస్ కి అప్పుడప్పుడు అండ గా నిలబడేవాడు

మునసబు గారి శాస్త్రి : సూపర్ వికెట్ కీపర్, వికెట్ల అవతల చైనా వాలే.ఇతను సైకిల్ మీద వెళ్లి కష్టపడీ , పొరుగూరు లతో మ్యాచ్ లని పురమాయించడమే కాకుండా మన టీం ప్లేయర్స్ ఇంటి కి వెళ్లి వాళ్ళ ని కూడా బతిమాలడం.

విశ్వనాథం మాస్టర్ గారి గణేష్ : ఇతను మునసబు గారి శాస్త్రీ కి ఆప్త మిత్రుడు, ఈయన మ్యాచ్ లను పురమాయించడం లో శాస్త్రీ కి సహాయ పడేవాడు

వెత్సా సురేష్ (సురేష్ ఒబెరాయ్): ఇతగాడు అనాతరం లో ఉన్నప్పుడు ఇసక కొట్టులోనూ ఆడి, క్రికెట్ బాగా నేర్చుకుని విదేశీ  (అమలాపురం) జట్టులో ఆడేవాడు. పక్క ఊరులు టోర్నమెంట్ మ్యాచ్ లలో అమలాపురం నుండి ఆడుతు కనపడేవాడు.ఇతను మంచి బౌలర్ మరియు బ్యాట్స్మన్.

అనుపిండి శ్రీనివాస్: మంచి స్పిన్ బౌలర్, తను తిరుగుతూ బాల్ ను తిప్పడం లో దిట్ట, అప్పుడప్పుడు టీం లో ప్లేస్ ఉండేది కానీ మంచి టీం ప్లేయర్

కాశీరాజు గారి గోపి: ఇతగాడికి ఏ ఆట అన్నా ప్రాణం,  రాంబాబు కి మంచి అనుచరుడు.టీంని నగ్గిచండం లో ఇతని చెయ్యి కూడా ఎప్పుడు ఉండేది.

సుందరం గారి శేఖర్: నా బెస్ట్ ఫ్రెండ్ (ఇప్పుడు లేడు), సూపర్ ఫాస్ట్ బౌలర్ మంచి బ్యాట్స్ మాన్, క్రికెట్ అంటె ప్రాణం
ప్రసాద్ వాళ్ళ బాండు: అప్పుడప్పుడు వచ్చేవాడు, ఒకసారి మాత్రం కామన గురువు తో లాస్ట్ బంతి లో మూడు రన్ లో కొట్టాలి అంటె 4 కొట్టిన ఘనత ఈయనదే, ఇప్పటికి ఆ ఊరు వాళ్ళు మర్చిపోరు అనుకుంట

మద్రాస్ విస్సు: కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఈయన బాట్ పట్టుకుంటే అందరు బౌండరీస్ దగ్గెర ఉండాల్సిందే ఈయన 6 అడుగుల పర్సనాలిటీ చూసి.

రామరాజు: ఈయన కూడా అప్పుడప్పుడు ఆడుతూ , మంచి టీం supporter

కర్రా రామకృష్ణ (సునీల్ గవాస్కర్): ఇతను భీమనపల్లి  క్రికెట్ టీం బోర్డ్ అధ్యక్షుడు, కోచ్ మరియు ఆటగాడు.ఇతను తాను ఆడిన మ్యాచ్ రికార్డు లను భద్రం గా చార్ట్ ల మీద రాసుకుని ప్రదర్శిస్తూ ఉండేవారు.అప్పుడప్పుడు క్రికెట్ కామెంటరీ కూడా చేసేవాడు.అనాతరం మీద బాగా ఆడినట్టు ఆయన చార్ట్ లలో ఎప్పుడు కనిపించలేదు.మంచి బ్యాట్స్మన్.

అజ్జరపు (పూర్తి పేరు తెలియదు): ఇతనికి  క్రికెట్ అంటే పిచ్చి, కర్రా రామకృష్ణ గారి అభిమాని , ఇతనికి అనాతరం టీం తో ఆడటం అంటే చాల ఇష్టం, ఎప్పుడు గం నవులుతూ మంచి బాటింగ్ చేస్తూ ఉండేవాడు.

