నా అమెరికా ప్రస్థానం (Part 1)

పాఠకులకి నమస్కారం

అప్పుడప్పుడు కొందరి కొందరి బ్లాగ్ లు చదవడం వలనో, లేదా తెలుగు సాహిత్యం మీద ఇష్టత పెరగడం వలనో లేదా ఎలాగ సోషల్ మీడియా చాల వాడి గా వేడి గా ఉంది కదా అది వాడేసుకుని జనాల మీద జనరంజకం గా ఈ బ్లాగులు జల్లుదామని అనో ఏమో, నేను కూడా ఏదో రాసేద్దామని అనుకుంటూ వచ్చిన చిన్న “నా అమెరికా ప్రస్థానం ”

హ్యాపీ గా బెంగుళూరు whitefield లో నివసిస్తూ Samsung ఆఫీస్ కి ఫ్రీ గా ఆఫీస్ బస్సు లో వెళ్తూ, టిఫిన్ మరియు లంచ్ బాక్స్ పట్టికెళ్తారా అని మా ఆవిడా అంటే, ఎందుకు మన ఆఫీస్ వారు ఫ్రీ బస్సు తో పాటు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ మరియు ఫ్రీ లంచ్ కూడా ఇస్తారు కదా, అక్కడే తినేస్తాను అని అంటూ ఆఫీస్ కి వెళ్తూ ఉండేవాణ్ణి .

అప్పడప్పుడు ఆఫీస్ వారి ఫ్రీ బస్సు ని ఉపయోగించకుండా మారుతి Wagonr లో నేను మా ఆవిడా ఆఫీస్ కి వెళ్తూఉండేవాళ్ళం, సగం బెంగళూరు సాఫ్ట్వేర్ నిపుణులు whitefield , ఐటీపీల్ చుట్టుపక్కల ఆఫీస్ లకి వస్తే మేము whitefield నుంచి సివిరామం నగర్ కి రివర్స్ ట్రాఫిక్ లో చక్కగా కొంచం అర్ధమయ్యి అర్ధమవని కన్నడ FM పాటలు వింటూ ట్రాఫిక్ సిగ్నల్స్ పడితే విసుకుంటూ అప్పుడప్పుడు సిగ్నల్స్ జుంపింగ్ చేస్తూ ఆఫీస్ లకి చేరుకునేవాళ్ళం.నా కంగారంతా ఆఫీస్ లో బ్రేక్ఫాస్ట్ అయిపొతుందెమో అని కొంత బెంగ. కొంత కాదు చాలా బెంగ.
మా ఆవిడ ఆఫీస్ కూడా మా ఆఫీస్ కి కూత వేటు దూరం లో ఉండేది, అలాగా ఆఫీస్ లో కొంత పని తో పాటు పాటలు, ఆటలు కూడా చేస్తూ సాయం కాలానికి ఇంటికి చేరి మల్లి Samsung TV ముందర కూర్చుని ఏదో తెలుగు ధారావాహికలు లేకపోతె పనికిమాలిని న్యూస్ ఛానల్స్ చూసుకుంటూ అదో రకమైన కాలక్షేపం.

అదృష్టం ఏమిటంటే ఆఫీస్ వాళ్ళ సెక్యూరిటీ గోల వలన లాప్టాప్ లు ఇంటికి ఇవ్వకపోవడం తో రాత్రంతా పైవిధం గా కాలక్షేపం చేస్తూ , ఆఫీస్ లో చేసిన ఈరోజు పని ని మల్లి ఏమి చేసానో మరుసటి రోజు ప్రొద్దున ఆఫీస్ బ్రేక్ఫాస్ట్ అయినా తర్వాత కానీ గుర్తువచ్చేది కాదు.ఈ లాప్టాప్ లు ఇంటికి ఇస్తే అది యెంత భయంకరమ్ గా ఉంటుందో అది మీకు ముందర తెలుస్తుంది