పెంటపాటి కృష్ణ : ఈయన ఆనాతరం టీం కి జూనియర్ టీం అయినా సీనియర్ టీం అయినా, ఈయన రాకుండా మ్యాచ్ జరిగేది కాదు. ఈయన పెద్ద మనిషి గా ఉండి ఆయా టీం ల లో గొడవలు వచ్చినప్పుడు అవతలవాళ్ళకి సర్ది చెప్పి టీం ని గెలిపించడం లో ఈయన హస్తం చాలానే ఉండేది

నేను (Author of this బ్లాగ్): ఎప్పుడూ సీనియర్ టీం లో ప్లేస్ లేదూ, కాబట్టి ఒక జూనియర్ టీం ని తయారు చేసి దాని లో నైనా కెప్టెన్ గా ఉందామని అనుకుని అది మాత్రం సాధించిన వీరుడు, శెట్టిపేట, సావరం టీం లతో ఆడుతూ అప్పుడప్పుడు నెగ్గుతూ ఇంకో అప్పుడపుడు ఓడిపోతూ , సీనియర్ మ్యాచ్ ల కి  చప్పట్లు కొట్టటం, అప్పుడప్పుడు ఎవడైనా సీనియర్ ప్లేయర్ రాకుండా ఉంటె బావుంటుందని కోరుకోవడం.

నూకల జానవేశ్వర్ శర్మ (జాను): ఇతగాడు జూనియర్ టీం సభ్యుడు , రెండూ కాళ్ళ కి పాడ్స్ కట్టుకుని, చేతికి గ్లోవ్స్ అన్ని పెట్టుకుని మొట్ట మొదటి బాల్ కి మాత్రమే వెనుదిరిగే వీరుడు, బౌలింగ్  ఇవ్వక పొతే మాత్రం చుక్కలు చూపే ధీరుడు . మంచి టీం ప్లేయర్

పాలగుమ్మి రమేష్: ఇతగాడు తన దైన శైలి లో బాటింగ్ ఆ డుతూ 4 కి ఎలా ఎప్పుడు వెళ్లిందో అతనికే తెలియక పోవడం అతని గొప్పతనం, మంచి టీం ప్లేయర్

నూకల సత్తి : ఈయన మ్యాచ్ లు పురమాయించడం, మన టీం ఓడి పోతున్న సందర్భం లో ఆ బాల్ ను చెరువులో కప్పి , మన టీం మరియు ప్రత్యర్ధ టీం ఆ బాల్ ని చెరువులో వెతికి వెతికి అలిసి సొలసిన తర్వాత ఇతగాడు ఆ బాలు ని తీసి విజయ గర్వం తో టీం కి ఆ బాల్ ను సమర్పించడం లో ఆయనకి ఆయనే సాటి మన సత్తి.

వెత్సా రాజా:ఇతను క్రికెట్ ఊరు లో ఉన్నప్పుడు  మాత్రమే ఆడేవాడు, అప్పుడప్పుడు మేనల్లుడు బాలు ని తీసుకొస్తూ ఉండేవాడు.వీళ్ళు అమలాపురం వెళ్లిన తర్వాత రాజా క్రికెట్ ఆడినట్టు తెలియదు.

అద్దంకి మన్నారు (విస్సు): ఈయన క్రికెట్ ఆడటం కన్నా, ఈ కుర్రాళ్లను కంట్రోల్ పెట్టడం లో శ్రద్ద పెట్టేవాడు.మంచి టీం supporter

నూకల ఫణి బాబు (హిట్టర్): ఇతగాడు చూడటానికి సన్నం గా ఉన్నాడు కదా, బాట్ కూడా పట్టుకోలేడమో అని ప్రత్యర్ధులు అనుకుంటూ ఉండగానే, తన సిక్స్ లు 4 లతో వాళ్ళ కి రుచి చూపించిన అప్పటి మేటి వీరుడు మన హిట్టర్ బాబు, మరియు మన సత్తి బాబు కి సహాయం చేస్తూ ఉండేవాడు బాల్ ని టీం కి సమర్పించడం లో

నూకల రాము: ఇతను జూనియర్ టీం లో సభ్యుడు, మంచి టీం ప్లేయర్ మరియు మన సత్తి బాబు కి సహాయం చేస్తూ ఉండేవాడు బాల్ ని టీం కి సమర్పించడం లో .

పాలగుమ్మి సురేష్: ఇతగాడికి జూనియర్ టీం లో ప్లేస్ ఇవ్వకపోతే, తను ఇంకో టీం ని తయారుచేసి బౌలింగ్ లో తన ప్రతిభ ని ప్రదర్శించి న గొప్ప క్రికెట్ వీరుడు.

మాణిక్యం (మాణిక్ బాషా): ఇతను తన కాఫీ హోటల్ చూసుకుంటూ కుర్రాళ్ల తో క్రికెట్ ఆడటం, ఇతను పాము బౌలింగ్ లో ప్రావీణ్యత పొందాడు.ఇతని కండలు చూసి కలవరం చెందేవాళ్ళు ప్రత్యర్ధులు, కానీ ఇతగాడు మాత్రం చక్కగా చాల తొందరగానే పవియులిన్ కి వచేసేవాడు.

విన్నకోట గణేష్: ఇతను గేట్ లోనుండి వచ్చి ఇసక కొట్టులోనూ,రాంబాబు మాస్టర్ గారి ఇంటి వద్ద మాత్రమే ఆడినట్టు  గురుతు.ఇతగాడు క్రికెట్ మీద ఎక్కువ శ్రద్ద పెట్ట కుండా అక్కడ కుర్రాళ్లతో కబుర్లతో తో కాలక్షేపం చేసేవాడు.

పేరిచర్ల మురళి: ఇతను కూడా జూనియర్ టీం లో ప్లేస్ లేకపోతె తను పాలగుల్లమి సురేష్ టీం తో ఆడుతూ తన బౌలింగ్ ని ఆల్మోస్ట్ కర్ణాటక లెవెల్ లో తీసుకుని వెళ్లిన ఘనత ఈయనదే
పేరిచర్ల పృధివి : ఈయన కూడా మంచి బౌలర్.

హనుమాన్ గుప్త: ఈయన అప్పుడప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడు, మంచి టీం సపోర్టర్

గాదె రవి: ఈయన ఒంటి చేత్తో బాల్ వేయడం లో ఈయన దిట్ట, కానీ సీనియర్ టీం కి గాని జూనియర్ టీం లో గాని ఈయన పెద్ద గా ఆడలేదు.

అప్పుడపుడు అమెరికా నుండి వచ్చి రవి సాస్ట్రీ లాగా స్పిన్ వేసి అవతల టీం కి సాఫ్ట్వేర్ లోనే కాదు మ్యాచ్ ని కూడా తిప్పేస్తాను అంటూ వచ్చే మన మునసబు గారి కిరణ్,

అలాగే తన దైన శైలి లో ఆడే మునసబు గారి రవి

పైన చెప్పిన వాళ్ళందరూ ఆట గాళ్ళు అయితే, తను మ్యాచ్ ను దగ్గెరుండి నెగ్గిం చాలని సత్తి కొండ గారు ఆ మ్యాచ్ కి వచ్చి అక్కడ ఆట గాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ , ACB లో sponsor గా ఉండటం.

రామభద్రుడు గారు అయితే, TV లో వచ్చే మ్యాచ్ ని చూస్తూ కుర్రాళ్లు తో పాటు కేరింతలు కొట్టడం.
శీనప్ప గారు అయితే ఎవడో కుర్రోడు TV లో 6 కొడితే అరిచాడని, ఆయన వాడి నడ్డి మీద చరచడం ఇవన్నీ మన ఊరు క్రికెట్ లో భాగాలే.

ఇంకా చెప్పాలంటే చాల ఫన్నీ సంఘటనలు జరిగాయి, అవి ఏంటేంటే

అది జూనియర్ క్రికెట్ టీం వరుసగా విజయాలు సాధిస్తున్న సమయం పక్క పక్క ఊరులు మీద, ఇదే ఊపులో అనాతరం హై స్కూల్ గ్రౌండ్ లో టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అంతకముందర అన్ని విజయాలు మావే కనక కొంత ఆత్మ విశ్వాసం , కొంత చాల ఎక్కువ ఆత్మ విశ్వాసం (ఓవర్ కాంఫిడెన్స్) ఉంది.