ఆఫీస్ లో breakfast చేసి కొంత పని చేసిన తర్వాత గ్రూప్ గా కెఫెటీరియా కి వెళ్లి అక్కడ అరగంట కన్నడ రాజకీయాల తో కాఫీ తాగి, మళ్లీ లంచ్ టైం కి గ్రూప్ అందరిని పోగుచేసుకుని ఈసారి తెలుగు సినిమాల గురుంచో, లేదా తమిళ రాజకీయాల గురించో అప్పుడప్పుడు మలయాళ కబురులతో గంట లేదా ఒక గంటన్నర తో ఆరోజుకి లంచ్ ని పూర్తి చేసి మళ్లీ టీ వేళ కి సమయానికి వచ్చేండి అని సైగలతో మా సైన్యం కి చెప్పి కొంత పని చేసి ఆ టీ వేళ టీం తో తక్కువ సమయం గడిపి ఇంక మళ్లీ కలుద్దాం లే రేపు అంటూ ఉండగానే ఈ ఆఫీస్ బస్సు ల హ్యాంకింగ్ తో ఓహో అప్పుడే గో ధూళి వేళ అయ్యింది కదా మనం కూడా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఆ ఫ్రీ బస్సు లోనో లేదా మా మారుతీ వారి wagaonr లో నో ఇంటికి వెళ్ళేవాణ్ణి

శని ఆదివారాలు అయితే ఇంకొక రకమైన కాలక్షేపం , కారు వేసుకుని ఫోరమ్ వేల్యూ మాల్ కి వెళ్లడమో లేదా జయనగరో/జేపీ నగరో ఆ భయంకరమైన ట్రాఫిక్ లో మనకి మాత్రమే డ్రైవింగ్ బాగా వచ్చి అనుకుని ఎదురుగా వచ్చేవాడు వెళ్ళేవాడు డ్రైవింగ్ వచ్చో రాదో అని ఒకవిధమైన టెన్షన్ తో కూడిన భయం వలన వచ్చిన విసుగులతో మొత్తానికి ఇంటికి చేరుకోవడం ఇలాగ వీకెండ్స్ అయిపోయేవి, మల్లి షరా మాములే, సోమవారం సామ్సన్గ్, ఆఫీస్, బస్సు, ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.

ఇలా నమ్మ కన్నడ దేశ రాజధాన్ని మరియు దక్షిణ కొరియా దిగ్గజం అయిన శంసుంగ్ కంపెనీ ని యేలే సమయము లో మా ఆవిడా ఒక విషయాన్నీ నా చెవిని వేసింది , నాకు కాగ్నిజెంట్ వాడు H1B చేసేటట్టు ఉన్నాడు అమెరికా వెలితే ఎలా ఉంటుందని , నాకు అప్పుడనిపించలేదు ఈ త్రీ ఫ్రీ (బస్సు, టిఫిన్ & లంచ్) లు తో పాటు చాలా మిస్ అవుతానని, ఎలాగ అన్నాయి ఉన్నాడు కదా ఇక్కడ నమ్మ బెంగుళూరు కాకపొతే అక్కడ క్యాలిఫోర్నియ కాలింగ్ అనుకుంటూ, ఒకే H1 అప్ప్రోవ్ అయితే అమెరికా కి చెక్కేద్దాం,ఆ అమెరికా అంతు చూసేద్దాం అని మా ఆవిడా తో అనడం జరిగిపోయాయి.

ఆ రోజు రానే వచ్చింది H1 అప్ప్రోవ్ అయ్యింది మనం స్టాంపింగ్ కి చెన్నై కి వెళ్లాలని , ఇంకేముంది బెంగుళూరు నుంచి చెన్నై నగరానికి స్టాంపింగ్ కి వెళ్లి దిగ్విజయము గా పాస్పోర్ట్ లో అమెరికా వీసా ను వేయుంచుకుంది మా ఆవిడ.కొద్దీ నెలలో నేను కూడా ఇలాగే దిగ్విజయము గా పాస్పోర్ట్ లో అమెరికా వీసా ను వేయుంచుకుని ఇక శంసుంగ్ కి మరి గుడ్ బై చెప్పాలి కాబట్టి మేనేజర్ తో ఇలాగ అమెరికా
వెళ్తున్నాని చెప్పడం, ఆ మేనేజర్ కి కూడా ఎప్పుడో డాలర్ డ్రీం ఉండడం తో నేను వెలితే తను అమెరికా వెళ్ళినట్టేనని ఫీల్ అయిపోయి ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు samsung వస్తువులు కాక ఏదో ఆపిల్ వారి ఐపాడ్ లేదా ఐఫోన్ నాతొ టి తెచుకోవచ్చునని అని మనసులో అనుకుని,కొంచం టచ్ లో ఉంటె బావుంటుంది అని అనడం, టీం మేట్స్ కూడా తెగ ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఫేర్వెల్ పార్టీ ఇచ్చేయడం.

ఇలాగ నా కలల కంపెనీ ని మరియు కన్నడ నగరానికి గుడ్ బాయ్ చెప్తూ బెంగుళూరు నుంచి అమెరికా కి
బయలుదేరాం

ప్రసాద్ ఓరుగంటి
(Part 2 coming soon )