దీనితో పాటు ,సొంత పిచ్ , సొంత చెరువు.ఏదైనా మ్యాచ్ తేడా గా ఇటు అటు ఉంటె ఆ బాల్ ను ఎలా దక్కించుకోవాలో టీం లో చాల మంది కి అవగాహనా, ఆత్మ స్తైర్యం అలవాటే కనుక “మనదే మ్యాచ్, మనదే కప్పు ” అనే నినాదం తో ఆ టోర్నమెంట్ ఫైనల్ మన టీం కి మరియు ముక్తేశ్వరం కి హోరా హూరున జరిగింది.

కానీ మ్యాచ్ ఫలితాలతో అనాతరం టీం ని దురదృష్టం వరించి, అనాతరం టీం ఫైనల్ లో ఓడిపోయింది.
ఎక్కడైనా మాములుగా నెగ్గిన వాళ్ళకి (Winners ) కి కొంచం పెద్ద కప్పు ఇస్తారు, Runners కి చిన్నది కానీ లేదా షీల్డ్ లు ఇస్తారు .ఇది నైజం. కానీ ఇక్కడ రివర్స్ గా విన్నెర్స్ కి షీల్డ్ (అప్పుడే వేసిన రంగుల వాసన తో కూడినది ), Runners కి పెద్ద కప్పు మన ఊరి పెద్ద మనుషలు తో ఇప్పించడం తో అవతల టీం వారు అది తట్టుకోలేక గొడవలు పెట్టడం తో మళ్ళి మన పెద్ద మనుషులు పెద్ద మనసుతో ఆ కప్పు ను వాళ్ళ కి ఇచ్చివేయడం జరిగింది.అనాతరం టీం కి అప్పుడే వేసిన రంగుల వాసన తో మరియు వికారం గా అంటించిన కాగితాలు తో కూడిన షీల్డ్ ని అందచేయడం జరిగింది.

ముందటి రోజు రాత్రి స్టీరింగ్ కమిటీ మీట్ అయ్యి కొన్ని చర్చలు జరిగాయి అవి ఏంటి అంటే , అనాతరం నగ్గితే కప్పు ఆల్రెడీ ఉంది (ఆ కప్పు అంతకుముందు సీనియర్ టీం ఫైనల్ లో తెచ్చుకున్న కప్పు) కాబట్టి ఆ కప్పు మనకే ఉంటుంది, కొత్త గా కోనక్కరలేదు. ఈలోపులో ఆకాశవాణి “మరి మీరు ఓడిపోతేనో అని ” అన్నట్లు అనిపిస్తే, దానికి కూడా ఒక ప్లాన్ గీసి పాత షీల్డ్ ఉంటె దానికి రంగులు రాసి కొత్త గా ఇస్తే వాళ్ళు ఆ కొత్త రంగుల వాసన తో మైమరచి ఏదైనా తీసేసుకుంటారు అని ముక్త కంఠం తో శేఖర్ వాళ్ళ ఇంట్లో డిసైడ్ అయ్యిపోయి “మనదే మ్యాచ్, మనదే కప్పు” అని కలలు కన్నాం.

మ్యాచ్బా అటు ఇటు ఉంటె బాల్ ని ఎలా దక్కించుకోవాలో తెలిసిన టీం కి ఇంత పెద్ద కప్ ని అవతల వాళ్ళకి ఎలా ఇచేశామో అని ఇప్పటికి క్వశ్చన్ నాకు.

ఇది అండి నేను ఆడి నాకు తెలిసిన క్రికెట్ మరియు క్రికెట్ వీరులు.

ఈసారి మళ్లీ ఇండియా వెళ్ళినప్పుడు శెట్టి పేట తోనో , సావరం తో నో మ్యాచ్ ని పురమాయించాలి.

– ఒక ఆనాతరం క్రికెట్ వీరుడు
ప్రసాద్ ఓరుగంటి

4 thoughts on “అనాతవరం క్రికెట్ కధలు

  1. Good attempt. This is version 2.0. Cricket started much earlier in Anathavaram. When we were playing jore ball , kotha kabaddi in those days, it’s nayudu gopi (ranganayaki gari) who came from mandapeta introduced by brining the bat and wickets. me , Babi and srinu were the 1st set of players. This is in way back 1974 when Westindies visited india under the leadership of clive lloyd , we at anathavaram also raised the bar and fever for the sport. It went for a long time till we three finished our degree/engg. Me and srinu limited our cricket till Intermediate Babi became famous in college cricket also. Had he got the right coaching he would have replaced Jovagal Srinadth of India team !!!

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

N C Venkata Ratnamకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s